పాట్నా: బిహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో బ్రిడ్జి కూలింది. శుక్రవారం మధుబని జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.
దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో 75 మీటర్ల పొడవైన ఈ వంతెనను భేజా పోలీస్ స్టేషన్‌లోని మాధేపూర్ బ్లాక్‌లో బీహార్ గ్రామీణ పనుల విభాగం 2021 నుంచి నిర్మిస్తోంది. ఇది మధుబని – సుపాల్ జిల్లాల మధ్య భూతాహి నదిపై ఉంది.
అయితే, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భూతాహి నదిలో నీటి మట్టం పెరిగింది. నీటి ఉద్ధృతికి నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. 25 మీటర్ల పొడవు గల సపోర్టింగ్ పిల్లర్ దిగువన ఉన్న నదిలో కూలిపోయింది.
𝟗 दिन के अंदर बिहार में यह 𝟓वाँ पुल गिरा है।
मधुबनी-सुपौल के बीच भूतही नदी पर वर्षों से निर्माणाधीन पुल गिरा। क्या आपको पता लगा? नहीं तो, क्यों? बूझो तो जाने? #Bihar #Bridge pic.twitter.com/IirnmOzRSo— Tejashwi Yadav (@yadavtejashwi) June 28, 2024
రాష్ట్రంలో బ్రిడ్జి ప్రమాదాల ఘటనపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. కాగా, రాష్ట్రంలో గత తొమ్మిది రోజుల వ్యవధిలోనే ఇది ఐదో ఘటన కావడం గమనార్హం.ఇప్పటికే వరుసగా నాలుగు బ్రిడ్జిలు కూలిపోయిన విషయం తెలిసిందే.
గురువారం కిషన్‌గంజ్ జిల్లాలో, జూన్ 23న తూర్పు చంపారన్ జిల్లాలో, 22న సివాన్‌లో, 19న అరారియాలో ఇలాగే వంతెనలు కూలిపోయాయి. దీంతో నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment