తేలుకాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఆత్మకూరులో చోటుచేసుకుంది. పట్టణంలోని వందూరుగుంటకు చెందిన నాగులూరి పెంచలయ్య, కమలమ్మల కుమారుడు ప్రసాద్ (13) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
ఆత్మకూరు, న్యూస్‌లైన్: తేలుకాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఆత్మకూరులో చోటుచేసుకుంది. పట్టణంలోని వందూరుగుంటకు చెందిన నాగులూరి పెంచలయ్య, కమలమ్మల కుమారుడు ప్రసాద్ (13) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం తిరునాళ్లతిప్ప సమీపంలోని వెంకయ్య స్వామి ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ స్వామిని దర్శించుకుని పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టూ తిరుగుతుండగా తేలు కుట్టింది. వెంటనే ప్రసాద్ దారిన వెళుతున్న వాహనం ఎక్కి ఇంటికి చేరుకున్నాడు.
అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా ఉండే ఓ వైద్యుడి వద్ద కుటుంబ సభ్యులు చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు.