పాట్నా: రైలులో పయనమైన మిజోరాం వాసులు మార్గమధ్యలో అస్సాం వరద బాధితులకు ఆహార పొట్లాటను అందిస్తూ గొప్ప మనసు చాటుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో అందరి మన్ననలు అందుకుంది. తాజాగా శ్రామిక్ ప్రత్యేక రైలులో స్వస్థలాకు పయనమైన మిజోరాం వలస కార్మికులకు బీహార్ వాసులు సాయం చేశారు. ఆగి ఉన్న రైలును చూసి పరుగెత్తుకుంటూ వచ్చి వారికి ఆహార పొట్లాలను అందించారు. ఈ ఘటన బీహార్‌లోని బిగుసరై వద్ద చోటు చేసుకుంది. మనసును హత్తుకుంటోన్న ఈ వీడియోను మిజోరాం ముఖ్యమంత్రి జోరాంథంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. (మానవత్వాన్ని చాటుకున్న మిజోలు)
"ఇలా ప్రేమలతో మునిగినప్పుడు భారత్ మరింత అందంగా కనిపిస్తుంది" అని సీఎం పేర్కొన్నారు. ముప్పై సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఇది భారతీయుల ఐక్యతను చాటి చెప్తోంది", "ఆనందభాష్పాలు వస్తున్నాయి. ఇదీ నా భారత్ అంటే.. ఇంత మంచి వీడియోను పంచుకున్నందుకు ధన్యవాదాలు", "ఇలాంటి క్షణాలే మన దేశ ఐక్యతను, సోదరభావాన్ని ప్రతిబింబిస్తాయి" అంటూ పలువురు భావోద్వేగానికి లోనవుతున్నారు. (మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ ఈ వ్యక్తి!)
Comments
Please login to add a commentAdd a comment