* పెరుగుతూ వస్తున్న గీజర్ల వినియోగం
* మార్కెట్లోకి కొత్త మోడళ్లు
* సామాన్యులకూ అందుబాటు దరల్లో
నీళ్లు జిల్లు.. జిల్లుమంటుంటే ఒళ్లు చలి చలి అంటుందని ఓ సినీ కవి చెప్పారు. చన్నీళ్లు శరీరంపై పడగానే ఇలాంటి అనుభూతి కలగటం అందరికీ అనుభవమే. శీతగాలులు తిరిగాక చన్నీటి స్నానం కాస్త కష్టంగా అనిపిస్తుంది. సాయంత్రం వేళ అయితే ఈ రోజు కాళ్లు, చేతులు కడుక్కుంటే చాలు అనే ఫీలింగ్ వస్తుంది.
ఇలాంటి బద్దకం వదలాలంటే హాట్ హాట్‌గా స్నానం సాగాలి. వేడి నీళ్ల కోసం కట్టెల పొరుు్యలు, కాగు బిందెలు, రాగి బాయిలర్ల వాడకానికి కాలం చెల్లింది. జిల్ల్వుమనే చల్లని నీరు కెవ్వుమనేంతగా వేడెక్కించేందుకు ఇప్పుడు హీటర్లు, గీజర్లు వాడుతున్నారు. ముఖ్యంగా గీజర్ల వినియోగం కొన్ని సంవత్సరాలుగా బాగా పెరిగింది. 2014లో దేశవ్యాప్తంగా రూ.1500 కోట్ల విలువైన గీజర్లు అమ్ముడయ్యూయని గణాంకాలు చెబుతున్నారుు. గీజర్ల విక్రయూల్లో వృద్ధి 2021 వరకూ కొనసాగుతుందని ఆ కంపెనీల అంచనా. ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ మార్కెట్‌లోకి వస్తున్నాయి.
ధరలు ఇలా..
వి గార్డ్ కంపెనీ పెబ్బెల్ మోడల్ గీజర్ ఆరు లీటర్ల సామర్థ్యం అయితే రూ.8,300, పది లీటర్లు అరుుతే రూ.8,600, 15 లీటర్లు రూ.10,100, 25 లీటర్లు రూ.11,750 గరిష్ట అమ్మకం ధర ఉంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే దీనిపై 16 శాతం వరకు రాయితీని ఈ కంపెనీ ఇస్తోంది.
రాకాల్డ్ , క్రాంప్టన్ గ్రీవ్స్ కంపెనీల గీజర్లు 25 లీటర్ల సామర్థ్యం కలిగినవి రూ.8,500కు విక్రయిస్తున్నారు. విజయ గీజర్ మూడు లీటర్లు అరుుతే రూ.2,800, ఆరు లీటర్లు అరుుతే రూ.6,500 నుంచి రూ.6,800 ధర ఉంది. వీటితోపాటు వీనస్, ఏవో స్మిత్, కెన్‌స్టార్, హవెల్స్, ఉషా,తదితర కంపెనీలు ఎలక్ట్రికల్. సోలార్ పవర్ టెక్నాలజీ గీజర్లనూ విక్రయిస్తున్నాయి.
- ‘సాక్షి’ నెట్‌వర్క్
హాట్ హాట్‌గా.. హాయి హాయిగా
Published Sat, Nov 28 2015 3:32 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM
Advertisement
Advertisement