employee dead
-
దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి
పట్నా: బీహార్‌లోని బెగుసరాయ్‌లోని బరౌని రైల్వే జంక్షన్లో దారుణం ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఓ ఉద్యోగి మృతి చెందాడు. శనివారం జరిగిన షంటింగ్ ఆపరేషన్‌లో రైల్వే పోర్టర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోన్పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని స్టేషన్లో పనిచేస్తున్న పోర్టర్ అమర్‌కుమార్‌రావుగా గుర్తించారు. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ లక్నో జంక్షన్ నుంచి రావటంతో బరౌని జంక్షన్ ప్లాట్‌ఫారమ్ 5పై తన విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మృతి చెందాడు.రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు ఇంజిన్-బోగీల మధ్య కప్లింగ్ విడదీసేందుకు యత్నించిన సమయంలో రైలు అనూహ్యంగా రివర్స్ కావడంతో అతను రెండు క్యారేజీల మధ్య ఇరుక్కుపోయి మృతి చెందాడని తెలిపారు. ఘటన జరిగిన అనంతరం రైలు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారైనట్లు సమాచారం.A tragic incident occurred at Barauni Junction, Bihar, where a railway worker lost his life due to negligence during shunting operations.Meanwhile, the Railway Minister remains occupied with PR and social media.It seems that the railway prioritizes neither passenger safety… pic.twitter.com/teR9r4rzuj— Fight Against Crime & Illegal Activities (@FightAgainstCr) November 9, 2024చదవండి: లక్కీ కారుకు సమాధి.. రూ. 4 లక్షల ఖర్చు, 1500 మంది జనం! -
పని ఒత్తిడితో కుర్చీలోనే కుప్పకూలిన ఉద్యోగి?
లక్నో: పని ఒత్తిడి మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. పూణే ఉద్యోగి ఘటన మరవక ముందే.. లక్నోలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తూ కుర్చీలోనే ప్రాణాలు వదిలింది ఓ బ్యాంకు ఉద్యోగిణి!. ఉత్తర ప్రదేశ్ గోమతినగర్‌లోని ఓ ప్రైవేట్‌బ్యాంకులో మంచి పొజిషన్లోనే సదాఫ్ ఫాతిమా పని చేస్తోంది. మంగళవారం (సెప్టెంబర్ 24) డ్యూటీకి హాజరైన ఆమె కుర్చీలోనే కూలబడింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అయితే.. అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా ఆమెకు ఈ మధ్యే ప్రమోషన్ వచ్చిందని.. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన పని ఒత్తిడికి గురైందని ఆమె తోటి ఉద్యోగులు చెబుతున్నారు. అయితే.. ఈ ఆరోపణలపై సదరు బ్యాంకు స్పందించాల్సి ఉంది. ఈ ఘటనపై సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎక్స్ ద్వారా స్పందించారు. ఆర్థిక లక్ష్యాల సాధన ఒత్తిడే.. ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని ఆరోపించారాయన. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఎకానమీ టార్గెట్లను సీరియస్‌గా తీసుకుంటున్నాయి. అది ఉద్యోగులపై పడుతోంది. అందుకే ఇలాంటి మరణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇది ముమ్మాటికీ ఆందోళన కలిగించే అంశం. దీనిని అడ్డుకట్ట పడాలంటే.. ఆరోగ్యకరమైన పని వాతావరణం కలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన పేర్కొన్నారు.लखनऊ में काम के दबाव और तनाव के कारण एचडीएफ़सी की एक महिलाकर्मी की ऑफिस में ही, कुर्सी से गिरकर, मृत्यु का समाचार बेहद चिंतनीय है।ऐसे समाचार देश में वर्तमान अर्थव्यवस्था के दबाव के प्रतीक हैं। इस संदर्भ में सभी कंपनियों और सरकारी विभागों तक को गंभीरता से सोचना होगा। ये देश के… pic.twitter.com/Xj49E01MSs— Akhilesh Yadav (@yadavakhilesh) September 24, 2024 పని ఒత్తిడి కారణంగానే కేరళ కొచ్చికి చెందిన యువ సీఏ అన్నా సెబాస్టియన్ పెరియాళి కన్నుమూసిందన్న వార్త.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జులైలో పుణెలోని సంస్థ కార్యాలయంలో తన విధుల్లో ఉండగా.. అస్వస్థతకు గురవడంతో తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కాసేపటికే మరణించారు. అయితే పని ఒత్తిడే ఆమె మరణానికి కారణమంటూ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు అన్నా సెబాస్టియన్ తల్లి అనితా తాజాగా ఈవై ఇండియా హెడ్‌కు లేఖ రాయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి.. పని ఒత్తిడి అంశం అటు ఉద్యోగ వర్గాల్లోనూ.. ఇటు దేశ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు కేంద్ర కార్మికశాఖ ఈ అంశంపై విచారణకు ఆదేశించగా.. మానవ హక్కుల కమిషన్ సైతం ఈ అంశంలో జోక్యం చేసుకుంది. -
‘EY ఉద్యోగి చావుకు కారణం ఆ మేనేజర్ క్రికెట్ పిచ్చి’
యర్నెస్ట్ అండ్ యంగ్ (EY) సీఏ అన్నా సెబాస్టియన్ మరణం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ పని సంస్కృతిపై పెను చర్చకు దారితీసింది. ఆమె 'అధిక పని' కారణంగానే మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన అన్నా సెబాస్టియన్ పెరాయిల్ తండ్రి సీబీ జోసెఫ్ కొత్త విషయాలు చెప్పారు. ఆమె మేనేజర్‌కు ఉన్న క్రికెట్ పిచ్చే తమ కుమార్తెపై పని ఒత్తిడి పెంచిందంటూ ఆరోపిస్తున్నారు."ఆమె (అన్నా సెబాస్టియన్) మార్చి 18న అక్కడ (EY) చేరింది. ఒక వారం తర్వాత, ఆమె సాధారణ ఆడిటింగ్‌ను ప్రారంభించింది. EY పూణేలో 6 ఆడిట్ బృందాలు ఉన్నాయి. ఆమెను 6వ టీమ్‌లో చేర్చారు. ఆడిట్ మేనేజర్ పనిని సమీక్షించారు. ఆమె అర్ధరాత్రి వరకు పని చేయాల్సి వచ్చింది. ఆమె పీజీకి చేరుకున్న తర్వాత కూడా అదనపు పనిని చేయవలసి వచ్చింది.నిద్రించడానికి, తినడానికి కూడా ఆమెకు సమయం లేదు. ఆమె పని ఒత్తిడిని కలిగి ఉంది. మేనేజర్ సమయానికి పనిని సమీక్షించలేదు. అతను క్రికెట్ అభిమాని. మ్యాచ్ షెడ్యూల్‌కు అనుగుణంగా తన షెడ్యూల్‌ను మార్చాడు. దాని కారణంగా ఆమె తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి చాలా సేపు ఆలస్యంగా కూర్చోవలసి వచ్చింది.అంతటి ఒత్తడితో తాను అక్కడ పనిచేయలేనని ఏడ్చేది. రాజీనామా చేసి వచ్చేయాలని మేం కోరాం. కానీ ఆమె ఈవైలో కొనసాగాలని నిర్ణయించుకుంది. దురదృష్టవశాత్తు జూలై 21న ఆమె తన గదిలో కుప్పకూలిపోయి ఆసుపత్రికి చేరుకునేలోపు మరణించింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీబీ జోసెఫ్.#WATCH | EY employee's death allegedly due to 'overwork' | Ernakulam, Kerala: Father of EY employee Anna Sebastian Perayil, Sibi Joseph says, "... She joined there on March 18... After one week, she started the regular auditing. There are 6 audit teams in EY Pune and she was… pic.twitter.com/aMTabuAei0— ANI (@ANI) September 21, 2024 -
‘వారానికి 40 గంటలే పని ఉండాలి!’
పని భారం.. తీవ్ర ఒత్తిడితో ఓ యువ ఉద్యోగిణి ప్రాణం కోల్పోవడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ భిన్నంగా స్పందించారు.పని ఒత్తిడితో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగి మరణించిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. పని ప్రదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగొద్దని సూచించిన ఆయన.. పనివేళలపై పార్లమెంట్లో చట్టం తెచ్చేందుకు కృషిచేస్తానన్నారు. ఈ క్రమంలో వారానికి 40 గంటల పని దినాల ప్రతిపాదన తెరపైకి తెచ్చారాయన.Had a deeply emotional and heartrending conversation with Shri Sibi Joseph, the father of young Anna Sebastian, who passed away after a cardiac arrest, following four months of deeply stressful seven-day weeks of 14 hours a day at Ernst&Young. He suggested, and I agreed, that I…— Shashi Tharoor (@ShashiTharoor) September 20, 2024 నాలుగు నెలలు.. ఏడు రోజులు.. రోజుకి 14 గంటల చొప్పున పని చేయడంతోనే ఆమె ఒత్తిడికి గురైంది. ఆమె మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నా. అందుకే వారానికి ఐదు రోజులే పని దినాలు ఉండాలి. ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగులు రోజుకు ఎనిమిది గంటలే పని చేయాలి. ఈ దిశగా చట్టం కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నా వంతు కృషి చేస్తా.. అని తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక సందేశం కూడా ఉంచారు. అంతేకాదు ఇదే అంశంపై అన్నా తండ్రి సిబి జోసెఫ్‌తోనూ తాను మాట్లాడినట్లు థరూర్ తెలిపారు.కేరళకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్(26) నాలుగు నెలలుగా పూణే ఈవై కార్యాయలంలో పని చేస్తూ.. జులై నెలలో కన్నుమూసింది. అయితే పని ఒత్తిడి వల్లే అన్నా మరణించిందని ఆమె తల్లి అనిత ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీకి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఇక.. ఈ వ్యవహారంపై కేంద్ర కార్మిక శాఖ విచారణ చేపట్టింది. మరోవైపు తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో రాజీవ్ మెమానీ స్పందించారు. ‘‘ఆమె కుటుంబంతో మాట్లాడాను. సెబాస్టియన్ మృతికి సంతాపం తెలిపాను. వారి జీవితంలో ఏర్పడిన వెలితిని ఎవరూ పూడ్చలేరు. ఆమె అంత్యక్రియల సమయంలో మేము అక్కడ లేకపోవడంపై తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నాను. ఇది మా పని సంస్కృతికి పూర్తిగా విరుద్ధం. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. భవిష్యత్తులో ఇలా జరగదు’’ అని సంస్థ మెమానీ పేర్కొన్నారు. తెరపైకి నారాయణమూర్తి కామెంట్స్పని ఒత్తిడితో ఈవై ఉద్యోగిణి మరణించడం చర్చనీయాశంగా మారిన వేళ.. పనిగంటలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నా.. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలన్నా.. భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాల్సిందేనని అన్నారాయన. ‘‘ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువ. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. చైనా వంటి దేశాలతో పోటీపడాలంటే మన యువత అదే తరహాలో పనిచేయాల్సిన అవసరం ఉంది. ‘ఇదీ నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతా’ అనే అనే ప్రతిజ్ఞ చేయాలి’’ అని నారాయణమూర్తి అన్నారు. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.వారానికి 100 గంటలైనా పని చేయాలంటూ ఎలోన్ మస్క్ లాంటి బిలియనీర్లు పిలుపు ఇస్తుంటారు. కానీ, ఓవర్ వర్క్ వల్ల గుండె, మెదడు ఇతర కీలకమైన అవయవాలపై ఒత్తిడి పడుతుంది. చివరకు.. మరణానికి కూడా దారి తీయొచ్చు. మొన్నీమధ్య చైనాలోనూ ఓ పెయింటర్ ఇలా గొడ్డు చాకిరీ చేసే ప్రాణం పొగొట్టుకున్నాడు. ఆరా తీస్తే.. వరుసగా 104 రోజులు పని చేసిన ఆ కిందిస్థాయి ఉద్యోగి.. ఒకే ఒక్కరోజు సెలవు తీసుకున్నాడని తేలింది. ఇదీ చదవండి: కోటి జీతం.. అయినా ఈవై ఉద్యోగం వద్దనుకున్నాడు!! -
జాబ్ అంటే చావేనా? ఊపిరి తీస్తున్న ఉద్యోగాలు!
కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి రానురాను విషపూరితంగా మారుతోంది. తీవ్రమైన పని ఒత్తిడితో ఉద్యోగులు సతమతవుతున్నారు. రోజూ నిద్రాహారాలు లేకుండా 15 గంటలకు పైగా సుదీర్ఘంగా పని చేయాల్సి ఉండటంతో శారీరక, మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఒత్తిడి తాళలేక కొంత మంది తనువులు చాలిస్తున్నారు."పని ఒత్తిడి" కారణంగా ఎర్నెస్ట్ & యంగ్ (EY) కన్సల్టెంట్ 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డెలాయిట్ మాజీ ఉద్యోగి దేశంలోని కార్పొరేట్ రంగంలో విషపూరితమైన పని సంస్కృతికి సంబంధించిన తన సొంత అనుభవాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చారు. ఇండోర్‌కు చెందిన జయేష్ జైన్ తన స్వానుభవాన్ని ‘ఎక్స్’(ట్విటర్)లో వివరించారు."అన్నా ఎంత ఒత్తిడి అనుభవించిందో పూర్తిగా అర్థం చేసుకోగలను" అంటూ తాను డెలాయిట్‌లో అనుభవించిన తీవ్రమైన ఒత్తిడిని వివరించారు. వేకువజామున 5 గంటల సమయంలో వర్క్ గురించి, తద్వారా తలెత్తిన ఆరోగ్య సమస్యల గురించి సహచరులతో చర్చించిన చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.రోజులో దాదాపు 20 గంటలు పని చేసేవాళ్లమని, అయితే అన్నేసి గంటలు పనిచేసినా కూడా 15 గంటలకు మించి పని చేసినట్టుగా లాగిన్‌లో చూపేందుకు వీలుండేది కాదని రాసుకొచ్చారు. "ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు వారికి (కంపెనీలకు) ఒక ఉద్యోగి మాత్రమే. కానీ మీ కుటుంబానికి మీరే సర్వస్వం" అంటూ ఒత్తిడి గురయ్యే ఉద్యోగులను ఉద్దేశించి హితవు పలికారు. "కార్పొరేట్ జీవితమంటేనే కఠినం. తొందరగానే అక్కడి నుండి బయటపడగలిగినందుకు సంతోషిస్తున్నాను" పోస్ట్‌ను ముగించారు.With EY case getting some lights. I would like to share my personal experience at Deloitte. Attaching some screenshots of chats with my team mate - friend where we were discussing the work and our health at 5AM in the morning. We use to work for around 20 hours and they won’t… pic.twitter.com/EjtqWjhwSm— Jayesh Jain (@arey_jainsaab) September 18, 2024 -
తెలుసుకుంటే.. బాధితులకు భరోసా.!
మరణం సహజం.. అది ఎలా సంభవిస్తుందో ఎవరికి తెలియదు. మరణానంతరం ఏమవుతుందో గానీ ఒక్కో సారి తమపై ఆధారపడి బతికే కుటుంబ సభ్యులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులైతే ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. విధి నిర్వహణలో మృతి చెందవచ్చు. సహజ మరణం కావచ్చు. సంఘ విద్రోహ శక్తుల చేతిలో హత్యకు గురికావచ్చు. అవకాశం ఉన్నంత వరకు మరణించిన ఉద్యోగికి సంబంధించిన సెటిల్మెంట్స్ ద్వారా కుటుంబ సభ్యులు లబ్ధి పొందేలా ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించాయి. ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? వచ్చే రాయితీలేంటి? అవి ఏరకంగా ఉంటాయి..? వాటి గురించి సవిరంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి..? అనే అంశాలపై ప్రత్యేక కథనం. –పెదవాల్తేరు(విశాఖతూర్పు) ఓ ఉద్యోగి సర్వీసులో ఉన్నంత కాలం బతికుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. పదవీ విరమణ చెందిన తర్వాత సర్వీస్ విషయాలను తేలిగ్గానే పరిష్కరించుకోవచ్చు. అనుకోకుండా మరణిస్తే మాత్రం కుటుంబానికి సెటిల్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఉద్యోగులకు ఇలాంటి వాటిపై ముందస్తు అవగాహన ఉంటుంది. కానీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఆ స్థాయిలో అవగాహన ఉండకపోవచ్చు. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులకు ఆ విషయాలు చెప్పకపోవచ్చు కూడా. ఇలాంటి సందర్భంలో సరీ్వసు సెటిల్మెంట్స్కు సంబంధించిన విషయాల్లో ఉద్యోగుల కుటుంబ సభ్యులకు గందరగోళం ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్వహించే ప్రక్రియ గురించి కూడా తెలియక సతమతమవుతుంటారు. ఉద్యోగి కుటుంబ సభ్యులు ఇలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు. ఎలాంటి గందరగోళానికి గురి కావాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగి మృతి చెందితే ప్రభుత్వం మానవత్వంతో స్పందిస్తుంది. అవకాశమున్నంత వరకు మరణించిన ఉద్యోగికి సంబంధించిన సెటిల్మెంట్స్ ద్వారా కుటుంబ సభ్యులు లబ్ధి పొందేలా మార్గదర్శకాలు రూపొందించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా ఎప్పటికప్పుడు మారుతున్న కాలం పరిస్థితుల ప్రాతిపదికన సర్వీసు విషయాలను సెటిల్మెంట్ చేసే విషయంలో సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తోంది. దురదృష్టవశాత్తూ ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి కుటుంబానికి చెల్లింపులు, రాయితీలను ప్రభుత్వం అందజేస్తుంది. వీటికి సంబంధించి గత ప్రభుత్వాలు అనేక జీవోలను జారీ చేశాయి. అసలు అవేంటో ..? వాటి ప్రయోజనాలు ఎలా ఉంటాయో..? తెలుసుకుందాం. సస్పెన్షన్‌లో ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉన్న కాలంలో మరణిస్తే సస్పెన్షన్ విధించిన తేదీ నుంచి మృతిచెందిన కాలం వరకు మానవతా దృక్పథంతో విధుల్లో ఉన్నట్లుగానే పరిగణిస్తారు. పూర్తిస్థాయి చెల్లింపులు ఉంటాయి. సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో మరణిస్తే... విధుల్లో ఉండగా అనుకోని సంఘటన వల్ల మరణించినా, తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతిలో మృతి చెందినా తక్షణమే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లిస్తారు. ప్రమాద ఎక్స్‌గ్రేషియా.. విధి నిర్వహణలో ఉంటూ ఉద్యోగులు ప్రమాదానికి గురై మృతి చెందితే ప్రభుత్వం రూ. లక్ష ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుంది. దీనికి సంబంధించి 2006 జూలై 7న జీవో నం. 317ను జారీ చేశారు. అంత్యక్రియలకు సాయం ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల అవసరాలకు ప్రభుత్వం రూ.15 వేలు సాయంగా చెల్లిస్తుంది. దీనికి సంబంధించి 2010 ఏప్రిల్æ 24న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 192 ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అంత్యక్రియ ఖర్చులకు.. ఒక ఉద్యోగి సంస్థ నుంచి అప్పులు కానీ, అడ్వాన్సులు కానీ తీసుకుని మృతి చెంది ఉంటే ఆ మొత్తాన్ని రద్దు చేస్తారు. ఉద్యోగి మరణించిన సమయానికి జీపీఎఫ్‌తో సమానమైన రూ.10 వేలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. రుణాల చెల్లింపులు, అడ్వాన్సులు రద్దు అవుతాయి. సరీ్వసులో ఉన్నప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ కింద మినహాయించిన మొత్తాన్ని ఆ ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. 1974 నవంబర్ 9న జారీ చేసిన జీవో నంబర్ 55 ద్వారా పూర్తి వివరాలు పొందవచ్చు. రవాణా చార్జీల కింద... ఉద్యోగి విధి నిర్వహణలో కానీ, మరేదైనా ప్రదేశంలో కానీ మృతి చెందితే ఆ ఉద్యోగి మృతదేహాన్ని ఇంటికి తరలించడానికి అయ్యే రవాణా చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. సంఘటన స్థలం నుంచి వారి ఇంటికి తరలింంచేందుకు వీలుగా రూ.50–300 వరకు రవాణా ఛార్జీలను ఇస్తుంది. ఈ అంశంంలో మరిన్ని వివరాలు 1985 సెపె్టంబర్ 15న జారీ చేసిన జీవో 1669 ద్వారా తెలుసుకోవచ్చు. కారుణ్య నియామకం, కరువుభత్యం ఉద్యోగం చేసే సమయంలో మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉపాధి కలి్పస్తారు. అర్హత ప్రాతిపదికన వివిధ స్థాయిలో ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉంది. మరణించిన ఉద్యోగికి సంబంధించిన డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను కుటుంబ పెన్షన్ కింద చెల్లించరు. కానీ కారుణ్య నియామకం పొందిన వారికి ఈ మొత్తాన్ని రెగ్యులర్‌గా చెల్లిస్తారు. ఈ వివరాలకు 1998 మే 25న జారీ చేసిన జీవో 89 ద్వారా తెలుసుకోవచ్చు. అవగాహన తప్పనిసరి ప్రభుత్వ జారీ చేసిన జీవోలపై ఉద్యోగుల కుటుంబీలకు అవగాహన అవసరం. ప్రభు త్వం అందజేసే సౌలభ్యాలను వినియోగింంచుకోవాలంటే వాటి గురించి తెలిసి ఉండాలి. ఉద్యోగుల కోసం ప్రభుత్వం పలు రకాల జీవోలను విడుదల చేసింది. వీటి గురించి తెలిస్తే త్వరితగతిన ప్రభుత్వం నుంచి సాయాన్ని పొందవచ్చు. – టి.శివరామప్రసాద్, ఉపసంచాలకుడు, జిల్లా ఖజానాశాఖ, విశాఖపట్నం -
నవతా ట్రాన్స్‌పోర్టులో ఉద్యోగి మృతి
సాక్షి, విజయవాడ: విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ ఉద్యోగి మృతి చెందిన ఘటన ఆటోనగర్‌లో చోటు చేసుకుంది. నవతా ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో మనోజ్‌కుమార్ అనే వ్యక్తి అసిస్టెంట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం కార్యాలయంలో ప్రమాదవశాత్తూ మృతిచెందారు. మృతి చెందిన రెండు గంటల వరుకు నవతా యాజమాన్యం స్పందించలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గవర్నమెంట్ ఆసుప్రతికి తరలించారని తెలిపారు. యాజమాన్యం, పోలీసుల తీరును నిరసిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. -
ఐఎన్ఎస్ కళింగలో మిస్‌ఫైర్: ఉద్యోగి మృతి
-
ఐఎన్ఎస్ కళింగలో మిస్‌ఫైర్: ఉద్యోగి మృతి
విశాఖ తీరంలో ఉన్న ఐఎన్ఎస్ కళింగలో తుపాకి మిస్‌ఫైర్ అయ్యింది. దాంతో భారత నౌకాదళ ఉద్యోగి వీరేందర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా వీరేందర్ (25) మరణించాడు. ఈ సంఘటన రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. విశాఖలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా వీరేందర్ మరణించినట్లు సమాచారం. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నాడా.. లేదా మరేదైనా జరిగిందా అనే విషయం మాత్రం తెలియడం లేదు. గతంలో కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు నౌకాదళంలో ఉన్నాయి. ఐఎన్ఎస్ కళింగ పూర్తిగా నౌకాదళ ఆధీనంలో ఉండటంతో లోపల ఏం జరుగుతోందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. వీరేందర్ మరణించిన విషయాన్ని మాత్రం అధికారికంగానే ప్రకటించారు.