Begusarai
-
దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి
పట్నా: బీహార్‌లోని బెగుసరాయ్‌లోని బరౌని రైల్వే జంక్షన్లో దారుణం ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఓ ఉద్యోగి మృతి చెందాడు. శనివారం జరిగిన షంటింగ్ ఆపరేషన్‌లో రైల్వే పోర్టర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోన్పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని స్టేషన్లో పనిచేస్తున్న పోర్టర్ అమర్‌కుమార్‌రావుగా గుర్తించారు. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ లక్నో జంక్షన్ నుంచి రావటంతో బరౌని జంక్షన్ ప్లాట్‌ఫారమ్ 5పై తన విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మృతి చెందాడు.రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు ఇంజిన్-బోగీల మధ్య కప్లింగ్ విడదీసేందుకు యత్నించిన సమయంలో రైలు అనూహ్యంగా రివర్స్ కావడంతో అతను రెండు క్యారేజీల మధ్య ఇరుక్కుపోయి మృతి చెందాడని తెలిపారు. ఘటన జరిగిన అనంతరం రైలు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారైనట్లు సమాచారం.A tragic incident occurred at Barauni Junction, Bihar, where a railway worker lost his life due to negligence during shunting operations.Meanwhile, the Railway Minister remains occupied with PR and social media.It seems that the railway prioritizes neither passenger safety… pic.twitter.com/teR9r4rzuj— Fight Against Crime & Illegal Activities (@FightAgainstCr) November 9, 2024చదవండి: లక్కీ కారుకు సమాధి.. రూ. 4 లక్షల ఖర్చు, 1500 మంది జనం! -
Bihar: ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఊచకోత
బీహార్‌లోని బెగుసరాయ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గొంతుకోసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో భర్త, భార్య, కుమార్తె మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన నేరస్తులు ఆ కుటుంబంలోని నలుగురిపైన యాసిడ్ కూడా పోశారు. గాయపడిన కుమారుని పరిస్థితి విషమంగా ఉంది.బచ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని రషీద్‌పూర్‌లోని చిరంజీవిపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ప్రాంతానికి చెందిన సంజీవన్ మహతో తన కుటుంబ సభ్యులందరితో పాటు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నేరస్తులు పదునైన ఆయుధంతో సంజీవన్ మహతోను ఆయన భార్య సంజితా దేవి, కుమారుడు అంకుష్‌కుమార్, కుమార్తె సప్నా కుమారిల గొంతు కోశారు. ఈ ఘటనలో భర్త, భార్య, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అంకుష్‌కుమార్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న బచ్వారా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంజీవన్ మహతోకు ఇద్దరు భార్యలు ఉన్నారని పోలీసులు తెలిపారు. కుటుంబ విభేదాల కారణంగానే ఈ ఘోరం జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
రూ.13 కోట్ల వంతెన.. ప్రారంభానికి ముందే ఫసక్..
బెగుసరాయ్: రూ. 13 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ఏడాది పాటు నిర్మించిన ఓ వంతెన ప్రారంభానికి కూడా నోచుకోకుండానే కూలిపోయింది. 2017లోనే దీన్ని నిర్మించినప్పటికీ అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో నిరుపయోగంగా ఉంది. ఇటీవలే పగుళ్లు రావడంతో స్థానికులు అధికారులకు లేఖ రాశారు. వారు చర్యలు తీసుకునే లోపే వంతెన ఆదివారం కూలిపోయింది. బిహార్‌లో బెగుసరాయ్ జిల్లాలో బుధిగండక్ నదిపై 2017లో 206 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని నిర్మించారు. అప్రోచ్ రోడ్డు వేసేందుకు ప్రైవేటు భూమిని సేకరించలేదు. దీంతో అది ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. అప్పుడప్పుడు ట్రాక్టర్లు, భారీ వాహనాలు వంతెన మీదుగా వెళ్తున్నాయి. వంతెన 2, 3 పిల్లర్ల మధ్య భాగంలో పగుళ్లు బారి పోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ప్రారంభం కూడా కాకుండానే వంతెన కూలడంతో నిర్మాణ నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: మిసెస్ వరల్డ్‌గా సర్గమ్ కౌశల్.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు కిరీటం.. -
700 ఏళ్ల నాటి ఆచారానికి స్వస్తి పలికి...కొత్త సంప్రదాయానికి శ్రీకారం
బిహార్: భారత్‌లో పలు రాష్ట్రాలు, గ్రామాల్లో ప్రజలు శరన్న నవరాత్రులను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఒక్కోచోట ఒక్కో సంప్రదాయ రీతీలో దుర్గామాత పూజలందుకుంటోంది. అలాగే బిహార్‌లోని బెగుసరాయ్‌లో చారిత్రాత్మక పురాతన ఆలయంలో దుర్గామాత వైష్ణవి దేవిగా పూజలందుకుంటోంది. ఇక్కడి ప్రజలు అమ్మవారిని చాలా విభిన్నంగా ఆరాధిస్తారు. అమ్మవారికి జంతుబలులు ఇవ్వడం అనేది కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సంప్రదాయంగా పాటిస్తున్నారు. కానీ ఈ బెగుసురాయ్‌లో ఉన్న పురాతన వైష్ణవీ మాత ఆలయంలో మాత్రం నవరాత్రి సందర్భంగా అమ్మవారికి ఇచ్చే బలులు మామూలుగా ఉండవు. వేల సంఖ్యల్లో జంతు బలులు జరుగుతుంటాయి. ఏటా నవరాత్రులకు వైష్ణవి మాతకు దాదాపు 10 వేలకు పైగా జంతువులను బలి ఇస్తారు. భక్తుల తమ కోరిక నెరవేరిన వెంటనే ఈ జంతు బలులతో తమ మొక్కులను తీర్చుకుంటుంటారని ప్రజలు చెబుతున్నారు. ఇది అక్కడ 700 ఏళ్ల నాటిగా అనాధిగా వస్తున్న ఆచారం. వాస్తవానికి అక్కడ ఉన్నఅమ్మవారు ఒక శక్తిపీఠంగా అలరారుతున్న పవిత్రమైన క్షేతంగా ప్రసిద్ధి. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఈ జంతుబలులు అనేది కాస్త అందర్నీ కలిచివేసే అంశమే. ఐతే ఇప్పుడు వారంతా ఈ 700 ఏళ్ల నాటి ఆచారానికి తిలోదాకాలిచ్చేసి ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఆ ఆలయాన్ని నిర్వాహిస్తున్న మా దుర్గా టెంపుల్ పుష్పలత ఘోష్ ఛారిటబుల్ ట్రస్ట్. ఈ వైష్టవీ దేవి విగ్రహం ఆలయ చరిత్ర ప్రకారం 700 ఏళ్ల క్రితం బెంగాల్‌లోని నదియా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ దేవతను లాకన్పుర్లో కులదేవతగా ఆరాధిస్తారని సమాచారం. బెగుసురాయ్లోని ఈ వైష్టవీ దేవీ ఆలయంలో భక్తులు ప్రస్తుతం జంతు బలులకు బదులుగా అమ్మవారికి చెరకు, గుమ్మడికాయ వంటి కూరగాయాలు, పండ్లు సమర్పిస్తారు . అంతేగాదు ఈ ఆలయాన్ని స్థాపించినప్పడూ ఈ ఆచారాన్నే పాటించేవారిని రానురాను కాలానుగుణంగా మార్పులు సంతరించుకుని.. ఈ జంతు బలలు వచ్చినట్టు చరిత్ర ఆధారంగా తెలుస్తోందని ట్రస్ట్ కమిటీ పేర్కొంది. చదవండి: దుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు) -
బిహార్‌లో కాల్పుల కలకలం..ఒకరు మృతి
పట్నా: బిహార్‌లో నలుగురు వ్యక్తులు తుపాకీలతో కాల్పుల కలకలం సృష్టించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్‌లోని బెగుసురాయ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....బిహార్‌లోని బెగుసురాయ్‌లో బాటసారులపై నలుగురు దుండగులు కాల్పులు జరిపారని అన్నారు. వారు బైక్‌పై వచ్చి ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు...సుమిత్ కుమార్, యువరాజ్, కేశవా అలియాస్ నాగా, అర్జున్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్ల వెల్లడించారు. ఈ ఘటన తర్వాత అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 7గురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. ఆ దుండగులు మొదటగా బెగుసురాయ్ పట్టణంలోని మల్హిపూర్ చౌక్‌లో షాపులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ నిందితులు బరౌని థర్మల్ చౌక్, తేఘ్రా, బచ్వారా, రాజేంద్ర బ్రిడ్జి వరకు కాల్పులు కొనసాగించినట్లు వెల్లడించారు. (చదవండి: బిహార్‌లో మద్యం నిషేధం విఫలం) -
అత్యాచారం జరిగితే.. అది మీ సీఎం చేసినట్టా? బీజేపీపై తేజస్వీ ఫైర్
పాట్నా: బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇటీవల బెగూసరాయ్‌లో జరిగిన కాల్పుల ఘటనకు సీఎం నితీశ్ కుమారే బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా సీఎంనే నిదించడం సరికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోజూ ఎన్నో నేరాలు జరుగుతున్నాయని వాటికి బాధ్యత ఆయా సీఎంలదేనా? అని తేజస్వీ ప్రశ్నించారు. ఒకవేళ అక్కడ రేప్ జరిగితే అది వాళ్ల సీఎం చేసినట్లా? అని అడిగారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రేదశ్‌లో ప్రతి రోజు నేరాలు జరుగుతూనే ఉన్నాయని, రామరాజ్యమంటే అదేనా అని తేజస్వీ ధ్వజమెత్తారు. 'బెగూసరాయ్ కాల్పుల ఘటనకు కొత్త కోణం ఇవ్వాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. బీహార్‌లో ఉంది ప్రజా ప్రభుత్వం. బీజేపీ అంటేనే అతిపెద్ద అబద్దాల పార్టీ. వారు ఎప్పుడూ చెప్పింది చేయరు. ప్రజలను విభజించి సమాజంలో విషం నింపాలని చూస్తారు' అని తేజస్వీ తీవ్ర విమర్శలు చేశారు. బెగూసరాయ్‌లో మంగళవారం కాల్పుల ఘటన జరిగింది. ఇద్దరు నిందుతులు బైక్‌పై ప్రయాణించి పలు చోట్లు అరగంటపాటు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. దీనిపై స్పందిస్తూ బీజేపీ నేత గిరిరాజ్ సింగ్.. నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్‌లో మహాఘట్బంధన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ప్రతిసారి ఆటవిక రాజ్యమే వస్తుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనే స్పందిస్తూ తేజస్వీ బీజేపీపై మండిపడ్డారు. చదవండి: ఆటోలో ప్రయాణించి కేజ్రీవాల్ హల్చల్.. ఊహించని గిప్ట్ ఇచ్చిన బీజేపీ -
'భారత్ మరింత అందంగా కనిపిస్తుంది'
పాట్నా: రైలులో పయనమైన మిజోరాం వాసులు మార్గమధ్యలో అస్సాం వరద బాధితులకు ఆహార పొట్లాటను అందిస్తూ గొప్ప మనసు చాటుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో అందరి మన్ననలు అందుకుంది. తాజాగా శ్రామిక్ ప్రత్యేక రైలులో స్వస్థలాకు పయనమైన మిజోరాం వలస కార్మికులకు బీహార్ వాసులు సాయం చేశారు. ఆగి ఉన్న రైలును చూసి పరుగెత్తుకుంటూ వచ్చి వారికి ఆహార పొట్లాలను అందించారు. ఈ ఘటన బీహార్‌లోని బిగుసరై వద్ద చోటు చేసుకుంది. మనసును హత్తుకుంటోన్న ఈ వీడియోను మిజోరాం ముఖ్యమంత్రి జోరాంథంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. (మానవత్వాన్ని చాటుకున్న మిజోలు) "ఇలా ప్రేమలతో మునిగినప్పుడు భారత్ మరింత అందంగా కనిపిస్తుంది" అని సీఎం పేర్కొన్నారు. ముప్పై సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఇది భారతీయుల ఐక్యతను చాటి చెప్తోంది", "ఆనందభాష్పాలు వస్తున్నాయి. ఇదీ నా భారత్ అంటే.. ఇంత మంచి వీడియోను పంచుకున్నందుకు ధన్యవాదాలు", "ఇలాంటి క్షణాలే మన దేశ ఐక్యతను, సోదరభావాన్ని ప్రతిబింబిస్తాయి" అంటూ పలువురు భావోద్వేగానికి లోనవుతున్నారు. (మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ ఈ వ్యక్తి!) -
రామ్‌పుకార్ కథ సుఖాంతం
న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన వలసజీవి రామ్‌పుకార్ పండిట్(38) కథ సుఖాంతమైంది. ఢిల్లీలో నిర్మాణ రంగ కార్మికుడిగా పొట్టపోసుకుంటున్న ఇతడు.. కొడుకు మృత్యు ఒడిలో ఉన్నాడని తెలిసి ఢిల్లీ నుంచి 1,200 కి.మీ.ల దూరంలోని సొంతూరుకు కాలినడకన బయల్దేరడం, లాక్డౌన్ కారణంగా పోలీసులు అడ్డుకోవడం తెల్సిందే. తన వేదనను బంధువుకు ఫోన్లో మొరపెట్టుకుంటూ రోదిస్తున్న ఫొటో సమాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దాతలు స్పందించి సాయం చేశారు. దీంతో శ్రామిక్ రైలులో సొంతూరు బిహార్‌లోని బెగూసరాయ్‌కు చేరుకున్నాడు. బలహీనంగా ఉన్న రామ్‌ను అధికారులు ఆస్పత్రిలో చేర్చారు. విషయం తెల్సి భార్య, కూతురు(9) ఎట్టకేలకు ఆదివారం ఆయను ఆస్పత్రిలో కలుసుకున్నారు. చదవండి: ప్రతీ లక్షకు 7.1 కరోనా కేసులు చదవండి: కర్ణాటకలో వారికి నో ఎంట్రీ -
హాట్ సీటు: బేగుసరాయి
నాలుగోదశ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హాట్ సీటు బిహార్ రాష్ట్రంలో బేగుసరాయి. జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీని నేరుగా ఢీకొంటున్న యువ నేత కన్హయ్యకుమార్ ఈ స్థానం నుంచి సీపీఐ తరఫున పోటీ చేస్తూ ఉండటంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది. బేగుసరాయి ఒకప్పుడు సీపీఐకి కంచుకోట.. లెనిన్గ్రాడ్ ఆఫ్ బిహార్‌గా పేరు పొందింది. గత ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా బేగుసరాయిలో కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ అభ్యర్థి భోలాసింగ్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఆయన గత ఏడాది మరణించడంతో అప్పట్నుంచి ఈ స్థానం ఖాళీగానే ఉంది. కన్హయ్యకు మద్దతుగా తారాతోరణం ఒక ప్రశ్నించే యువగళం చట్టసభల్లో గొంతు విప్పాలని కోరుకుంటున్నవారెందరో. అందుకే కన్హయ్యకుమార్ నామినేషన్ సమయంలో జనం స్వచ్ఛందంగా వెల్లువెత్తారు. అరాచకశక్తులపై పోరాటం చేసే వీరుడిగా కన్హయ్యకుమార్‌ని నేతలు అభినందించారు. ప్రధాని నరేంద్రమోదీ విధానాల్ని నిరసిస్తూ ఒకే భావజాలం కలిగిన నాయకులు కన్హయ్యకు మద్దతుగా బేగుసరాయిలో ప్రచారం నిర్వహించారు. ఉద్యమకారులు జిగ్నేశ్ మేవానీ, , తీస్తా సెటల్వాద్లు ప్రచారం చేశారు. బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్, ఆయన భార్య షబానాఆజ్మీ, స్వరభాస్కర్, బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్‌రాజ్ వంటి వారు కన్హయ్యకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ‘‘పార్లమెంటులో ప్రజాగళం వినబడాలి. కన్హయ్యకుమార్ వంటివారు చట్టసభలకి ఎంతో అవసరం. అందుకే ఆయన తరఫున ప్రచారానికి వచ్చా‘‘అని ప్రకాశ్ రాజ్ చెప్పారు. మరోవైపు కన్హయ్యకు నిరసనలు ఎదురవుతున్నాయి. ప్రచారానికి వచ్చిన కన్హయ్యను చాలా చోట్ల యువకులు నిలదీస్తూ నీకు కావల్సిన స్వేచ్ఛ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 2014లో ఫలితాలు ఇలా వామపక్షాలకు ఇంకా పట్టున్న జిల్లాల్లో బేగుసరాయి కూడా ఒకటి. కానీ గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాన్ని ఎగరేసుకుపోయింది. అప్పటివరకు కమ్యూనిస్టు నాయకుడిగా సుప్రసిద్ధుడైన భోలాసింగ్ ఆఖరినిముషంలో బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ çహసన్ నిలిచారు. ఇక సీపీఐ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. త్రిముఖ పోటీలో కన్హయ్య సతమతం సీపీఐ పార్టీ పూర్వ వైభవం సాధించడం కోసం కన్హయ్యకుమార్‌ని రంగంలోకి దింపింది. స్థానికుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. అంతేకాదు భూమిహార్ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ నియోజకవర్గంలో వారి ఓట్లు అత్యంత కీలకం. 4 లక్షలకు పైగా ఓట్లు వారివే ఉన్నాయి. అందుకే కాషాయదళం భూమిహార్ అయిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌ను నవాదా నియోజకవర్గం నుంచి మార్చి మరీ కన్హయ్యపై పోటీకి నిలిపింది. గత ఎన్నికల్లో మోదీ హవా దేశాన్ని ఊపేసినా ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ హసన్ 3.69 లక్షల ఓట్లను కొల్లగొట్టారు. అందుకే ఈసారి కూడా లాలూ పార్టీ తన్వీర్ హసన్నే మళ్లీ బరిలో దింపింది. తన్వీర్ హసన్‌ది అందరితోనూ కలిసిపోయే తత్వం. ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. బేగుసరాయి నియోజకవర్గంలో ఆయనకి వ్యక్తిగత కరిష్మా ఎక్కువ. ఈ నియోజకవర్గంలో 3 లక్షలకు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. 2.5 లక్షల యాదవ్ ఓట్లు ఉన్నాయి. వీరంతా హసన్‌కే ఓటు వేసే అవకాశం ఉంది. మహాగ uŠ‡బంధన్ కన్హయ్యకుమార్కు మద్దతుగా నిల్చొని ఉంటే ఆయన విజయం నల్లేరు మీద బండి నడకే. కానీ త్రిముఖ పోటీలో ఓట్లు చీలి ఎవరికి లాభం చేకూరుతుందో అంచనా వేయలేని పరిస్థితి. కన్హయ్య కుమార్ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు ►ఎన్నికల ప్రచారాన్ని సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. సైకిల్, స్కూటర్, ఓపెన్ టాప్ కారు, ఒక్కోసారి నడుస్తూ కూడా ప్రచారం చేస్తున్నారు ► రైతు బిడ్డ. ఎన్నికల్లో ఖర్చు కోసం ప్రజల దగ్గర నుంచి ఒక్కొక్కరు రూపాయి ఇచ్చినా చాలంటూ నిధులు సేకరించారు ► వామపక్ష భావాలతో స్వేచ్ఛ కోసం గొంతెత్తిన యువగళం. పేదరిక నిర్మూలన, అరాచకాలు, అన్యాయాల్ని పారద్రోలడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. గిరిరాజ్ సింగ్ కేంద్ర మంత్రి ►ప్రచార ఆర్భాటాలు ఎక్కువ. ఎస్యూవీల్లోనే తిరుగుతుంటారు ►బీజేపీ అతివాద నాయకుల్లో ఒకరు. హిందూమత పరిరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తానని ప్రచారం చేసుకుంటూ వివాదాల్లో తరచూ చిక్కుకుంటారు. ► అధిష్టానం ఆదేశం మేరకు కన్హయ్య పేరు కూడా కనీసం ప్రస్తావించకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ►4,28,227 (39.73%) భోలాసింగ్ (బీజేపీ)కు పోలయిన ఓట్లు ►3,69,892 (34.32%) తన్వీర్ హసన్ (ఆర్జేడీ)కు వచ్చిన ఓట్లు ►1,92,639 (17.87%) రాజేంద్ర ప్రసాద్ సింగ్ (సీపీఐ)కు వచ్చిన ఓట్లు -
కన్హయ్య.. ఆ నినాదం ఇచ్చావా.. చెప్పు?
పట్నా : జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ యువనేత కన్హయ్య కుమార్ కాన్వయ్‌ని బేగూసరాయి స్థానికులు అడ్డుకున్నారు. ‘భారత్‌కే తుక్డే..తుక్డే’ అంటూ ఇచ్చిన నినాదంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అతన్ని ఘోరవ్ చేశారు. 2016లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్న కన్హయ్య కుమార్.. దేశ సమగ్రతను దెబ్బతినే విధంగా నినాదాలు చేశారన్న ఆరోపణలతో అతనిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కన్హయ్య వీటిని గట్టిగా ఖండించారు. వామపక్ష సిద్ధాంతాలను, దళితులకు అంబేడ్కర్ కల్పించిన రక్షణ కవచాన్ని కలగలిపి ‘లాల్.. నీల్’ అనే ఒక కొత్త రాజకీయ అస్త్రాన్ని సంధించి అందరి దృష్టిని ఆకర్షించిన కన్హయ్య కుమార్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బేగూసరాయి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించగా స్థానికులు కొంతమంది అడ్డుకున్నారు. ఏరకమైన స్వేచ్ఛ కావాలంటూ నిలదీశారు. రిజర్వేషన్లను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు వచ్చిన ఆరోపణల సంగతేంటని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పని కన్హయ్య కుమార్.. బీజేపీ మద్దతుదారులా అంటూ ఎదురు ప్రశ్నించారని స్థానికులు మీడియాతో వాపోయారు. -
నా స్నేహితుడి గెలుపు కోసమే తొలిసారిగా..
పట్నా : తన స్నేహితుడు, బెగుసరాయ్ ఎంపీ అభ్యర్థి కన్హయ్య కుమార్ విజయం సాధిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టేనని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బిహార్‌లోని బెగసరాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో స్వరా భాస్కర్ మాట్లాడుతూ.. భారతీయులు పొందాల్సిన రాజ్యాంగ హక్కులు, నిరుద్యోగ సమస్య, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న కన్హయ్యను గెలిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో పెచ్చు మీరుతున్న మూకదాడులను ప్రశ్నిస్తూ, రాజ్యాంగ విలువలు పతనం కాకుండా కాపాడే అతడి సిద్ధాంతాలు ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. దేశభక్తి గల ప్రతీ భారతీయుడు కన్హయ్యకు ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు. నా స్నేహితుడి గెలుపు కోసమే తొలిసారిగా.. ‘నాకు తెలిసి పుట్టినరోజును ఎవరూ ఇలా సెలబ్రేట్ చేసుకోరు. వేడుకలు చేసుకోవడం కంటే కూడా మనందరి తరఫున ఎన్నికల యుద్ధంలో పోరాడుతున్న నా స్నేహితుడు కన్హయ్య విజయమే నాకు ముఖ్యం. ఇంతకుముందెన్నడూ నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది లేదు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్న కన్హయ్య సిద్ధాంతాలు నచ్చడం వల్లే ఇక్కడి వచ్చాను. తను ప్రజా గొంతుకై నిలుస్తాడు’ అని స్వరా పేర్కొన్నారు. కాగా బోల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న స్వరా భాస్కర్ జెఎన్యూలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నటనతో పాటు పలు సామాజిక అంశాలపై గళమెత్తే ఆమె.. గత కొంతకాలంగా ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక 2016లో కన్హయ్య కుమార్‌పై ఢిల్లీలో దేశద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఛార్జీషీట్ రూపొందించి ఇటీవలే పాటియాలా హౌజ్ కోర్టులో సమర్పించారు. 2016లో జేఎన్‌యూలో జరిగిన ఓ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతోపాటు పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా మాట్లాడారని కన్హయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా బెగుసరాయ్ నుంచి పోటీ చేయడం ద్వారా తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29న జరుగనున్న ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని భావిస్తున్నారు. తన ప్రచారం కోసం ఇటీవలే ఫండ్‌రైజ్ క్యాంపెయిన్ మొదలుపెట్టగా అన్ని వర్గాల నుంచి ఆయనకు విశేష స్పందన లభించింది. -
బెగుసరాయ్ నుంచి కన్హయ్య కుమార్ పోటీ
పాట్నా : జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. బీహార్‌లోని బెగుసరాయ్ నియోజకవర్గం నుంచి కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్నట్లు మహా కూటమి ప్రకటించింది. అయితే దీనిపై ఆర్జేడీ ఇంకా స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. కన్హయ్య పోటీపై బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఆర్జేడీ, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ, హిందూస్థానీ ఆవామ్ మోర్చా(సెక్యూలర్), వికాస్‌షీల్ ఇసాన్ పార్టీ, వామపక్షాలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహాకూటమిగా ఏర్పడ్డాయి. కన్నయ్య కుమార్‌పై 1200 పేజీల ఛార్జ్‌షీట్ కన్హయ్య కుమార్.. సీపీఐ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. బెగుసరాయ్ లోక్‌సభ స్థానం నుంచి మహాకూటమి అభ్యర్థిగా కన్హయ్య పోటీ చేస్తున్నట్లు సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ పాండే మంగళవారం ప్రకటించారు. బిహార్‌లో సీట్లు పంపకాలపై కాంగ్రెస్, ఆర్జేడీ, ఆర్ఎల్ఎస్పీ భేటీ కానుంది. వీరి సమావేశంలో కన్హయ్య అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 2016లో కన్హయ్య కుమార్‌పై ఢిల్లీలో దేశద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. చిక్కుల్లో కన్హయ్యకుమార్.. కేసు నమోదు! దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఛార్జీషీట్ రూపొందించి ఇటీవలే పాటియాలా హౌజ్ కోర్టులో సమర్పించారు. 2016లో జేఎన్‌యూలో జరిగిన ఓ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతోపాటు పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా మాట్లాడారని అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఆయన తొలిసారి బరిలో నిలువనున్నారు. ఏప్రిల్ 29న బిహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. -
బీజేపీ ఎంపీ కన్నుమూత
పట్నా : బీజేపీ సీనియర్ నేత, బిహార్‌లోని బెగుసరయ్ ఎంపీ బోలా సింగ్ (80) మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బెగుసరయ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అంతకు ముందు 2000 నుంచి 2005 వరకు బిహార్ రాష్ట్ర అసెంబ్లీ స్వీకర్‌గా వ్యవహరించారు. బిహార్‌లోని గ్రామీణ ప్రాంతంలో 1939లో జన్మించిన బోలా.. పట్నా యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. వామపక్ష భావాజాలం గల ఆయన 1967లో సీపీఐ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి బిహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత సీపీఐ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో కాంగ్రెస్‌లో చేరిన బోలా కొంతకాలం తరువాత పార్టీతో విభేదించి.. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో ఆర్జేడీ 1990లో అధికారంలోకి రావడంతో లాలూతో చేతులు కలిపారు. ఆ తరువాత 2000లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెగుసరయ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన అసెంబ్లీ స్వీకర్‌గా వ్యవహరించారు. ఎనిమిది సార్లు శాసన సభ్యుడిగా, రెండు సార్లు లోక్‌సభ సభ్యుడిగా సేవలందించారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఇద్దరు కూతుర్లు. -
ఎంపీగా కన్నయ్య కుమార్..!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వామపక్ష విద్యార్థి నేత కన్నయ్య కుమార్ ఎంపీగా పోటీ చేయనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన స్వస్థలమైన బిహార్‌లోని బెగుసరై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు బిహార్ సీపీఐ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సింగ్ ప్రకటించారు. సీపీఐ నుంచి ఆయన పోటీ చేస్తారని, దీనికి వామపక్ష పార్టీల మద్దతు తెలిపినట్లు ఆదివారం ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన మిత్రపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు కూడా కన్నయ్య కుమార్‌కు మద్దతు తెలిపాయని వెల్లడించారు. ఆర్జేడీ ఛీప్ లాలు ప్రసాద్ యాదవ్ గతంలోనే ఆయన పేరును ప్రతిపాధించారని, ఆయన సూచన మేరకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా కన్నయ్య కుమార్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. కాగా దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై ఢిల్లీ పోలీసులు గతంలో దేశ ద్రోహ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కన్నయ్య కుమార్ ఇదే నియోజవర్గానికి చెందిన భీహాట్ గ్రామ పంచాయతీ చెందినవాడు. కాగా 2014 ఎన్నికల్లో బెగుసరై నియోజవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ సింగ్‌పై బీజేపీ అభ్యర్థి భోలా సింగ్ 58 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. -
దారుణం: కళ్లలోకి యాసిడ్ ఇంజెక్ట్ చేసి..
బెగుసరాయ్: యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని కర్కశంగా గుడ్డివాడిగా మార్చిన దారుణ ఘటన బిహార్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. బెగుసరాయ్ జిల్లా పిప్రా చౌక్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని డీఎస్పీ బీకే సింగ్ తెలిపారు. సమశక్తిపూర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి తెఘ్రా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బరౌనీ గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఫ్రిబవరి 6న ఆమెను తీసుకుని పారిపోయాడు. తన భార్యను డ్రైవర్ కిడ్నాప్ చేశాడని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 16న తెఘ్రాకు తిరిగి వచ్చి స్థానిక కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత భర్తతో కలిసి ఆమె ఇంటికి వెళ్లిపోయింది. డ్రైవర్‌తో వెళ్లిపోయిన ఆమె ఎందుకు తిరిగొచ్చిందనేది వెల్లడికాలేదు. శుక్రవారం సాయంత్రం డ్రైవర్‌కు ఆమె మరిది ఫోన్ చేశాడు. తన వదిన తమ వద్ద ఉండేందుకు ఇష్టపడటం లేదని, తెఘ్రా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆమెను తీసుకెళ్లాలని చెప్పాడు. నిజమని నమ్మి బయలుదేరిన డ్రైవర్‌ను దారి మధ్యలోనే దాదాపు 20 మంది అడ్డగించారు. రోడ్డున పక్కనున్న హోటల్లోకి తీసుకెళ్లి బాగా కొట్టారు. తర్వాత సిరంజీతో అతడి కళ్లలోకి యాసిడ్‌ను ఇంజెక్ట్ చేశారు. అతడిని హనుమాన్ చౌక్ సమీపంలో పడేసి పారిపోయారు. దారినపోయే వ్యక్తి చూసి అతడిని బెగుసరాయ్ ఆస్పత్రిలో చేర్చాడని, బాధితుడి చూపుపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారని డీఎస్పీ సింగ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
153కు బిహార్ వరద మృతులు
న్యూఢిల్లీ: బిహార్ వరదల్లో శనివారం మరో నలుగురు మృతువాత పడడంతో మొత్తం మృతుల సంఖ్య 153కు చేరింది. భోజ్‌పూర్, బెగుసరాయ్ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 12 పంచాయతీ ప్రాంతాలు ముంపులో చిక్కుకోవడంతో మొత్తం 12 జిల్లాల్లో 34.69 లక్షల మంది వరద బారిన పడ్డారు. గంగా, సోనే, పున్పున్, బుర్హీ గండక్, ఘాఘ్రా, కోసి, ఇతర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో వరద తీవ్ర రూపం దాల్చడంతో శనివారం ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇంతవరకూ మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో పలు నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో 987 గ్రామాల్లో 8.7 లక్షల మంది ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా ఎత్తై పర్వత ప్రాంతాల్లో ఈ సీజన్లో మొదటి సారి మంచు కురిసింది.