స్కూల్ బస్సు కిందపడి ఓ చిన్నారి మృతి చెందింది.
నందిపేట: స్కూల్ బస్సు కిందపడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలారి శృతిక(2) ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో స్థానిక పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లడానికి వచ్చిన స్కూల్ బస్సు కిందకు వెళ్లింది. ఇది గుర్తించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో చిన్నారి మృతి చెందింది.