Geyser use
-
వీడిన మిస్టరీ.. ప్రాణాలు మింగేసిన గీజర్
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ జెక్ కాలనీలో బాత్రూంలో ముగ్గురు కుటుంబసభ్యులు మృత్యువాత పడిన ఘటనలో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారు గ్యాస్ ఆధారిత గీజర్ వాడుతుండేవారని, అదే వారి పాలిట మరణశాసనమైందని తెలుస్తోంది. దీని నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువు కారణంగానే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని డాక్టర్లు నిర్ధారణకు వచ్చా రు. ఈ వాయువును పీలి్చన ఐదు నిమిషాలకే స్పృహ తప్పిపడిపోవడమే కాకుండా ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెబుతున్నారు. గీజర్ నుంచి ఇలాంటి విషపూరితమైన వాయువులు ఎలా వెలువడుతాయో తెలుసుకుని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వెంటిలేషన్ లేకపోవడం వల్లే.. సాధారణంగా స్నానాల గదుల్లో గాలి, వెలుతురు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక గ్యాస్ ఆధారంగా పనిచేసే గీజర్లను వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు కిచెన్లలో కూడా గీజర్లను బిగిస్తుంటారు. బాత్రూమ్లో కానీ, కిచెన్‌లో కానీ వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. వెంటిలేటర్లు బిగించినప్పుడు ఎప్పుడూ తెరిచి ఉండేలా చూసుకోవాలి. గీజర్ ఆన్ చేసుకున్నప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంచుకోవాలి. గీజర్‌ను ఎప్పటికప్పుడూ చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా లీక్ ఉంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే రిపేర్ చేయించాలి. రోజంతా గీజర్ ఆన్ ఉండొద్దు.. గీజర్‌ను ఎట్టిపరిస్థితుల్లో కూడా రోజంతా ఆన్ చేసి ఉంచకూడదు. ఆన్‌చేసి మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అవసరం ఉండి నిత్యం వాడాల్సి వస్తే మాత్రం మధ్యలో కాసే పు ఆఫ్ చేసి.. కొద్దిసేపటి తర్వాత ఆన్ చేసుకోవాలి. బాత్రూమ్లోకి వెళ్లే ముందు గీజర్‌ను ఆఫ్ చేసుకుంటే మంచిది. అప్పుడు ప్రమాదాలు జరిగే చాన్స్ తక్కువగా ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ విడుదలయ్యే ప్రమాదం గ్యాస్ గీజర్ లోపల కాలినట్లయితే..అందులో నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలయ్యే ప్రమాదం ఉంది. ఈ గ్యాస్ రంగు, వాసన ఉండదు. దీంతో అది విడుదలైనట్టు కూడా గుర్తుపట్టడం కష్టం. అది పీల్చుకున్న వారి మెదడుపై నేరుగా చాలా తక్కువ సమయంలోనే ప్రభావం చూపుతుంది. దీంతో ఐదు నిమిషాల్లోనే స్పృహ తప్పిపోతుంటారు. ఎక్కువగా కనుక పీల్చుకుంటే ప్రాణాలకే ప్రమాదం. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడొచ్చు. -
కాబోయే జంటపై గ్యాస్ గీజర్ పంజా.. బాత్రూమ్లో స్నానం చేస్తూ..
కర్ణాటక: కొద్దిరోజుల్లో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువతీ యువకుని పాలిట బాత్రూంలోని గ్యాస్ గీజర్ మృత్యువులా విరుచుకు పడింది. గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటన బెంగళూరులోని చిక్కజాల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. ఉద్యోగం, సహజీవనం చేస్తూ.. వివరాలు.. చామరాజనగర జిల్లా గుండ్లుపేటే కు చెందిన చంద్రశేఖర్ (30), బెళగావి జిల్లా గోకాక్ నివాసి సుధా రాణి (22) మృతులు. వీరిద్దరూ నగరంలోని గోల్ఫ్ హోటల్లో పనిచేసేవారు. చిక్కజాల పరిధిలోని తరబనహళ్లిలో అద్దె ఇంట్లో ఉంటూ సహ జీవనం చేస్తున్నారు. త్వరలో వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించారు. ఈ నెల 10 తేదీ శనివారం ఉదయం ఇద్దరూ విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. రాత్రి గ్యాస్ గీజర్ ఆన్‌చేసి ఇద్దరూ బాత్రూమ్లో స్నానం చేయడానికి వెళ్లి బాత్రూమ్ కిటికీ మూశారు. స్నానం చేస్తున్న సమయంలో గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీక్ కావడంతో ఇద్దరూ స్పహతప్పి పడిపోయారు. కొంతసేపటికి మృతి చెందారు. డ్యూటీకి రాకపోవడంతో ఆదివారం ఇద్దరూ డ్యూటీకి రాకపోవడంతో స్నేహితులు వీరి మొబైల్‌కు ఫోన్ చేయగా స్పందన లేదు. అనుమానం వచ్చి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. అనుమానం వచ్చి చిక్కజాలపోలీసులకు సమాచారమిచ్చారు. వారు చేరుకుని ఇంటి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ బాత్రూంలో శవాలై ఉన్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం అంబేడ్కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి తరువాత వారి కుటుంబాలకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
బాత్రూమ్లో గీజర్ నుంచి గ్యాస్ లీకై నవ వధువు మృతి
ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లోని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బాత్రూమ్లో గీజర్ నుంచి లీక్ అయిన గ్యాస్ పీల్చుకొని ఊపిరాడక నవ వధువు మృత్యువాతపడింది. వివరాలు.. ఇటీవల వివాహం అయిన వధువు స్నానం చేసేందుకు అత్తవారింట్లోని బాత్రూమ్లోకి వెళ్లింది. చాలా సేపు అక్కడే ఉంది. ఎంతకూ యువతి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాత్రూమ్ డోర్ తట్టి చూడగా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాత్రూమ్ తలుపులు పగలగొట్టగా.. ఓ మూలన అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది. వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. గ్యాస్ గీజర్‌లో నుంచి వెలువడిన కార్బర్ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్లే వధువు మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ గ్యాస్ చాలా ప్రమాదకరమని.. పీల్చిన కొద్ది నిమిషాల్లోనే ఊపిరాకడ అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. గ్యాస్ గీజర్‌ను ఉపయోగించిన ప్రతిసారి దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. ఇది ప్రాణాంతకమైనది. వీటిని బాత్రూమ్లో ఏర్పాటు చేసుకోకుండా ఉంటేనే మంచింది. వెంటిలేషన్ బాగా ఉండే ప్రదేశాల్లోనే ఫిట్ చేయాల్సి ఉంటుంది. అయితే గ్యాస్ గీజర్ల నిర్వహణ ఖర్చు ఎలక్ట్రిక్ గీజర్లతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే దేశంలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంట్లో గ్యాస్ గీజర్లను ఉపయోగించడం ప్రమాదకరమనే విషయం తెలిసిందే. ఇవి విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్ పీల్చిన కొద్ది నిమిషాల్లోనే కళ్లు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. అయిదు నిమిషాలు కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పీల్చడం వల్ల తల తిరగడం.. అంతకంటే ఎక్కువ సమయం పీలిస్తే స్పృహ కోల్పోయి ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉంది. శాశ్వతంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కొన్ని నెలల పాటు యాంటీ సీజర్ మందులతో చికిత్స చేయవచ్చు. గ్యాస్ సీజర్‌ను ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?. 1. బాత్రూమ్, వంటగది వంటి మూసివేసిన ప్రదేశాలలో గ్యాస్ గీజర్‌ను ఎప్పుడూ ఇన్స్టాల్ చేయవద్దు. 2. ఒకవేళ బాత్రూమ్, కిచెన్ వంటి ప్రదేశాల్లో వీటిని అమర్చినట్లయితే తగినంత వెంటిలేషన్ ఉండాలి. అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్ చేసి ఉంచాలి. 3. గ్యాస్ గీజర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. ఏదైనా లీకేజీ లేదా మరేదైనా సమస్య ఉంటే బయటపడే అవకాశాలు ఉంటాయి. 4. గ్యాస్ గీజర్‌ను రోజంతా వినియోగించడం మంచిది కాదు. నిరంతరాయంగా టిని వినియోగిస్తే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కువసార్లు ఉపయోగించాల్సి వస్తే వినియోగించే ముందు తగినంత గ్యాస్ ఉండాలి. 5. బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లే ముందే గ్యాస్ గీజర్‌ను స్విచ్ ఆఫ్ చేయడం మంచింది.. దీంతో స్నానం చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండదు. 6. కార్భన్ మోనాక్సైడ్ రంగు, రుచి లేని కారణంగా గీజర్‌లో గ్యాస్ లీకవడాన్ని గుర్తించడం అంత సులభం కాదు. వీటిని పీలుస్తున్న విషయం కూడా మనకు తెలియదు. 7. గ్యాస్ గీజర్‌లో లీకేజీ ఉంటే, దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు బయటకు వస్తుంది. ఇది మైకం, వికారం, వాంతులు, అలసట, కడుపు నొప్పికి కారణం కావచ్చు. 8. కార్బన్ మోనాక్సైడ్ చాలా ప్రమాదకరమైనది. ఇది మైకం, వికారం, వాంతులు, అలసట, కడుపు నొప్పికి కారణం కావచ్చు. ఇది పీల్చిన తర్వాత నిమిషాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. 9. గ్యాస్ గీజర్ కారణంగా ఎవరైనా సమస్యలను ఎదుర్కొంటే, బాధితుడిని వీలైనంత త్వరగా బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లాలి. దీని వల్ల అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు. తరువాత ఆసుపత్రికి తరలించాలి. -
గీజర్ నుంచి విషవాయువు.. బాలిక మృతి
ముంబై : గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడి బాలిక మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బొరివలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 5న ఉదయం స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లిన ధృవి గోహిల్ (15) ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి చూశారు. అప్పటికే ధృవి అపస్మారక స్థితిలో పడి ఉంది. వేడినీటి కారణంగా ఆమె శరీరం కుడిపక్కన కాలిన గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. మృత్యువుతో పోరాడిన బాలిక ఈ నెల 10న మృతిచెందింది. కార్బన్ మోనాక్సైడ్‌ను అధికంగా పీల్చడం వల్లే ఈ ఘోరం జరగినట్లు వైద్యులు తెలిపారు. -
హాట్ హాట్‌గా.. హాయి హాయిగా
* పెరుగుతూ వస్తున్న గీజర్ల వినియోగం * మార్కెట్లోకి కొత్త మోడళ్లు * సామాన్యులకూ అందుబాటు దరల్లో నీళ్లు జిల్లు.. జిల్లుమంటుంటే ఒళ్లు చలి చలి అంటుందని ఓ సినీ కవి చెప్పారు. చన్నీళ్లు శరీరంపై పడగానే ఇలాంటి అనుభూతి కలగటం అందరికీ అనుభవమే. శీతగాలులు తిరిగాక చన్నీటి స్నానం కాస్త కష్టంగా అనిపిస్తుంది. సాయంత్రం వేళ అయితే ఈ రోజు కాళ్లు, చేతులు కడుక్కుంటే చాలు అనే ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి బద్దకం వదలాలంటే హాట్ హాట్‌గా స్నానం సాగాలి. వేడి నీళ్ల కోసం కట్టెల పొరుు్యలు, కాగు బిందెలు, రాగి బాయిలర్ల వాడకానికి కాలం చెల్లింది. జిల్ల్వుమనే చల్లని నీరు కెవ్వుమనేంతగా వేడెక్కించేందుకు ఇప్పుడు హీటర్లు, గీజర్లు వాడుతున్నారు. ముఖ్యంగా గీజర్ల వినియోగం కొన్ని సంవత్సరాలుగా బాగా పెరిగింది. 2014లో దేశవ్యాప్తంగా రూ.1500 కోట్ల విలువైన గీజర్లు అమ్ముడయ్యూయని గణాంకాలు చెబుతున్నారుు. గీజర్ల విక్రయూల్లో వృద్ధి 2021 వరకూ కొనసాగుతుందని ఆ కంపెనీల అంచనా. ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ధరలు ఇలా.. వి గార్డ్ కంపెనీ పెబ్బెల్ మోడల్ గీజర్ ఆరు లీటర్ల సామర్థ్యం అయితే రూ.8,300, పది లీటర్లు అరుుతే రూ.8,600, 15 లీటర్లు రూ.10,100, 25 లీటర్లు రూ.11,750 గరిష్ట అమ్మకం ధర ఉంది. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే దీనిపై 16 శాతం వరకు రాయితీని ఈ కంపెనీ ఇస్తోంది. రాకాల్డ్ , క్రాంప్టన్ గ్రీవ్స్ కంపెనీల గీజర్లు 25 లీటర్ల సామర్థ్యం కలిగినవి రూ.8,500కు విక్రయిస్తున్నారు. విజయ గీజర్ మూడు లీటర్లు అరుుతే రూ.2,800, ఆరు లీటర్లు అరుుతే రూ.6,500 నుంచి రూ.6,800 ధర ఉంది. వీటితోపాటు వీనస్, ఏవో స్మిత్, కెన్‌స్టార్, హవెల్స్, ఉషా,తదితర కంపెనీలు ఎలక్ట్రికల్. సోలార్ పవర్ టెక్నాలజీ గీజర్లనూ విక్రయిస్తున్నాయి. - ‘సాక్షి’ నెట్వర్క్