చలికాలంలో గీజర్లు వాడుతున్నారా ? జాగ్రత్తలు పాటించండి! లేదంటే ముప్పే! | Are you using geysers in winter Be careful | Sakshi
Sakshi News home page

చలికాలంలో గీజర్లు వాడుతున్నారా ? జాగ్రత్తలు పాటించండి! లేదంటే ముప్పే!

Published Wed, Dec 18 2024 6:53 PM | Last Updated on Wed, Dec 18 2024 7:14 PM

Are you using geysers in winter Be careful

ప్రస్తుతం చలి పులి పంజా విసురుతోంది. బారెడు పొద్దెక్కినా మంచంమీద నుంచి లేవాలంటే వణుకు పుడుతోంది. మరి ఈ చలినుంచి తప్పించుకోవాలంటే రూం హీటర్లు, గీజర్లు వాడడం అనివార్యమనే చెప్పాలి. అయితే ఇటీవల గీజర్లకు సంబంధించి కొన్ని విషాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో గీజర్ల వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అవేంటో చూద్దాం. 

గీజర్ల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉత్తమ బ్రాండ్‌లను మాత్రమే ఎంచుకోవాలి. అంతేకాదు తొందరంగా నీళ్లు వేడెక్కాలంటే నాణ్యమైన గీజర్లను వాడాలి.  

గీజర్‌ను ఆన్ చేసి, స్నానం చేయడం కాకుండా,  నీళ్లను బకెట్లో నింపుకొని, గీజర్‌ ఆఫ్‌ చేసిన  స్నానానికి వెళ్లాలి. దీని  కరెంట్‌ ఆదా అవుతుంది. ప్రమాదాలను చాలావరకు నివారించే అవకాశం ఉంది.

గీజర్ ఎక్కువ సమయం ఆన్‌లో ఉండటం అంత మంచిదికాదు.అలాగే ఆటో కట్‌ఆఫ్‌ ఉన్న గీజర్లను ఎంచుకోవాలి.  పొరపాటున గీజర్‌ ఆన్‌ చేసి మర్చిపోతే, పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.  

గీజర్లను తడి తగలకుండా ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. గీజర్‌కు గోడకు మధ్య ఖాళీ ఉండాలి.

గీజర్‌లో ప్రెషర్‌ ఎక్కువ అయితే ఆ ఒత్తిడిని విడుదల చేయడానికి గీజర్‌లో వాల్వ్ ఉంచారో లేదో  చెక్‌ చేసుకోవాలి.  వాల్వ్‌లో ఏదైనా లోపం ఉందేమో ఎప్పటికప్పుడు తనిఖీ  చేయాలి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement