అనుమానంతో ప్రాణాలు తీశాడు | Hyderabad man dies by suicide after killing wife daughter | Sakshi
Sakshi News home page

Bowenpally: అనుమానంతో ప్రాణాలు తీశాడు

Published Mon, Jul 22 2024 6:40 AM | Last Updated on Mon, Jul 22 2024 6:40 AM

Hyderabad man dies by suicide after killing wife daughter

రసూల్‌పురా: భార్య ప్రవర్తనపై అనుమానంతో దారుణానికి తెగబడ్డాడు ఓ భర్త. కట్టుకున్న ఇల్లాలితో పాటు పదకొండు నెలల కన్నకూతురును చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం బోయిన్‌పల్లి పరిధిలో వెలుగులోకి వచి్చంది. బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌ డెక్లూర్‌కు చెందిన గణేష్‌ సంగ్రామ్‌ (35), స్వప్న దంపతులు.

 వీరికి ముగ్గురు కూతుళ్లు తరుణి (6), తరుణశ్రీ (4), నక్షత్ర (11 నెలలు) ఉన్నారు. గణేష్‌ సంగ్రామ్‌ జీవనోపాధి కోసం కొన్నాళ్ల క్రితం కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చాడు. బోయిన్‌పల్లి ఆర్యసమాజ్‌ సమీపంలో అద్దె ఇంటిలో ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ భార్యాపిల్లలను పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా గణేష్‌ సంగ్రామ్, స్వప్న దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గణేష్‌ సంగ్రామ్‌.. శనివారం రాత్రి స్వప్నతో గొడవ పడ్డాడు. ఆవేశంలో ఆమె మెడకు తాడుతో ఉరి వేసి ప్రాణాలు తీశాడు.

 పదకొండు నెలల చిన్నారి నక్షత్ర గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇంటి యజమానురాలికి, డయల్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పాడు. సుచిత్ర– అల్వాల్‌ మార్గంలోని ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. మిగతా ఇద్దరు చిన్నారులు మరో గదిలో నిద్రిస్తుండటంతో తండ్రి వారి జోలికి వెళ్లలేదు. సమాచారం అందుకున్న పోలీసులు బోయిన్‌పల్లిలోని ఇంటికి వెళ్లి చూడగా స్వప్న, చిన్నారి నక్షత్ర మృతదేహాలు కనిపించాయి. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement