
సాక్షి, విజయవాడ: విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ ఉద్యోగి మృతి చెందిన ఘటన ఆటోనగర్‌లో చోటు చేసుకుంది. నవతా ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో మనోజ్‌కుమార్ అనే వ్యక్తి అసిస్టెంట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం కార్యాలయంలో ప్రమాదవశాత్తూ మృతిచెందారు. మృతి చెందిన రెండు గంటల వరుకు నవతా యాజమాన్యం స్పందించలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గవర్నమెంట్ ఆసుప్రతికి తరలించారని తెలిపారు. యాజమాన్యం, పోలీసుల తీరును నిరసిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.