సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
సిరిసిల్ల జిల్లాలో విషాదం
Published Mon, Jan 30 2017 2:30 PM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM
రుద్రంగి: సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారితో కలిసి బావి వద్దకు వెళ్లిన ఓ తల్లి విద్యుదాఘాతానికి గురవడంతో ఆమె చేతిలో ఉన్న చిన్నారి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. ఈ సంఘటన జిల్లాలోని రుద్రంగి మండలకేంద్రంలో సోమవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఎర్రం సృజన తన రెండేళ్ల చిన్నారి నేతిశ్రీతో కలిసి ఈ రోజు ఉదయం బావి వద్దకు వెళ్లింది. బావి వద్ద విద్యుత్ మోటర్ ఆన్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలింది. దీంతో చేతిలో ఉన్న నేతిశ్రీ ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement