వేడినీటిలో పడి చిన్నారి మృతి | 4 years old children died over fall in hot water | Sakshi
Sakshi News home page

వేడినీటిలో పడి చిన్నారి మృతి

Published Mon, Jan 25 2016 12:31 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM

4 years old children died over fall in hot water

మోత్కూరు: ప్రమాదవశాత్తు వేడినీటిలో పడిన చిన్నారి తీవ్రంగా గాయపడి మృతి చెందింది. మోత్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఉండే పుట్టూరి విక్రం, వసంత దంపతుల కుమార్తె వైష్ణవి(4). ఆదివారం సాయంత్రం విక్రం స్నానం చేసేందుకు వేడి నీటి బకెట్‌తో బాత్‌రూంకు వెళ్లాడు. దానిని అక్కడే ఉంచి చల్లని నీటి కోసం సంప్ దగ్గరకు వచ్చాడు. తండ్రి వెనుకే వెళ్లిన వైష్ణవి ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని రాత్రి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఉదయం పరిస్థితి విషమించి చిన్నారి మృతి చెందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement