ఐఎన్ఎస్ కళింగలో మిస్ఫైర్: ఉద్యోగి మృతి | misfire in ins kalinga navy employee dead | Sakshi
Sakshi News home page

Jul 21 2014 9:41 AM | Updated on Mar 21 2024 8:10 PM

విశాఖ తీరంలో ఉన్న ఐఎన్ఎస్ కళింగలో తుపాకి మిస్ఫైర్ అయ్యింది. దాంతో భారత నౌకాదళ ఉద్యోగి వీరేందర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా వీరేందర్ (25) మరణించాడు. ఈ సంఘటన రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. విశాఖలోని సెవెన్హిల్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా వీరేందర్ మరణించినట్లు సమాచారం. ఐఎన్ఎస్ కళింగ పూర్తిగా నౌకాదళ ఆధీనంలో ఉండటంతో లోపల ఏం జరుగుతోందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. వీరేందర్ మరణించిన విషయాన్ని మాత్రం అధికారికంగానే ప్రకటించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement