మహబూబాబాద్ రూరల్: పాము కాటుతో చిన్నారి మృతిచెందగా.. అదే పాము ఆమె తండ్రిని కాటు వేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా శనిగపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వేర్పుల క్రాంతి–మమత దంపతులకు మూడు నెలలు పసిపాప సంతానం. చిన్నారి కొద్ది రోజులుగా అనారో గ్యంతో ఉండటంతో వరంగల్, ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. శనివారం రాత్రి ఖమ్మం నుంచి తీసుకొచ్చి ఇంట్లోని బల్లపై ఉన్న పిల్లల పరుపులో పడుకోబెట్టారు.
అప్పటికే అందులో ఉన్న పామును వీరు గుర్తించలేదు. కాసేపు పాలుతాగిన చిన్నా రి అంతలోనే బాగా ఏడుస్తుండటంతో ఆందోళనకు గురయిన తల్లిదండ్రులు చికిత్స కోసం మహబూబాబాద్‌లోని పిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరుపులో నుంచి చిన్నారిని వైద్యుడికి చూపిస్తుండగానే.. అందులో నుంచి కట్ల పాము కిందపడింది. అది మమత కాలిపై నుంచి వెళుతుండగా పక్కనే ఉన్న క్రాంతి ఎడ మ కాలితో తొక్కాడు. దీంతో పాము అతడిని కాటు వేసింది.
చిన్నారిని పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. ఈ క్రమంలో అక్కడి స్థానికులు పామును చంపేశారు. పాప కూడా పాముకాటుతోనే మృతిచెందిందని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెం టనే క్రాంతి ఏరియా ఆస్పత్రికి చేరుకుని పాముకాటు వికటించే ఇంజక్షన్ వేయించుకున్నాడు. కాగా.. పోస్టుమార్టం రిపోర్టులో పాము చిన్నారిని ఎడమ తుంటి భాగంలో కాటు వేసినట్లుగా వైద్యులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment