temple construction
-
బయటపడిన మృత్యుబావి, మరో మందిరం
సంభాల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరుగుతున్న తవ్వకాల్లో ఈరోజు(గురువారం) మరో అద్భుతం బయటపడింది. జామా మసీదుకు 100 మీటర్ల దూరంలో ఒక బావి కనిపించింది. ఈ బావి హిందువులు అధికంగా ఉంటున్న ప్రాంతంలో ఉంది. దీనిని మృత్యుబావిగా చెబుతున్నారు. ఇక్కడికి సమీపంలోనే ఒక ఆలయం ఉందని, అది మృత్యుంజయ మహాదేవ్ ఆలయం అని స్థానికులు అంటున్నారు. ఈ ఆలయం ప్రస్తుతం మట్టిలో కూరుకుపోయింది. ఇక్కడ తవ్వకాలు జరిపితే ఇక్కడ ఆలయం తప్పకుండా కనిపిస్తుందని అంటున్నారు.సంభాల్ ఒకప్పుడు పుణ్యక్షేత్రంగా ఉండేది. పురాణాల ప్రకారం సంభాల్‌లో 84 ప్రదక్షిణల మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో 68 పుణ్యక్షేత్రాలు ఉన్నాయని చెబుతారు. అలాగే 19 బావులు ఉన్నాయని, వాటిలో ప్రతిదానికీ ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అంటారు. ఇప్పుడు స్థానికులు ఈ తవ్వకాల పనుల్లో పాల్గొంటూ విలువైన ఆధారాలు సేకరిస్తున్నారు. సంభాల్‌ను మతపరమైన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా యంత్రాంగం చెబుతోంది.ఇటీవల సంభాల్‌లో చోటుచేసుకున్న హింసాయుత ఘటనల కారణంగానే ఈ ప్రాంతం వార్తల్లో నిలిచింది. ఈ నేపధ్యంలోనే స్థానిక పరిపాలనాధికారులు ఇక్కడ తవ్వకాలు ప్రారంభించారు. అదిమొదలు ఇక్కడ పలు చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద బయటపడుతోంది. ప్రస్తుతం ఇక్కడి చందౌసిలో కనిపించిన పురాతన మెట్ల బావిని శుభ్రం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మృత్యు బావి బయటపడింది. దీనిలో అందులో స్నానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని స్థానికులు చెబుతారు. ఇక్కడికి కొద్ది దూరంలో యమదగ్ని కుండ్ కూడా ఉందని అంటున్నారు. దీని కోసం పరిశోధనలు ప్రారంభమయ్యాయి.ఇక్కడ మృత్యుంజయ దేవాలయం కూడా ఉండేదని, తమ ముందు తరాలవారు తమకు ఈ విషయం చెప్పారని, పరిశోధిస్తే అది కూడా బయటపడుతుందని స్థానికులు అంటున్నారు. దాని గోడలు కూడా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం మట్టిలో కూరుకుపోయిన కట్టడాలను పరిశోధించేదిశగా ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం మృత్యుబావిని కనుగొనేందుకు తవ్వకాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో చందౌసిలో పలు పరిశుభ్రతా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: 20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి.. -
కల్కి ధామ్ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన
-
శరవేగంగా అయోధ్య రామ మందిర నిర్మాణం
-
కొలువుదీరిన కోదండరామయ్య
నెల్లిమర్ల రూరల్: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం నీలాచలం బోడికొండపై సోమవారం కోదండ రాముడు కొలువుదీరాడు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేదమంత్రోచ్ఛారణల మధ్య పండితుల ఈ క్రతువును వైభవంగా జరిపించారు. రామతీర్థం క్షేత్రం యావత్తూ జైశ్రీరామ్ నామస్మరణతో పులకించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంతో ఈ ఆలయం మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంది. రూ.3 కోట్ల నిధులతో పూర్తయిన కోదండ రామస్వామి వారి నూతన రాతి దేవాలయంలో గడిచిన మూడ్రోజులూ తిరుపతి, ద్వారకా తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు నిర్విరామంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను పూర్తిచేశారు. వేకువజామున యాగశాలలో విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కుంభారాధన, దాతాది సామాన్య హోమం, పూర్ణాహుతి, యంత్ర, బింబ స్థాపనలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కోదండ రామస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం మంత్రులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దిగువనున్న ప్రధాన ఆలయంలో సీతారామస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పెనుమత్స సూర్యనారాయణరాజు, ఇ.రఘురాజు, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి చిన వెంకట అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ హరిజవహర్‌లాల్, కలెక్టర్ సూర్యకుమారి, ప్రత్యేకాధికారి భ్రమరాంబ ఎంపీపీ అంబళ్ల సుధారాణి, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
చిన్న వయసు.. పెద్ద మనసు
సాక్షి, గాలివీడు (కడప): ఆ బాలుడి వయసు పదేళ్లు.. అందరు పిల్లల్లాగా ఆడుతూ పాడుతూ తనదైన లోకంలో విహరించడంతోనే సరిపెట్టుకోలేదు. సొంతూరులోని ఓ ఆలయ పునరుద్ధరణకు భూరి విరాళమిచ్చి పెద్దమనసు చాటు కున్నాడు. వివరాలిలా.. గాలివీడుకు చెందిన భువనేశ్వరి సింగపూర్‌లో ఉంటున్నారు. ఆమె కుమారుడు బండ్లకుంట బాహుబలేయ. గాలివీడులో శిథిలావస్థలో ఉన్న చారిత్రక పురాతన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దాతల సహకారంతో పునరుద్ధరిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాహుబలేయ తాను నాలుగేళ్లుగా పొదుపు చేసుకున్న రూ.50 వేల నగదును విరాళంగా అందించాలనుకున్నాడు. తన అమ్మమ్మ లక్ష్మిదేవి, తాతయ్య దివంగత పులి వెంకటరమణల పేరు మీద రాయచోటిలోని కుటుంబ సభ్యుల ద్వారా నగదును శనివారం కమిటీ సభ్యులకు అందజేశాడు. -
చంద్రబాబు కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి శ్రీకారం
సాక్షి, అమరావతి: విజయవాడలో గత ప్రభుత్వ హయాంలో కూల్చి వేసిన తొమ్మిది ఆలయాల పునః నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం భక్తి శ్రద్ధలతో శంకుస్థాపన గావించింది. ఆగమ పండితులు నిర్ణయించిన 11.01 గంటల ముహూర్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు ధరించి, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. కృష్ణా నది ఒడ్డున సీతమ్మ వారి పాదాల చెంత రాతి కట్టడంతో శనైశ్చర ఆలయాన్ని పునః నిర్మించ తలపెట్టిన ప్రదేశంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో పాటు ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న శ్రీదుర్గ మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణకు రూ.77 కోట్లతో (రూ.7 కోట్లు ఆలయాలవి) రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న 8 పనులకూ భూమి పూజ నిర్వహించారు. ఆయా పనులకు సంబంధించి రెండు వేర్వేరు శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు. 20 నిమిషాలకు పైగా ఈ కార్యక్రమం కొనసాగింది. భూమి పూజ అనంతరం సీఎం జగన్.. ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత దుర్గమ్మ వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు, ఘనాపాటీల ఆశీర్వచనం అనంతరం సీఎం జగన్.. అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయాల పునర్నిర్మాణానికి శిలాఫలకాలను ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ దేవదాయ శాఖ వార్షిక క్యాలెండర్ ఆవిష్కరణ ► రాష్ట్ర దేవదాయ శాఖ రూపొందించిన 2021 వార్షిక క్యాలెండర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ప్రత్యేకత ప్రతిబింబించేలా, ఆయా ఆలయాల దేవతా మూర్తులు, ఆ ఆలయాల పరిధిలో నిర్వహించే వేడుకల వివరాలతో దేవదాయ శాఖ ఈ క్యాలెండర్‌ను రూపొందించింది. ► రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి సంబంధించిన రూట్ మ్యాప్ తయారు చేసి, అమలుకు తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు సూచించారు. నాడు వైఎస్సార్.. నేడు వైఎస్ జగన్ ► వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.33 కోట్లతో దుర్గ గుడి మహారాజ గోపురం నిర్మాణానికి శంకుస్థాపన చేసి, కొండపై ఆలయ అభివృద్ధికి నాంది పలికిన విషయాన్ని ఆలయ అర్చకులు ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించారు. అప్పటి శిలాఫలకాన్ని చూపించారు. ► దివంగత సీఎం వైఎస్సార్ తనయుడిగా, ప్రస్తుత ముఖ్యమంత్రిగా రూ.77 కోట్లతో ఈ ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం విశేషమని అర్చకులు కొనియాడారు. ► దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబం 28.380 గ్రాముల బరువున్న రూ.6.50 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన ముక్కుపుడక (నత్తు), బులాకీని కనకదుర్గమ్మకు కానుకగా సీఎం చేతుల మీదుగా ఆలయ అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ పైలా సోమి నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. పునర్నిర్మిస్తున్న తొమ్మిది ఆలయాలు ఇవే.. రాహు – కేతు ఆలయం, సీతమ్మ పాదాలు, దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం (సీతమ్మ పాదాలకు సమీపంలో), శనైశ్చర ఆలయం, బొడ్డు బొమ్మ, ఆంజనేయస్వామి ఆలయం (దుర్గగుడి మెట్ల వద్ద), సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం, వీరబాబు ఆలయం (పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలో), గోశాల కనకదుర్గ నగర్లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం. -
దేవునిగుట్టకు ప్రాణప్రతిష్ట
సాక్షి, హైదరాబాద్: కంబోడియాలోని ఆంకోర్‌వాట్ దేవాలయ నిర్మాణ శైలిని పోలిన దేశం లోని ఏకైక దేవునిగుట్ట ఆలయ పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. మన దేశంలో ఈ తరహా నిర్మాణ శైలితో ఆలయాలున్నట్టు రికార్డు కాలేదు. దాదాపు 1,500 ఏళ్ల కిందటిదిగా భావిస్తున్న ఈ దేవాలయం ఆలనాపాలనా లేక శిథిలావస్థకు చేరుకుంది. అంత శిథిలమైనా నిర్మాణ ప్రత్యేకతల వల్ల ఇటీవలి భారీ వర్షాలకు కూడా నిలిచే ఉండటం విశేషం. ఈ ఆలయాన్ని పునరుద్ధరించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రూ.కోటి నిధులు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. ఆ నిధులతో ఆలయాన్ని విడదీసి అలాగే తిరిగి పేర్చటం ద్వారా పునుద్ధరించాలని తెలంగాణ హెరిటేజ్ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండ్రోజుల కింద ఆ శాఖ అధికారులు ఆలయాన్ని పరిశీలించి వచ్చారు. జిల్లా కలెక్టర్ విచక్షణాధికారం పరిధిలో ఉండే క్రూషి యల్ బ్యాలెన్స్ ఫండ్ నుంచి రూ.కోటి నిధులు ఇచ్చేందుకు సిద్ధమైన ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య.. వచ్చే నెలలో విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో వెంటనే పనులు ప్రారంభించాలని హెరిటేజ్ తెలంగాణ అధికారులు భావిస్తున్నారు. స్థానికుల వరకే తెలిసిన ఈ ఆలయ విశేషాలను మూడేళ్ల కింద ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత హెరిటేజ్ తెలంగాణ అధికారులు సర్వే చేశారు. ప్రస్తుతం అది ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోగానీ అటు ఏఎస్ఐ ద్వారా కేంద్రం పరిధిలో గాని పురాతన కట్టడంగా లేదు. జీతాలకు తప్ప నిధులు లేక కునారిల్లుతున్న హెరిటేజ్ తెలంగాణ శాఖ చూస్తుండటం తప్ప దాని పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంతకాలానికి కలెక్టర్ చొరవతో మంచిరోజులు వచ్చినట్లయింది. రాతి ఇటుకలపై శిల్పాలు.. మన దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిపై శిల్పాలను ఓ రాతిపై చెక్కుతారు. కానీ ఈ దేవాలయంలో శైలి అందుకు పూర్తి విరుద్ధం. శిల్పం రూపాన్ని విభజించి అనేక చిన్న రాళ్లపై భాగాలుగా చెక్కుతారు. ఆ తర్వాత జత చేస్తూ వాటిని పేర్చి పూర్తి శిల్పానికి రూపమిస్తారు. ఈ నిర్మాణ శైలి కంబోడియాలోని ఆంకోర్‌వాట్ దేవాలయంలో కనిపిస్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన ఆ దేవాలయాన్ని నిత్యం కొన్ని వేల మంది సందర్శిస్తారు. ఆ తరహా శైలిలో మనదేశంలో నిర్మితమైనట్లు ఇప్పటివరకు వివరాలు రికార్డు కాలేదు. దేవునిగుట్ట ఆలయం మాత్రం ఫక్తు అదే శైలి ప్రతిబింబిస్తుంది. ఆలయానికి మొత్తం ఇసుక రాళ్లను వాడారు. ములుగు జిల్లా కేంద్రానికి 20 కి.మీ. దూరంలో ఉన్న కొత్తూరు గ్రామ పొలిమేరలో దట్టమైన అడవిలో ఈ దేవాలయం ఉంది. అడుగడుగునా శిల్పాలే.. ఆలయం మొత్తం గాథలను ప్రతిబింబించే శిల్పాలున్నాయి. ఇందులో బుద్ధుడి జాతక కథలు కనిపిస్తున్నాయి. దక్షిణ భాగంలో అజంతా శైలిలో లలితాసనంలో ఉన్న బోధిసత్వ పద్మపాణి విగ్రహం ఉంది. ఇది దక్షిణామూర్తిని కూడా పోలి ఉందన్న వాదనా ఉంది. పశ్చిమ భాగంలో అర్ధనారీశ్వరుడిని పోలిన చిత్రం ఉంది. కుడిచేయి గణపతి మీద, ఎడమ చేయి కుమారస్వామి మీద పెట్టినట్టుగా ఈ చిత్రం కనిపిస్తోంది. వజ్ర యానంలో బుద్ధుడిని పరమశివుడి రూపం లో పూజించే పద్ధతి ఉన్నందున శివుని రూపాలను చిత్రించినట్లు తెలుస్తోంది. ఆలయం వెలుపలి వైపు శిల్పాలను పేర్చినట్టుగానే, లోపలి వైపు కూడా చిత్ర భాగాలతో కూడిన రాళ్లను పేర్చి పలురకాల ఆకృతులకు రూపమిచ్చారు. బయటివైపు ఒక రాతి పొర, లోపలి వైపు మరో రాతి పొర ఉందన్నమాట. ఈ గోడలు 9 అడుగుల మందంతో ఉన్నాయి. ఆలయం 35 అడుగుల ఎత్తు ఉండగా, చుట్టు కొలత 20 మీటర్ల మేర ఉంది. దీనికి 250 మీటర్ల దూరంలో దాదాపు 25 ఎకరాల్లో విస్తరించిన తటాకం ఉంది. గర్భాలయంలోపలి నుంచి పైకి చూస్తే పిరమిడ్ తరహాలో ఆలయ శిఖరం చివరి వరకు కనిపిస్తుంది. బౌద్ధ స్తూపం ముందుండే ఆయక స్తంభాన్ని పోలిన సున్నపు రాయి స్తంభం ఉంది. స్తంభం విరిగి రెండు ముక్కలై ఉంటుందని భావిస్తున్నారు. ఆలయ పునరుద్ధరణకు పూర్తి సహకారం ‘దేవునిగుట్ట ఆలయానికి చరిత్రలో ప్రత్యేక స్థానముంది. ఇది ఐదారు శతాబ్దాల కిందటిదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇటీవలే నేను ఆలయాన్ని చూశాను. చాలా అద్భుతంగా ఉంది. నా పరిధిలో క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ కింద రూ.కోటి అందుబాటులో ఉంది. ఆ నిధులను ఈ అద్భుత దేవాలయ పునరుద్ధరణకు కేటాయించాలని నిర్ణయించాను. దీన్ని పునరుద్ధరించేందుకు నా పరిమితులకు లోబడి సాధ్యమైనంత వరకు కృషి చేస్తాను. ఇప్పటికే హెరిటేజ్ తెలంగాణ అధికారులు నాకు ప్రాథమిక డీపీఆర్ అందజేశారు.’ –కృష్ణ ఆదిత్య, ములుగు జిల్లా కలెక్టర్ ఆంకోర్‌వాట్ కంటే చాలా పురాతనం ఆంకోర్‌వాట్ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించారు. దేవునిగుట్ట దేవాలయం 5 లేదా ఆరో శతాబ్దంలోనే నిర్మించినట్లు తెలుస్తోంది. వాకాటక రాజులు కానీ, విష్ణుకుండినులు గాని నిర్మించి ఉంటారు. – రంగాచార్య, చరిత్రకారులు -
గర్భగుడిలో గుప్తనిధి.. రంగంలోకి అధికారులు..
సాక్షి, చెన్నై: ఆలయ పునరుద్ధరణ పనుల్లో లభించిన నిధి తమకే సొంతం అని ఉత్తర మేరు గ్రామస్తులు తేల్చారు. ఆ నిధిని అప్పగించాలని అధికారులు పట్టుబట్టినా, గ్రామస్తులు ఏ మాత్రం తగ్గలేదు. కాంచీపురం జిల్లా ఉత్తర మేరు గ్రామంలో పురాతన కులంబేశ్వరర్ ఆలయం ఉంది. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులపై గ్రామస్తులు దృష్టి పెట్టారు. గర్భగుడిలో శనివారం తవ్వకాల సమయంలో సాయంత్రం 561 గ్రాములతో కూడిన ఈ బంగారు నగలు బయట పడ్డాయి. బంగారాన్ని ట్రెజరీకి అప్పగించాలని గ్రామస్తులకు కాంచీపురం జిల్లా కలెక్టర్ మహేశ్వరి ఆదేశాలు జారీ చేశారు. ఆ నిధి తమకే సొంతం అని గ్రామస్తులు ప్రకటించారు. దీంతో ఆదివారం కాంచీపురం ఆర్డీఓ దివ్య నేతృత్వంలో బృందం ఆ గ్రామానికి వెళ్లింది. చదవండి: (సీళ్లు సేఫ్.. బంగారం ‘ఉఫ్’) గ్రామస్తులను బుజ్జగించి ఆ నిధిని ట్రెజరీకి తరలించేందుకు తగ్గ ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్తులు ఏమాత్రం తగ్గ లేదు. ఆ నిధి తమ గ్రామ ఆలయానికి చెందింది అని, దీనిని ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదని తేల్చారు. వందేళ్లకు పైగా చరిత్ర కల్గిన ఈ ఆలయం చోళుల హయాంలో నిర్మించినట్టు, అయితే, ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలో లేదని, వంశపారంపర్యంగా గ్రామ పెద్దలే నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు గ్రామస్తులు తేల్చారు. ఈ నిధి తమ ఆలయానికి సొంతమని, తమ ఆలయానికే ఉపయోగిస్తామని తేల్చడంతో పోలీసుల్ని రంగంలోకి దించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఒత్తిడితో వెనక్కి... పోలీసుల్ని రంగంలోకి దించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. తమపై ఒత్తిడి పెరగడంతో గ్రామ పెద్దలు వెనక్కి తగ్గారు. కొందరు అప్పగింతకు వ్యతిరేకించినా, పెద్దలు దిగిరాక తప్పలేదు. అధికారులకు ఓ మెలిక పెట్టారు. నిర్మాణం, జీర్ణోద్ధరణ పనులు ముగిసినానంతరం ఆభరణాలు ఆలయానికే అప్పగించాలని, అంత వరకు ట్రెజరీలో ఉండేలా అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం అప్పగించారు. చదవండి: (రజనీ కోసం 28 ఏళ్లుగా ఓటు భద్రం..) -
అభిమానం అంటే ఇదేనేమో..
బెంగుళూరు : కర్టాటకలోని దేవన్‌గిరి ప్రాంతంలోని చెన్నగిరి తలాక్‌లోని ఎస్వీఆర్ కాలనీవాసులు చనిపోయిన కోతికి గుడి కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మూడు నెలల క్రితం ఒక కోతుల గుంపు చెన్నగిరి తలాక్ ప్రాంతంలోకి వలస వచ్చాయి. అయితే సాధారణంగా కోతులు ఒక ప్రాంతానికి వస్తే తమ కోతి చేష్టలతో అందరినీ ఇబ్బందిపెడుతుంటాయి. అయితే ఈ కోతులు మాత్రం అలా ప్రవర్తించలేదు. ఎవరికి ఏ హానీ తలపెట్టకుండా కాలనీ వాసులతో కలిసిపోయి ఎంచక్కా వారి పిలల్లతో కలిసి ఆడుకునేవి. అయితే బుధవారం ఆ గుంపులోని ఒక మగ కోతి ఆకస్మాత్తుగా చనిపోయింది. దీంతో హిందూ సంప్రదాయ పద్దతిలో ఆ కోతికి అంత్యక్రియలు నిర్వహించడమే గాక దాని పేరు మీద ఒక గుడి కట్టాలని కాలనీవాసులు నిర్ణయించుకున్నారు. ఇదే విషయమై ఆ ఊరి సర్పంచ్‌ను కలిసి కోతి అంత్యక్రియలకు, గుడి కట్టేందుకు అనుమతి తీసుకున్నారు. దీంతో శుక్రవారం ఆ కోతి అంత్యక్రియలు జరిపారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే కోతికి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో మిగతా కోతులు తమ ప్రియ నేస్తానికి నివాళి అర్పించడం అక్కడున్న అందరినీ కలిచివేసింది. కోతికి అంత్యక్రియలు జరిపిన స్థలంలోనే గుడి కట్టనున్నట్లు కాలనీవాసులు ప్రకటించారు. -
పూర్తి కావొస్తున్న సూర్యక్షేత్రం..!
అర్వపల్లి (తుంగతుర్తి) : తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా నిర్మిస్తున్న అఖండజ్యోతి స్వరూప శ్రీసూర్యనారాయణస్వామి మహాక్షేత్రం పనులు పూర్తి కావొస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో అక్కడక్కడ చిన్నచిన్న సూర్యదేవాలయాలు ఉన్నాయే తప్ప సూర్యభగవానుడి క్షేత్రం ఎక్కడా లేదు. తొలిసారిగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం శివారులోని శ్రీపురంగిరులలో సూర్యాపేట ప్రాంతానికి చెందిన కాకులారపు జనార్దన్‌రెడ్డి–రజిత దంపతులు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ.2కోట్ల వ్యయంతో మూడు గిరులు (గుట్టల మధ్య) ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని వనాల నడుమ ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ ఆలయంతో పాటు దేవస్థాన కార్యాలయ భవనం, గోశాల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటితో పాటు రాబోయే రోజుల్లో ఇక్కడ నక్షత్రవనం, ధ్యానమండపం తదితర వాటిని నిర్మించ తలపెట్టారు. అయితే పర్వత శ్రేణుల మధ్య నిర్మించే ఈ క్షేత్రంలో ఆలయ గర్భగుడిలో అఖండజ్యోతి మూలాధారం. ఈ జ్యోతిని ఏకాగ్రతతో చూస్తూ సూర్యభగవానుడు చుట్టూ ఉండే సప్త ఆలయాల్లో సప్తవర్ణాలలో దర్శనమిస్తారు. అంతే కాకుండా ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ అత్యధికంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. కాస్మిక్ ఎనర్జీ అంటే సూర్యుడు కాలగమనంలో ఒక్కొక్క మాసం ఒక్కో రాశిలో ప్ర వేశిస్తారు. ఆ రాశి సంయమనం ప్రకారం కాంతి తీవ్రత ఉం టుంది. ఈ ఎనర్జీ మనిషి యొక్క ఆలోచనలను ఎంతో ప్రభా వితం చేస్తాయి. మేధాశక్తిని పెంపొందిస్తుంది. దీంతో ఈ క్షే త్రం రాబోయే రోజుల్లో గొప్ప విశిష్టత సంతరించుకునే అవకా శం ఉందని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు సూర్యనా రాయణస్వామి దర్శనం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకా కుళం జిల్లా అరసవెల్లికి వెళుతున్నారు. త్వరలో తెలంగాణ ప్ర జలకు సూర్యభగవానుడి దర్శన బాగ్యం ఇక్కడే కలగనుంది. రూ.2కోట్లతో క్షేత్రం నిర్మాణం.. సుమారు రూ.2కోట్ల వ్యయంతో ఈ క్షేత్ర నిర్మాణం జరుగుతోంది. సూర్యనారాయణస్వామి గర్భగుడి, చు ట్టూ ఏడు సప్తవర్ణ ఆలయాలు, ఈ క్షే త్రంపై రాజ గోపురం నిర్మాణం పూర్తయ్యాయి. దేవాలయ కార్యాలయం రెండు అంతస్తుల్లో నిర్మించా రు. పశువుల కోసం గోశాల నిర్మాణం జరుగుతోంది. ఆల యం ఎదుట ధ్యానమందిరం నిర్మా ణం పూర్తయింది. మిగి లిన పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24నుంచి ప్రతిష్ఠ, మహాసౌరయాగ మహోత్సవాలు ఈ అఖండజ్యోతి స్వరూప పంచాయతన దేవాలయ ప్రతిష్ఠ, మహా సౌరయాగ మహోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24నుంచి మార్చి 5వరకు జరపాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి దేవాలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ పర్యవేక్షణలో ప్రతిష్ఠ, మహాసౌరయాగ మహోత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే అరసవెల్లి దేవస్థాన అర్చక బృందం మహా సౌరయాగ మహోత్సవాలకు ఏర్పాట్లను పరిశీలించి వెళ్లింది. ఈ యాగానికి ఐదుగురు పీఠాధిపతులను ఆహ్వానిస్తున్నారు. అలాగే 36మంది రుత్వికులు 420మంది జంటలచే మహాసౌరయాగాన్ని 13రోజుల పాటు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆ ర్, గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌తో పాటు చినజీయర్, స్వరూపనంద స్వాములతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్వాములను పిలవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహోత్సవాలను రూ.కోటి వ్యయంతో నిర్వహిస్తున్నారు. ఇక్క డి క్షేత్రం తూర్పు దిశలో మూడు పర్వతాల మధ్య ఉన్నందున ఏపీలోని అరసవెల్లి దేవాలయం మాదిరిగా అభివృద్ధి చెందుతుందని దేవాలయ వ్యవస్థాపకుడు జనార్దన్‌రెడ్డి తెలిపారు. ప్రతిష్టా, మహాసౌరయాగ మహోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలిరావాలని కోరుతున్నారు. -
ఆలయ ప్రహారీ నిర్మిస్తా
కాగజ్‌నగర్‌రూరల్(సిర్పూర్) : కాగజ్‌నగర్ మండలం భట్‌పల్లిలోని భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రహరీని నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తానని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. సోమవారం మందిరం ఆవరణలో ప్రహారీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మందిరంలో నిర్వహించిన సీతారాముల కల్యాణానికి ఆయన సతీమణి రమాదేవితో కలిసి ఆయన హాజరయ్యారు. ఇందులో మాజీ ఎంపీటీసీ పిర్సింగుల పోచయ్య, భక్తులు పాల్గొన్నారు. కన్నుల పండువగా కల్యాణం మండలంలోని భట్టుపల్లి, రాస్పెల్లి, సారసాలతో పాటు ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో సీతారాముల కల్యాణాన్ని సోమవారం నిర్వహించారు. భట్టుపల్లిలో నిర్వహించిన కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయన సతీమణి రమాదేవి హాజరయ్యారు. రాస్పెల్లి ఆంజనేయస్వామి ఆలయం, సారసాలలోని సీతారామాంజనేయ దేవాలయంలో అంగరంగ వైభవంగా కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. -
30 కోట్లతో మోదీకి గుడి
సాక్షి, పంచకుల : టీ అమ్ముకున్న స్థాయి నుంచి.. దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీకి ప్రత్యేక అభిమానగణం ఉన్న విషయం తెలిసిందే. ఆ అభిమానంతోనే ఆయన వంద అడుగుల విగ్రహంతో మీరట్‌లో ఓ గుడిని నిర్మించేందుకు ముందుకొచ్చారు హర్యానాకు చెందిన ఓ రిటైర్డ్ ఇంజనీర్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్‌గా పని చేసి రిటైర్డ్ అయిన జేపీ సింగ్‌కు మోదీ అంటే చాలా ఇష్టం. ఆయన(మోదీ) సిద్ధాంతాలు, పాలన నన్ను ఎంతగానో ఆకర్షించాయి. దశాబ్దం పైగా నేను ఆయన అభిమానిని. ఆయన కోసం ఏదైనా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండటం మూలానా వీలు కాలేదు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యాను కాబట్టి మార్గం సులభతరం అయ్యింది అని సింగ్ చెప్పుకొచ్చారు. అక్టోబర్ 23న ఈ గుడి భూమి పూజ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది. మీరట్-ఖర్నా హైవేలోని సార్ధనా ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిలో ఈ ఆలయ నిర్మాణం చేపడుతుండగా.. సుమారు 30 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందుకోసం ఆ మాజీ ఉద్యోగి ప్రజల నుంచి విరాళాలు కూడా సేకరించారంట. వంద అడుగుల మోదీ విగ్రహాంతో సుమారు రెండేళ్లలో గుడి నిర్మాణం పూర్తి చేస్తామని సింగ్ వెల్లడించారు. -
కాకతీయుల నాటి ఆలయ ఆనవాళ్లు గుర్తింపు!
♦ ఎలుకుర్తి హవేలి సమీపంలో బయల్పడ్డ శిల్పసంపద ♦ ‘గణేశ్వర’ఆలయంగా గుర్తించిన పరిశోధకులు ♦ రామప్ప ఆలయానికి ముందే ఇక్కడ ఆలయ నిర్మాణం గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎలుకుర్తిహవేలి శివారులో బోగంమాటు వద్ద కాకతీయ కాలం నాటి ఆలయ అవశేషాలు వెలుగుచూశాయి. ఆలయానికి సంబంధించిన మూల స్థంభాలు, పునాది, పైకప్పునకు ఉపయోగించిన బండరాళ్లు, శిలా శాసనాలపై చెక్కే సూర్య, చంద్రుల గుర్తులు బయల్పడ్డాయి. ఇవన్నీ క్రీ.శ. 12,13 శతాబ్ధం కాలం నాటివిగా భావిస్తున్నారు. ఎలుకుర్తిహవేలి గ్రామానికి చెందిన చరిత్ర పరిశోధకుడు కంచి శ్రీనివాస్ వీటిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయనకు అదే గ్రామానికి చెందిన ముదిగొండ శ్రీనివాస్ సహకారం అందించారు. లభ్యమైన స్తంభాలు, బండరాళ్ళు, సూర్యచంద్రుల గుర్తులను పరిశీలించిన తర్వాత శిధిలమైన అలనాటి ఆలయం గణపతి లేదా గణేశ్వర ఆలయంగా వారు భావిస్తున్నారు. కాకతీయ మహాదేవ చక్రవర్తి యాదవరాజైన జైతుగి చేతుల్లో యుద్ధంలో మరణించిన సమయంలో అతడి కుమారుడు గణపతిదేవ చక్రవర్తిని బందీగా చేసుకున్నాడని, ఆ కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని అంతర్గత తిరుగుబాట్ల నుంచి సర్వసైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రసేనాని కాపాడి, గణపతిదేవుడిని బంధ విముక్తి చేసి చక్రవర్తిగా రాజ్యాన్ని అప్పగించాడని వివరించారు. రుద్రసేనాని స్వామి భక్తికి మెచ్చిన గణపతిదేవుడు మండలంలోని ఎలుకుర్తి రాజ్యాన్ని అతడికి బహుమానంగా ఇచ్చాడన్నారు. ఎలుకుర్తిలో తనపేరుతోపాటు కుమారుల పేరుతో నాలుగు దేవాలయాలను నిర్మించాడన్నారు.తన పేరుతో రుద్రేశ్వర ఆలయాన్ని, కుమారుల పేరిట లోకేశ్వర, అన్వేశ్వర ఆలయాలను నిర్మించాడని వివరించారు. మరో కుమారుడు గణపతిరెడ్డి పేరు తో నిర్మించిన గణేశ్వరఆలయ అవశేషాలే బయల్పడ్డాయన్నారు. రామప్ప దేవాలయం కంటే ముందే ఈ ఆలయాన్ని నిర్మించారన్నారు.