చిన్నారికి మద్యం తాగించిన తండ్రి, ఆస్పత్రిలో మృతి | Girl Child fed with liquor, killed by father in Guntur | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 15 2013 10:21 AM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

ఏడాదిన్నర పాపకు మద్యం తాగించిన తండ్రి ... చివరికి ఆమె ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. ఈ విషాద సంఘటన గుంటూరు నల్లచెరువులో చోటుచేసుకుంది. ఎవరి కన్నబిడ్డో తెలియదుగానీ .. సైదా అనే వ్యక్తి తన వద్ద ఉన్న చిన్నారిని .. సంతానం లేని ఇస్మాయిల్ దంపతులకు పెంచుకోవడానికి ఇచ్చాడు. అయితే, పండగ పూట తప్పతాగిన ఆ జంట ... బిడ్డకు కూడా కొంత మద్యం తాగించింది. దీంతో పాప అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా ... వారు సంబంధిత వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement