దారుణం: రైలు ఇంజిన్‌-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి | Railway Worker Trapped While Moving Train Coaches deceased bihar | Sakshi
Sakshi News home page

దారుణం: రైలు ఇంజిన్‌-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి

Published Sat, Nov 9 2024 4:07 PM | Last Updated on Sat, Nov 9 2024 4:25 PM

Railway Worker Trapped While Moving Train Coaches deceased bihar

పట్నా: బీహార్‌లోని బెగుసరాయ్‌లోని బరౌని రైల్వే జంక్షన్‌లో దారుణం ఘటన చోటుచేసుకుంది.  రైలు ఇంజిన్‌-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఓ ఉద్యోగి మృతి చెందాడు. శనివారం జరిగిన షంటింగ్ ఆపరేషన్‌లో రైల్వే పోర్టర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోన్‌పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని స్టేషన్‌లో పనిచేస్తున్న పోర్టర్‌ అమర్‌కుమార్‌రావుగా గుర్తించారు. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ లక్నో జంక్షన్ నుంచి రావటంతో బరౌని జంక్షన్ ప్లాట్‌ఫారమ్ 5పై తన విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మృతి చెందాడు.

రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు ఇంజిన్‌-బోగీల మధ్య కప్లింగ్‌ విడదీసేందుకు యత్నించిన సమయంలో రైలు అనూహ్యంగా రివర్స్‌ కావడంతో అతను రెండు క్యారేజీల మధ్య ఇరుక్కుపోయి మృతి చెందాడని తెలిపారు. ఘటన జరిగిన అనంతరం రైలు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారైనట్లు సమాచారం.

చదవండి: లక్కీ కారుకు సమాధి.. రూ. 4 ల‌క్ష‌ల ఖ‌ర్చు, 1500 మంది జ‌నం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement