
సాక్షి, సంగారెడ్డి: ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారి చెరువులో శవమై కనిపించింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో ఆదివారం ఈ విషయం వెలుగుచూసింది. చిన్నారిని గ్రామానికి చెందిన కటికె మస్తాన్ కూతురిగా పోలీసులు గుర్తించారు. పాప మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెను ఎవరైనా చంపి చెరువులో పడేశారా, లేక తల్లిదండ్రుల మధ్య గొడవలే చిన్నారి మృతికి కారణమా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment