కుక్కల దాడి: రెండేళ్ల చిన్నారి మృతి
Published Thu, Jan 28 2016 2:20 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుక్కల దాడిలో రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన పుల్లయ్య కుమార్తె అనన్య(2) గురువారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం సమయానికి ఆమె గ్రామ సమీపంలోని పొలాల్లో విగతజీవిగా ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె శరీరంపై గాట్లు ఉండటంతో గ్రామంలో తిరుగుతున్న కుక్కలే ఆమెను ఈడ్చుకెళ్లి చంపి ఉంటాయని భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement