బెగుసరాయ్: రూ. 13 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ఏడాది పాటు నిర్మించిన ఓ వంతెన ప్రారంభానికి కూడా నోచుకోకుండానే కూలిపోయింది. 2017లోనే దీన్ని నిర్మించినప్పటికీ అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో నిరుపయోగంగా ఉంది. ఇటీవలే పగుళ్లు రావడంతో స్థానికులు అధికారులకు లేఖ రాశారు. వారు చర్యలు తీసుకునే లోపే వంతెన ఆదివారం కూలిపోయింది.
బిహార్‌లో బెగుసరాయ్ జిల్లాలో బుధిగండక్ నదిపై 2017లో 206 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని నిర్మించారు. అప్రోచ్ రోడ్డు వేసేందుకు ప్రైవేటు భూమిని సేకరించలేదు. దీంతో అది ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.
అప్పుడప్పుడు ట్రాక్టర్లు, భారీ వాహనాలు వంతెన మీదుగా వెళ్తున్నాయి. వంతెన 2, 3 పిల్లర్ల మధ్య భాగంలో పగుళ్లు బారి పోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ప్రారంభం కూడా కాకుండానే వంతెన కూలడంతో నిర్మాణ నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చదవండి: మిసెస్ వరల్డ్‌గా సర్గమ్ కౌశల్.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు కిరీటం..
Comments
Please login to add a commentAdd a comment