Railway employe
-
డ్యూటీ... డ్యాన్సుల్లో ట్రాక్ రికార్డ్
విశిష్ట రైల్వే సేవా పురస్కారానికి ఎంపికైన ఉద్యోగిగా గుంటూరుకు చెందిన జవ్వాది వెంకట అనూష వార్తల్లో నిలిచింది. దిల్లీ ప్రగతి మైదాన్ లో జరిగిన 69వ రైల్వే సేవా పురస్కారాల కార్యక్రమంలో అతి విశిష్ట రైల్వే సేవా పురస్కారాన్ని అందుకున్న అనూష కూచిపూడి నృత్యకారిణి కూడా. మనసు ఉంటే మార్గం ఉన్నట్టే... ఒక్క పడవ అని ఏమిటి ఎన్ని పడవల మీద అయినా ప్రయాణం అద్భుతంగా సాధ్యం అవుతుంది!నేర్చుకోవడానికి వ్యక్తులకు మించిన పాఠశాలలు ఉంటాయా?అనూషకు నాన్న ఒక పాఠశాల. ఆయన రైల్వేలో ఇంజినీర్. వృత్తిపట్ల అంకితభావం తండ్రి నుంచే నేర్చుకుంది. తాను కూడా నాన్నలాగే రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంది. జవ్వాది వెంకట నాగ సుబ్రమణ్యంతో అనూషకు వివాహం జరిగింది. ఆయన అప్పుడు కేరళ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. 2008లో మళ్లీ సివిల్స్ రాసి ఐఎఎస్‌కు ఎంపిక అయ్యారు. ‘మరింత కష్టపడాలి’ అనే పాఠాన్ని భర్త నుంచి నేర్చుకున్న అనూష ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్ (ఐఆర్ఎస్ఈ)గా ఎంపిక అయింది.ఇక కళలకు సంబంధించి అమ్మ తనకు పాఠశాల.తల్లి స్ఫూరితో కూచిపూడి నేర్చుకుంది. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వేదాంతం రామలింగశాస్త్రి శిష్యురాలైన అనూష యూరోపియన్ తెలుగు అసోసియేషన్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలలో చిన్నప్పుడే ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ఏడాది జూన్ లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో భోపాల్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చింది.నృత్యంలో ‘భేష్’ అనిపించుకున్న అనూష ఉద్యోగ జీవితంలో ‘ది బెస్ట్’ అనిపించుకుంది.‘గుంటూరు డివిజన్ కు 2022లో వచ్చాను. కృష్ణకెనాల్ జంక్షన్ నుంచి కృష్ణా నదివైపు ఉన్న ట్రాక్ వీక్‌గా ఉండేది. దీనికోసం ప్రతి ఏటా 50 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చేది. జియో టైల్స్, జియో బ్రిడ్జెస్ వేసి కొత్త తరహాలో ట్రాక్‌ను పటిష్టపరిచాము. దీనివల్ల ఇప్పుడు ఏడాదికి రెండు లక్షలు కూడా ఖర్చు అవ్వడం లేదు. పెద్ద పెద్ద యంత్రాలు వాడకుండా ఎన్నో పనులను వినూత్న రీతిలో పూర్తి చేశాము. దీనికి కూడా జీఎం నుంచి ప్రశంసలు అందుకున్నాను. ఈ ప్రయోగాలు గుంటూరు డివిజన్ కు బోలెడంత పేరు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే రైల్వేబోర్డు నన్ను గుర్తించింది. అతి విశిష్ట రైలు సేవా పురస్కారం దక్కింది. మన కష్టం వల్ల వచ్చిన ఫలితాన్ని చూసినప్పుడు వృత్తిపట్ల అంకితభావం మరింతగా పెరుగుతుంది’ అంటుంది అనూష. వృత్తి జీవితంలో, కూచిపూడి నృత్యకారిణిగా ఆమె మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆశిద్దాం.ఎన్నో అడ్డంకులు... అయినా సరే ముందుకు వెళ్లాం!నా భర్త అస్సాం కేడర్ ఐఏఎస్ కావడంతో నాకు కూడా నార్త్ ఈస్ట్ రైల్వేలో పోస్టింగ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా వచ్చింది. అక్కడ తీవ్రవాదంతో పాటు బ్రహ్మపుత్ర వరదల సమస్య ఎక్కువగా ఉన్న కారణంగా ఏడాదిలో ఎనిమిది నెలలు ΄్లానింగ్, నాలుగు నెలలు మాత్రమే ఎగ్జిక్యూషన్ ఉండేది. అక్కడ ఉన్న పరిస్థితుల్లో రైలు నడిచేలా చర్యలు తీసుకోవడంతోపాటు సిబ్బందిని కాపాడుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్‌లా ఉండేది. ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగాము. రెండు వర్గాల మద్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో రైల్వే కూడా రాష్ట్ర పరిధిలోకి వచ్చింది. మేం కూడా వారితో కలిసి ప్రశాంతత నెలకొల్పే విషయంలో గట్టిగా పనిచేశాం. గౌరీపూర్ నుంచి బిలాస్పూర్ వరకూ కొత్త రైల్వేలైన్ వేసిన సమయంలో బ్రహ్మపుత్రపై పెద్ద పెద్ద బ్రిడ్జీల నిర్మాణం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. భూసేకరణ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. అన్నింటిని అధిగమించి రైల్వే లైన్ పూర్తి చేయడం పెద్ద అచీవ్మెంట్. దీనికి గుర్తింపుగా రైల్వే జీఎం అవార్డు వచ్చింది.– జవ్వాది వెంకట అనూష– దాళా రమేష్‌బాబు, సాక్షి ప్రతినిధి గుంటూరుఫోటోలు: షేక్ సుభానీ, లక్ష్మీపురం -
దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి
పట్నా: బీహార్‌లోని బెగుసరాయ్‌లోని బరౌని రైల్వే జంక్షన్లో దారుణం ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఓ ఉద్యోగి మృతి చెందాడు. శనివారం జరిగిన షంటింగ్ ఆపరేషన్‌లో రైల్వే పోర్టర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోన్పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని స్టేషన్లో పనిచేస్తున్న పోర్టర్ అమర్‌కుమార్‌రావుగా గుర్తించారు. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ లక్నో జంక్షన్ నుంచి రావటంతో బరౌని జంక్షన్ ప్లాట్‌ఫారమ్ 5పై తన విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మృతి చెందాడు.రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు ఇంజిన్-బోగీల మధ్య కప్లింగ్ విడదీసేందుకు యత్నించిన సమయంలో రైలు అనూహ్యంగా రివర్స్ కావడంతో అతను రెండు క్యారేజీల మధ్య ఇరుక్కుపోయి మృతి చెందాడని తెలిపారు. ఘటన జరిగిన అనంతరం రైలు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారైనట్లు సమాచారం.A tragic incident occurred at Barauni Junction, Bihar, where a railway worker lost his life due to negligence during shunting operations.Meanwhile, the Railway Minister remains occupied with PR and social media.It seems that the railway prioritizes neither passenger safety… pic.twitter.com/teR9r4rzuj— Fight Against Crime & Illegal Activities (@FightAgainstCr) November 9, 2024చదవండి: లక్కీ కారుకు సమాధి.. రూ. 4 లక్షల ఖర్చు, 1500 మంది జనం! -
స్నేహితుడే కాలయముడు
పెదవాల్తేరు/ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): స్నేహితుడే కాలమయుడయ్యాడు. ఆ కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా చేశాడు. బ్యాంకు రుణం మంజూరులో సాయం చేస్తానంటూ నమ్మించి ఇంటికి తీసుకెళ్లి కడతేర్చాడు. ఆంధ్రా యూనివర్సిటీ ఇన్‌గేటు ఎదురుగా గల ఏయూ క్వార్టర్స్‌లో 19వ నంబరు నివాసం వద్ద జరిగిన హత్యోదంతం గురువారం ఉదయం కలకలం రేపింది. వర్సిటీ ఉద్యోగే హంతకుడు కావడంతో ఏయూ వర్గాలు విస్మయానికి గురయ్యాయి. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంచరపాలెం దరి పాత ఐటీఐ శ్రీరాంనగర్కి చెందిన భద్రగిరి వెంకటరమణ (64) రైల్వేశాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇతనికి భార్య, కుమారుడు హేమంత్‌కుమార్, కుమార్తె లక్ష్మి ఉన్నారు. లక్ష్మి భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రులతోనే నివసిస్తోంది. ఈ నేపథ్యంలో ఏయూలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ వరప్రసాద్ (50) జిల్లా కోర్టు ఉద్యోగి ద్వారా వెంకటరమణకు ఏడేళ్ల క్రితం పరిచయమయ్యాడు. వెంకటరమణ రామా టాకీస్ రోడ్డులో గల రెప్కో బ్యాంకులో గృహ రుణం నిమిత్తం రూ.20లక్షలకు ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. ఈ రుణం విషయంలో వెంకటరమణ స్నేహితుడు వరప్రసాద్ సహాయం తీసుకున్నారు. బ్యాంకు ష్యూరిటీ నిమిత్తం వరప్రసాద్ తన బంధువు జగదీష్‌తో కలిసి బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఐటీఐ వద్ద గల వెంకటరమణ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి వీరు ముగ్గురూ ఏటీఎం కేంద్రానికి వెళ్లి... వెంకటరమణ రూ.3వేలు డ్రా చేసి వరప్రసాద్‌కి ఇచ్చారు. అనంతరం ముగ్గురూ ఏయూ క్వార్టర్స్‌లోని వరప్రసాద్ ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయానికి వెంకటరమణ ఏయూ క్వార్టర్స్‌లోని కాలువలో విగతజీవిగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డీసీపీ ఫకీరప్ప, తూర్పు ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, సీఐ ఇమ్మాన్యుయేల్‌రాజు తదితరులు సంఘటన స్థలానికి చేరకుని స్థానికులను విచారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. కుమార్తెతో వివాహానికి ఒప్పుకోనందుకే...! ఆంధ్రా యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వరప్రసాద్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా వరప్రసాద్‌తో కాపురం చేయలేక విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. మరోవైపు వెంకటరమణ కుమార్తె లక్ష్మి భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో లక్ష్మితో తనకు వివాహం జరిపించాలని వరప్రసాద్ మూడు సంవత్సరాలుగా వెంకటరమణ కుటుంబ సభ్యులను కోరుతున్నాడు. కోర్టులో వరప్రసాద్ రెండో భార్య వేసిన విడాకుల కేసు తేలిన తర్వాత చూద్దామని లక్ష్మి కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో వెంకటరమణపై వరప్రసాద్ కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి తన ఇంట్లో లక్ష్మితో వివాహం విషయమై వెంకటరమణతో వరప్రసాద్ గొడవ పడ్డాడని తెలసింది. మాటామాటా పెరగడంతో తన బంధువు జగదీష్ సాయంతో వెంకటరమణపై వరప్రసాద్ దాడి చేశాడు. సిమెంట్ రేకులు, సుత్తితో మోది చంపేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకూడదని ఇళ్లంతా కడిగేశారు. ఇంటి వెనుక భాగం నుంచి మృతదేహాన్ని కాలువలో పడేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మృతుని కుమారుడు హేమంత్‌కుమార్ ఫిర్యాదు మేరకు మూడో పట్టణ సీఐ ఇమ్మాన్యుయేల్‌రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉలిక్కిపడిన ఏయూ ఉద్యోగులు నిత్యం విద్యార్థులతో ప్రశాంతంగా దర్శనమిచ్చే విశ్వవిద్యాలయం క్వార్టర్స్‌లో గురువారం ఉదయం మృతదేహం కనిపించడంతో అంతా ఉలిక్కిపడ్డారు. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ నివాసాలకు కూతవేటు దూరంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గతంలో విశ్వవిద్యాలయంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోలేదు. హత్యోదంతంతో పక్కనే నివాసం ఉంటున్న ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. రాత్రి 11 గంటల వరకు జనసంచారం ఉందని, అర్థరాత్రి సమయంలో సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కిరాతకంగా హత్య చేయడం, మృతదేహం అక్కడే వదిలేయడంతో ఆందోళన చెందారు. నిత్యం వరప్రసాద్ ఇంటిలో గొడవలు జరగడం, పెద్దగా అరుపులు వినపించడం పరిపాటేనని వీరు చెబుతున్నారు. బుధవారం రాత్రి సమయంలో సైతం ఇటువంటి వాగ్వాదం జరిగి, పెద్దగా మాట్లాడుకోవడం వినిపించినట్లు చెబుతున్నారు. -
రూ.1,333 బదులుగా రూ.1.33 లక్షలు..
ముంబై: లోకల్ టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద రైల్వే సిబ్బంది చేసిన చిన్న పొరపాటుతో ఓ ప్రయాణికుడి ఖాతాలోంచి రూ.1,333 బదులుగా ఏకంగా రూ.1.33 లక్షలు రైల్వే ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఈ మొత్తాన్ని రికవరి చేసుకోవడానికి రైల్వే కార్యాలయం చుట్టు తిరిగి, తిరిగి బేజారైతున్నాడు ఆ ప్రయాణికుడు. ముంబై బోరివలిలో ఉంటున్న వికాస్ మంచేకర్ నిత్యం లోకల్ రైలులో ప్రయాణిస్తాడు. ఈ నెల నాలుగో తేదీన సీజన్ పాస్ కొనుగోలు చేయడానికి బోరివలి స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ మొదటి తరగతి (ఫస్ట్ క్లాస్) త్రైమాసిక సీజన్ పాస్ రూ.1,333.30 పైసలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో వికాస్ తనవద్ద ఉన్న క్రెడిట్ కార్డు బుకింగ్ క్లర్క్‌కు ఇచ్చాడు. పీఓఎస్ మెషిన్‌పై స్వైప్ చేసిన ఆ క్లర్క్ పొరపాటున రూ.1333.30 బదులుగా రూ.1,33,330 ఇలా అంకెలు వేయడంతో ఏకంగా రూ.1.33 లక్షలు వికాస్ అకౌంట్లో నుంచి రైల్వే అకౌంట్లోకి వెళ్లిపోయాయి. ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో లబోదిబోమంటూ సమీపంలో ఉన్న రైల్వే కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆ డబ్బులు ఇప్పటికీ తన అకౌంట్లోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అనేక మంది క్రెడిట్, డెబిట్ కార్డు, ఏటీఎం, యూపిఐ లాంటి ఈ–పేమెంట్ లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే వికాస్ తన వద్ద ఉన్న క్రెడిట్ కార్డు ఇచ్చాడు. కానీ రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంవల్ల పుల్‌స్టాప్, కామాలు అటు, ఇటు కావడంతో అతడి కొంప ముంచింది. ఇప్పటికి ముంబై సెంట్రల్, ప్రజా సంబంధాల అధికారితో తరుచూ సంప్రదింపులు జరుపుతున్నారు. వికాస్ క్రెడిట్ కార్డు ఈ నెల 24తో గడువు ముగుస్తుంది. ఆ లోపు రైల్వే అతని డబ్బులు ఖాతాలో వేయని పక్షంలో అదనంగా రూ.4–5 వేల జరిమానా భారం పడనుంది. -
ప్రమోషన్ కోసమే స్వాతి హత్య
విజయనగరం : జిల్లాలో సంచలనం సృష్టించిన ఎస్.కోట రైల్వే ఉద్యోగిని హత్య కేసు చిక్కుముడి వీడింది. పోలీసులకు సవాల్‌గా మారిన స్వాతి హత్య కేసును నెలరోజుల దాటాక ఎట్టకేలకు ఛేదించారు. గతనెల 11న శృంగవరపుకోట మండల కేంద్రం రైల్వే విద్యుత్ ఉప కేంద్రంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న చిట్టిమోజు స్వాతి దారుణ హత్యకు గురవడం తెలిసిందే. హత్యకు ప్రధాన సూత్రధారి అదే విభాగంలో పనిచేసే ఉద్యోగి గోపి అని పోలీసులు గుర్తించారు. ప్రమోషన్ కోసమే స్వాతిని హత్య చేసినట్టు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. గోపాలపట్నంలో పనిచేస్తున్న స్వాతిని ఎస్.కోటకు, ఎస్.కోటలో పనిచేస్తున్న నిందితుడిని గోపాలపట్నం బదిలీ చేయడమే హత్యకు కారణమని తెలిసింది. స్వాతిని బెదిరించి ఎస్.కోట నుంచి బదిలీ చేయించుకుని వెళ్లేలా ప్రయత్నించాడు. అది వీలు కాకపోవడంతో స్వాతి అడ్డు తొలగించుకునేందుకు పథకం రచించాడు. మరో ముగ్గురితో కలిసి స్వాతిని హత్య చేశాడు. రైల్వే పోర్టర్‌గా పనిచేసి, డిపార్ట్మెంటల్ పరీక్ష రాసిన నిందితునికి కొద్దిరోజుల క్రితం పదోన్నతి లభించడం గమనార్హం. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ ఆదేశాల మేరకు విజయనగరం డీఎస్పీ పి.వి.రత్నం, సీసీఎస్ డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి కేసును సవాల్‌గా తీసుకున్నారు. దాదాపు 12 వందల మంది వరకు అనుమానితుల్ని విచారించారు. రైల్వే ఉద్యోగులతో పాటు రైళ్లలో పనిచేసే ప్రైవేటు కార్మికులు, టీ, సమోసాలు అమ్మేవారు, స్వాతి భర్త కుటుంబ సభ్యులు, ఇనుప ముక్కలు అమ్మేవారిని విచారించారు. ఈ క్రమంలో సహ ఉద్యోగి సూత్రధారి అన్న కీలక సమాచారం బయటపడింది. ఎస్.కోటలో నిందితుడు పనిచేస్తుండగా కొందరు ఇనుప తుక్కు నేరస్తులతో సంబంధాలున్నట్టు సమాచారం. ఇతనిపై ఇప్పటికే ఇనుప తుక్కు రవాణా కేసులున్నట్టు తెలిసింది.