ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కంటోన్మెంట్: కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రిని బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం బోయిన్‌పల్లి పీఎస్‌లో బేగంపేట ఏసీపీ నరేశ్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రమేశ్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి చెత్త సేకరణతో ఉపాధి పొందుతున్నాడు. 15 ఏళ్ల క్రితం సరోజ అనే మహిళను వివాహం చేసుకున్న రమేశ్, వీరికి ఒక పాప జన్మించిన కొన్ని రోజులకే విడాకులు తీసుకున్నాడు. పదేళ్ల క్రితం మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.
మొదటి భార్య కూతురు, రెండో భార్య, ఆమె కుమారుడితో కలిసి బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి బుధవారం రాత్రి కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విన్న అతడి రెండో భార్య రమేశ్‌ను అడ్డుకుంది. కన్నకూతురు కాకపోయినా తల్లి ప్రేమతో ఆమెను కీచక భర్త నుంచి కాపాడింది. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో బోయిన్‌పల్లి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్ రవికుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment