సంభాల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరుగుతున్న తవ్వకాల్లో ఈరోజు(గురువారం) మరో అద్భుతం బయటపడింది. జామా మసీదుకు 100 మీటర్ల దూరంలో ఒక బావి కనిపించింది. ఈ బావి హిందువులు అధికంగా ఉంటున్న ప్రాంతంలో ఉంది. దీనిని మృత్యుబావిగా చెబుతున్నారు. ఇక్కడికి సమీపంలోనే ఒక ఆలయం ఉందని, అది మృత్యుంజయ మహాదేవ్ ఆలయం అని స్థానికులు అంటున్నారు. ఈ ఆలయం ప్రస్తుతం మట్టిలో కూరుకుపోయింది. ఇక్కడ తవ్వకాలు జరిపితే ఇక్కడ ఆలయం తప్పకుండా కనిపిస్తుందని అంటున్నారు.
సంభాల్ ఒకప్పుడు పుణ్యక్షేత్రంగా ఉండేది. పురాణాల ప్రకారం సంభాల్‌లో 84 ప్రదక్షిణల మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో 68 పుణ్యక్షేత్రాలు ఉన్నాయని చెబుతారు. అలాగే 19 బావులు ఉన్నాయని, వాటిలో ప్రతిదానికీ ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అంటారు. ఇప్పుడు స్థానికులు ఈ తవ్వకాల పనుల్లో పాల్గొంటూ విలువైన ఆధారాలు సేకరిస్తున్నారు. సంభాల్‌ను మతపరమైన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా యంత్రాంగం చెబుతోంది.
ఇటీవల సంభాల్‌లో చోటుచేసుకున్న హింసాయుత ఘటనల కారణంగానే ఈ ప్రాంతం వార్తల్లో నిలిచింది. ఈ నేపధ్యంలోనే స్థానిక పరిపాలనాధికారులు ఇక్కడ తవ్వకాలు ప్రారంభించారు. అదిమొదలు ఇక్కడ పలు చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద బయటపడుతోంది. ప్రస్తుతం ఇక్కడి చందౌసిలో కనిపించిన పురాతన మెట్ల బావిని శుభ్రం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మృత్యు బావి బయటపడింది. దీనిలో అందులో స్నానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని స్థానికులు చెబుతారు. ఇక్కడికి కొద్ది దూరంలో యమదగ్ని కుండ్ కూడా ఉందని అంటున్నారు. దీని కోసం పరిశోధనలు ప్రారంభమయ్యాయి.
ఇక్కడ మృత్యుంజయ దేవాలయం కూడా ఉండేదని, తమ ముందు తరాలవారు తమకు ఈ విషయం చెప్పారని, పరిశోధిస్తే అది కూడా బయటపడుతుందని స్థానికులు అంటున్నారు. దాని గోడలు కూడా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం మట్టిలో కూరుకుపోయిన కట్టడాలను పరిశోధించేదిశగా ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం మృత్యుబావిని కనుగొనేందుకు తవ్వకాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో చందౌసిలో పలు పరిశుభ్రతా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: 20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి..
Comments
Please login to add a commentAdd a comment