చిలకలూరిపేట: గుంటూరు జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిగా... ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. కోటప్పకొండ సమీపంలో ఈటీ వద్ద ఆటోను ఇన్నోవా కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో చిలకలూరిపేటకి చెందిన సమీరా బేగం అనే ఆరేళ్ల పాప చనిపోగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.