vishnavi
-
700 ఏళ్ల నాటి ఆచారానికి స్వస్తి పలికి...కొత్త సంప్రదాయానికి శ్రీకారం
బిహార్: భారత్‌లో పలు రాష్ట్రాలు, గ్రామాల్లో ప్రజలు శరన్న నవరాత్రులను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఒక్కోచోట ఒక్కో సంప్రదాయ రీతీలో దుర్గామాత పూజలందుకుంటోంది. అలాగే బిహార్‌లోని బెగుసరాయ్‌లో చారిత్రాత్మక పురాతన ఆలయంలో దుర్గామాత వైష్ణవి దేవిగా పూజలందుకుంటోంది. ఇక్కడి ప్రజలు అమ్మవారిని చాలా విభిన్నంగా ఆరాధిస్తారు. అమ్మవారికి జంతుబలులు ఇవ్వడం అనేది కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సంప్రదాయంగా పాటిస్తున్నారు. కానీ ఈ బెగుసురాయ్‌లో ఉన్న పురాతన వైష్ణవీ మాత ఆలయంలో మాత్రం నవరాత్రి సందర్భంగా అమ్మవారికి ఇచ్చే బలులు మామూలుగా ఉండవు. వేల సంఖ్యల్లో జంతు బలులు జరుగుతుంటాయి. ఏటా నవరాత్రులకు వైష్ణవి మాతకు దాదాపు 10 వేలకు పైగా జంతువులను బలి ఇస్తారు. భక్తుల తమ కోరిక నెరవేరిన వెంటనే ఈ జంతు బలులతో తమ మొక్కులను తీర్చుకుంటుంటారని ప్రజలు చెబుతున్నారు. ఇది అక్కడ 700 ఏళ్ల నాటిగా అనాధిగా వస్తున్న ఆచారం. వాస్తవానికి అక్కడ ఉన్నఅమ్మవారు ఒక శక్తిపీఠంగా అలరారుతున్న పవిత్రమైన క్షేతంగా ప్రసిద్ధి. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఈ జంతుబలులు అనేది కాస్త అందర్నీ కలిచివేసే అంశమే. ఐతే ఇప్పుడు వారంతా ఈ 700 ఏళ్ల నాటి ఆచారానికి తిలోదాకాలిచ్చేసి ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఆ ఆలయాన్ని నిర్వాహిస్తున్న మా దుర్గా టెంపుల్ పుష్పలత ఘోష్ ఛారిటబుల్ ట్రస్ట్. ఈ వైష్టవీ దేవి విగ్రహం ఆలయ చరిత్ర ప్రకారం 700 ఏళ్ల క్రితం బెంగాల్‌లోని నదియా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ దేవతను లాకన్పుర్లో కులదేవతగా ఆరాధిస్తారని సమాచారం. బెగుసురాయ్లోని ఈ వైష్టవీ దేవీ ఆలయంలో భక్తులు ప్రస్తుతం జంతు బలులకు బదులుగా అమ్మవారికి చెరకు, గుమ్మడికాయ వంటి కూరగాయాలు, పండ్లు సమర్పిస్తారు . అంతేగాదు ఈ ఆలయాన్ని స్థాపించినప్పడూ ఈ ఆచారాన్నే పాటించేవారిని రానురాను కాలానుగుణంగా మార్పులు సంతరించుకుని.. ఈ జంతు బలలు వచ్చినట్టు చరిత్ర ఆధారంగా తెలుస్తోందని ట్రస్ట్ కమిటీ పేర్కొంది. చదవండి: దుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు) -
వైష్ణవి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఆత్మహత్య
-
రన్నరప్ వైష్ణవి రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఐస్లాండ్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి ఆకట్టుకుంది. ఐస్లాండ్లో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో నాలుగో సీడ్ వైష్ణవి (భారత్) 20–22, 12–21తో ఐదో సీడ్ శైలి రాణే (భారత్) చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో పోరాడిన వైష్ణవి, రెండో గేమ్‌లో చేతులెత్తేసింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో బోధిత్ జోషి (భారత్) 14–21, 17–21తో సామ్ పర్సన్స్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మూడో సీడ్ రోహన్ కపూర్– కుహూ గార్గ్ (భారత్) ద్వయం 16–21, 21–19, 21–18తో టాప్‌సీడ్ క్రిస్టోఫర్ నుడ్సెన్– ఇసాబెల్లా నీల్సన్ (డెన్మార్క్) జంటపై సంచలన విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
ఎంత పనిచేశావు తల్లీ
వారిది అన్యోన్యమైన దాంపత్యం. ఇద్దరు బిడ్డలు. వారిని అపురూపంగా చూసుకుంటున్నారు. వ్యవసాయంలో వచ్చే అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో బిడ్డలకు కొత్త దుస్తులు కొనివ్వాలన్న విషయంలో నెలకొన్న చిన్న వివాదం ఆ ఇంటిని చిన్నాభిన్నం చేసింది. క్షణికావేశంలో ఆ ఇల్లాలు తీసుకున్న నిర్ణయం ఇద్దరు చిన్నారులను బలి తీసుకుంది. ఆమె కూడా కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. హృదయ విదారకమైన ఈ సంఘటన సదుం మండలంలో శనివారం చోటుచేసుకుంది. - అత్తా, కోడలు మధ్య వివాదం - క్షణికావేశానికి గురైన కోడలు సదుం: కొత్త బట్టలు కొనుగోలు విషయం లో ఏర్పడిన వివాదంతో బిడ్డలకు విషమిచ్చిన తల్లి తానూ తినింది. ఎస్ఐ నాగరాజు కథనం మేరకు... స దుం మండలం కురవపల్లెకు చెందిన రైతు నాగేంద్రకు ఈశ్వరమ్మతో (22) వివాహం జరిగింది. వైష్ణవి (5), వర్షిణి (1) కుమార్తెలు ఉన్నారు. వైష్ణవి ఒకటో తరగతి చదువుతోంది. వర్షిణి అంగన్వాడీ పాఠశాలకు వెళుతోంది. వీరికి కొత్త దుస్తులు తీసివ్వాలని ఈశ్వరమ్మ అత్త వీరమ్మను శుక్రవారం కోరింది. చిన్నమ్మాయి వర్షిణికి దుస్తులు కొనిచ్చింది. మరోసారి వైష్ణవికి కొనిస్తానని వీరమ్మ పేర్కొంది. దీంతో వారి మధ్య వాగ్వా దం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈశ్వరమ్మ మనస్తాపం చెందింది. కుటుంబ సభ్యులు శనివారం పనులు చేసేందుకు వ్యవసాయ పొలానికి వెళ్లిన తర్వాత ఇద్దరు బిడ్డలకు విషపు గులికలు తినిపించిన ఈశ్వరమ్మ తానూ తీసుకుంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో వీరమ్మ పొలం నుంచి ఇంటికి వచ్చింది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న కోడలు, మనువరాళ్లను గమనించింది. స్థానికుల సాయంతో సదుం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చింది. మార్గమధ్యంలోనే వర్షిణి మృతి చెందగా, వైద్యశాలలో వైష్ణవి మృతి చెందింది. -
నగరాన్ని వణికిస్తున్న డెంగీ
రెండు రోజుల్లో ముగ్గురు మృతి సాక్షి, హైదరాబాద్: డెంగీ విజృంభణతో నగరవాసికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు అతలాకుతలమైన నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో డెంగీ వ్యాప్తి చెందుతుండటంతో హడలిపోతోంది. మంగళ, బుధవారాల్లో నగరానికి చెందిన ఇద్దరు చిన్నారులతోపాటు ఓ వ్యక్తి డెంగీతో మృత్యువాతపడటం కలవరానికి గురిచేస్తోంది. కొత్తపేట డివిజన్ న్యూనాగోలు కాలనీకి చెందిన ప్రభాకర్‌రెడ్డి కుమార్తె వైష్ణవి (8) డెంగీతో అంకూర్ ఆస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. పహడీషరీఫ్ జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని హదీస్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జాకీర్ హుస్సేన్(38) వారం రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చేరాడు. హుస్సేన్ డెంగీతో బాధపడుతున్నాడని వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమించి బుధవారం ఉదయం మృతి చెందాడు. ఇక సూరారం డివిజన్ రాజీవ్ గాంధీనగర్‌కు చెందిన కిశోర్, సౌజన్య దంపతుల కుమార్తె మందిర(8)కు వారం రోజుల క్రితం జ్వరం రావడంతో షాపూర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. డెంగీ నిర్ధారణ కావడంతో మెరుగైన చికిత్స కోసం లక్డికాపూల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. -
వేడినీటిలో పడి చిన్నారి మృతి
మోత్కూరు: ప్రమాదవశాత్తు వేడినీటిలో పడిన చిన్నారి తీవ్రంగా గాయపడి మృతి చెందింది. మోత్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఉండే పుట్టూరి విక్రం, వసంత దంపతుల కుమార్తె వైష్ణవి(4). ఆదివారం సాయంత్రం విక్రం స్నానం చేసేందుకు వేడి నీటి బకెట్‌తో బాత్రూంకు వెళ్లాడు. దానిని అక్కడే ఉంచి చల్లని నీటి కోసం సంప్ దగ్గరకు వచ్చాడు. తండ్రి వెనుకే వెళ్లిన వైష్ణవి ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని రాత్రి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఉదయం పరిస్థితి విషమించి చిన్నారి మృతి చెందింది.