![Six Years Baby Died In Bowenpally After Tipper Hits - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/23/hyd-alwal-tipper-lorry-adhu.jpg.webp?itok=TpWZB2ln)
హైదరాబాద్ : నగరంలోని బోయిన్‌పల్లి దారుణం చోటుచేసుకుంది. టిప్పర్ లారీ అదుపు తప్పి ఆరేళ్ల పాప మీదకు దూసుకురావడంతో చిన్నారి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. హస్మత్‌పేట గల్లీలోకి కంకర లోడ్‌తో వచ్చిన టిప్పర్ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో వెనక్కి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి లారీ వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇది గమనించిన స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ లారీ అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఘటన స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు ఆందోళన చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి భారీ లోడ్‌తో కూడిన వాహనాలకు పగటి పూట నగరంలోకి అనుమతి లేకపోయినప్పటికీ.. కంకర లోడ్‌తో కూడిన టిప్పర్‌ను చిన్న గల్లీలోకి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment