కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి బాలిక బలి | Child died with the contractor negligence | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి బాలిక బలి

Published Sat, Sep 12 2015 3:10 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

Child died with the contractor negligence

గుంతలో పడి చిన్నారి మృతి

 మర్రిపాడు : రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఓ బాలిక బలైపోయింది. మండలంలోని ఈర్లపాడులో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. ఈర్లపాడు నుంచి సన్నువారిపల్లి వరకు నూతనంగా రోడ్డు నిర్మిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి కోసం ఈర్లపాడు సమీపంలో మట్టి కోసం భారీ స్థాయిలో గుంతలు తవ్వేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన గోతం సుబ్బారావు, సుభాషిణి కుమార్తె సుచరిత (8) తోటి పిల్లలతో కలిసి శుక్రవారం ఆటలాడుకుంటూ ఆ గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందింది.

తోటి చిన్నారులు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement