700 ఏళ్ల నాటి ఆచారానికి స్వస్తి పలికి...కొత్త సంప్రదాయానికి శ్రీకారం | Oldest Durga Temple Begusarai 700 Year Old Tradition Become End | Sakshi
Sakshi News home page

Navaratri In Durga Temple:700 ఏళ్ల నాటి ఆచారానికి స్వస్తి పలికి...కొత్త సంప్రదాయానికి శ్రీకారం

Published Tue, Sep 27 2022 7:33 PM | Last Updated on Tue, Sep 27 2022 8:28 PM

Oldest Durga Temple Begusarai 700 Year Old Tradition Become End - Sakshi

బిహార్‌: భారత్‌లో పలు రాష్ట్రాలు, గ్రామాల్లో ప్రజలు శరన్న నవరాత్రులను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఒక్కోచోట ఒక్కో సంప్రదాయ రీతీలో దుర్గామాత పూజలందుకుంటోంది. అలాగే బిహార్‌లోని బెగుసరాయ్‌లో చారిత్రాత్మక పురాతన ఆలయంలో దుర్గామాత వైష్ణవి దేవిగా పూజలందుకుంటోంది. ఇక్కడి ప్రజలు అమ్మవారిని చాలా విభిన్నంగా ఆరాధిస్తారు. అమ్మవారికి జంతుబలులు ఇవ్వడం అనేది కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సంప్రదాయంగా పాటిస్తున్నారు.

కానీ ఈ బెగుసురాయ్‌లో ఉన్న పురాతన వైష్ణవీ మాత ఆలయంలో మాత్రం నవరాత్రి సందర్భంగా అమ్మవారికి ఇ‍చ్చే బలులు మామూలుగా ఉండవు. వేల సంఖ్యల్లో జంతు బలులు జరుగుతుంటాయి. ఏటా నవరాత్రులకు వైష్ణవి మాతకు దాదాపు 10 వేలకు పైగా జంతువులను బలి ఇస్తారు. భక్తుల తమ కోరిక నెరవేరిన వెంటనే ఈ జంతు బలులతో తమ మొక్కులను తీర్చుకుంటుంటారని ప్రజలు చెబుతున్నారు. ఇది అక్కడ 700 ఏళ్ల నాటిగా అనాధిగా వస్తున్న ఆచారం.

వాస్తవానికి అక్కడ ఉన్నఅమ్మవారు ఒక శక్తిపీఠంగా అలరారుతున్న పవిత్రమైన క్షేతంగా ప్రసిద్ధి. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఈ జంతుబలులు అనేది కాస్త అందర్నీ కలిచివేసే అంశమే. ఐతే ఇప్పుడు వారంతా ఈ 700 ఏళ్ల నాటి ఆచారానికి తిలోదాకాలిచ్చేసి ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఆ ఆలయాన్ని నిర్వాహిస్తున్న మా దుర్గా టెంపుల్ పుష్పలత ఘోష్ ఛారిటబుల్ ట్రస్ట్. ఈ వైష్టవీ దేవి విగ్రహం ఆలయ చరిత్ర ప్రకారం 700 ఏళ్ల క్రితం బెంగాల్‌లోని నదియా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

అంతేకాదు ఈ దేవతను లాకన్పుర్‌లో కులదేవతగా ఆరాధిస్తారని సమాచారం. బెగుసురాయ్‌లోని ఈ వైష్టవీ దేవీ ఆలయంలో భక్తులు ప్రస్తుతం జంతు బలులకు బదులుగా అమ్మవారికి చెరకు, గుమ్మడికాయ వంటి కూరగాయాలు, పండ్లు సమర్పిస్తారు . అంతేగాదు ఈ ఆలయాన్ని స్థాపించినప్పడూ ఈ ఆచారాన్నే పాటించేవారిని రానురాను కాలానుగుణంగా మార్పులు సంతరించుకుని.. ఈ జంతు బలలు వచ్చినట్టు చరిత్ర ఆధారంగా తెలుస్తోందని ట్రస్ట్‌ కమిటీ  పేర్కొంది. 
చదవండి: దుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement