contractor negligence
-
క్రస్ట్‌గేట్ల ద్వారా లీకేజీలు!
సాక్షి, నాగార్జునసాగర్: బహుళార్థసాదక ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. జలాశయం నిండుగా ఉండడంతో క్రస్టు గేట్ల ద్వారా నీరు పెద్ద ఎత్తున లీకేజీ అవుతోంది. లీకేజీ కాకుండా ప్రతి ఏటా వేసవిలో క్రస్ట్ గేట్లకు రబ్బరు సీళ్లు ఏర్పాటు చేయడంతో పాటు గేట్లు ఎత్తే ఇనుప తాడుకు గ్రీజింగ్ చేస్తారు. ఈఏడాది కూడా కొంత మేరకు రబ్బరు సీళ్లును అమర్చినట్లుగా అధికారులు చెబుతున్నారు.అయినప్పటికీ రబ్బరు సీళ్లు అమర్చిన ప్రాంతం నుంచి కూడా నీటి లీకేజీ జరుగుతోంది. ప్రస్తుతం జలాశయంంలో 586.60 అడుగుల నీటిమట్టం ఉంది. గాలులు వీస్తుండటంతో జలాశయంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ సయయంలో క్రస్టు గేట్లనుంచి నీరు లీకవుతుంది. సిబ్బంది కొరత, కాంట్రాక్టర్లకు పనులు అప్పగింత డ్యాంపై గతంలో 100మంది ఉద్యోగులు పనిచేసేవారు. నేడు పదుల సంఖ్యలోకి సిబ్బంది తగ్గారు. దీంతో పనులన్నీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించపోవడంతో కూడా సమస్యలకు కారణమని తెలుస్తోంది. క్రస్టు గేట్లకు రబ్బరు సీళ్ల అమరిక సరిగా లేక నీరు కారుతుందని రిటైర్డ్ ఇంజినీర్లు చెబుతున్నారు. నీటి లీకేజీ స్వల్పంగా ఉన్న సమయంలోనే పుట్టీల్లో గత ఈతగాళ్లను గేట్ల వద్దకు పంపి జనప, గోగునార, పీచు ఏర్పాటు చేయించేవారు. కానీ, ఈఏడాది ఒకేసారి వరద విపరీతంగా రావడంతో అలాంటి చర్యలు చేపట్టడానికి వీల్లేకుండాపోయింది. నీరు తగ్గుముఖం పడితే కానీ క్రస్టు గేట్లనుంచి నీటి లేకేజీల నివారణకు చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని ప్రాజెక్టు సిబ్బంది తెలిపారు. -
అంతా అస్తవ్యస్తం..!
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మినీ ట్యాంక్బండ్ల పనులు అస్తవ్యస్తంగా మారాయి. సకాలంలో పనులు పూర్తికాకపోగా.. నాసిరకంగా ఉంటున్నాయి. అందుకు మోత్కూరు పెద్ద చెరువు పనులే నిదర్శనం. చెరువుకట్ట, రివిట్మెంట్ అస్తవ్యస్తంగా ఉండి కాంట్రాక్టర్ అలసత్వాన్ని, అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మరో వైపు మెట్‌చిప్స్, విద్యుత్ స్తంభాలు ఆగమాగంగా ఉన్నాయి. మే 31తో కాంట్రాక్ట్ గడువు ముగిసినా పనులు పూర్తికాకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. మోత్కూరు : ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.అందులో భాగంగా జిల్లాలోని మోత్కూరు చెరువును కూడా అధికారులు ఎంపిక చేశారు. మిషన్ కాకతీయ రెండో దశలో ప్రభుత్వం రూ.6.83కోట్ల నిధులు మంజూరు చేసింది. 2017 మే16వ తేదీన రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు విద్యుత్‌శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు. 2016 జూలై 26న అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టర్.. మే 31వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ, గడువు ముగిసినా పూర్తి కాలేదు. చేపట్టిన పనులు కూడా అస్తవ్యస్తంగా, నాణ్యత లోపించి ఉన్నాయి. చేపట్టాల్సిన పనులు ఏమంటే.. పాత చెరువుకట్ట వెడల్పు 5 మీటర్లు ఉండగా 12 మీటర్లకు పెంచాలి. కట్ట ప్ర«ధాన రహదారి కావడంతో బీటీ రోడ్డు వేసి ఇరువైపులా విద్యుత్ లైటింగ్, రేలింగ్ ఏర్పాటు చేయాలి. చెరువు కట్టకు లోపలి భాగంలో రాతి కట్ట (రివిట్మెంట్)నిర్మించాలి. పార్క్, వాకింగ్ ట్రాక్, మూడు విజిట్ వ్యూ పాయింట్లు, మూడు బతుకమ్మ గాట్లు ఏర్పాటు చేయాలి. బృందావన్ కాల్వ ఫీడర్‌చానల్ అలుగు వద్ద సీసీ, బ్రిడ్జి, ఎఫ్టీఎల్ లెవల్ చెరువు చుట్టూ ఆరు మీటర్ల వెడల్పుతో కట్ట పోయాల్సి ఉంది. కట్టకు ఉత్తరం వైపున ఉన్న వ్యవసాయ బావికి రివైండింగ్ వాల్ (సీసీ రోడ్డు) ఏర్పాటు చేయాలి. పాటించని ప్రమాణాలు.. ఆగమాగంగా పనులు! గడువులోగా పూర్తి చేయాల్సిన పనులు ఆగుతూ సా..గుతూ నడుస్తున్నాయి. పైగా నాసిరకంగా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండడం.. పనులు జరిగిన తీరు చూస్తుంటే తేటతెల్లమవుతోంది. రివిట్మెంట్ చేసే కట్టలోపలి భాగంతోపాటు కట్ట రహదారి విస్తరణకు చెరువు మట్టినే వినియోగించారు. అంతేకాకుండా కట్టపై బీటీ రోడ్డు పనులు అధ్వానంగా ఉన్నాయి. వాటర్ క్యూరింగ్‌తో రోలింగ్ చేయించకపోవడంతో అప్పుడే రోడ్డుపై కంకరలేచింది. అదే విధంగా మెట్ చిఫ్స్ అస్తవ్యస్తంగా వేశారు. ఓ వైపు మెటల్ చిప్స్ వేసి మరోవైపు వేయకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పాపతకట్టపై అంతరాయంగా ఉన్న కరెంట్ స్తంభాలను తొలగించలేదు. ప్రస్తుతం స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా ఉన్నాయి. 10 కరెంట్ స్తంభాలు వృథాగా ఉన్నాయి. గతంలో చెరువుకట్టపై ఉన్న ప్రధాన రహదారిపై అలుగునీరు ప్రవహిస్తూ ఉండేది. అక్కడ సిమెంట్ గూనలు వేసి తాత్కాలికంగా మరమతులు వేశారు. అలుగు సమీపంలో రహదారిపై బ్రిడ్జి నిర్మాంచాల్సి ఉండగా ఆర్అండ్బీ ఇరిగేషన్ శాఖల సమన్వయ లోపంతో ఇప్పటి వరకు బ్రిడ్జి పనులకు నోచుకోవడం లేదు. అసలు బ్రిడ్జి నిర్మిస్తారా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.10 కోట్లకు పెంచి నిధులు ఇదిలా ఉండగా మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.6.83కోట్లు మంజూరు చేసింది. కాగా అధనంగా నిధులు కావాలని స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పనుల శంకుస్థాపనకు వచ్చిన మంత్రి హరీశ్‌రావును కోరారు. అందుకు మంత్రి స్పందిస్తూ నిధులు పెంచుతున్నట్లు వేదికపై ప్రకటించారు. -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి బాలిక బలి
గుంతలో పడి చిన్నారి మృతి మర్రిపాడు : రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఓ బాలిక బలైపోయింది. మండలంలోని ఈర్లపాడులో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. ఈర్లపాడు నుంచి సన్నువారిపల్లి వరకు నూతనంగా రోడ్డు నిర్మిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి కోసం ఈర్లపాడు సమీపంలో మట్టి కోసం భారీ స్థాయిలో గుంతలు తవ్వేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన గోతం సుబ్బారావు, సుభాషిణి కుమార్తె సుచరిత (8) తోటి పిల్లలతో కలిసి శుక్రవారం ఆటలాడుకుంటూ ఆ గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందింది. తోటి చిన్నారులు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రెండు నెలలుగా ఆగిన సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు
సంగమేశ్వరం (పొన్నలూరు), న్యూస్‌లైన్: కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు రెండు నెలలుగా నిలిచిపోయాయి. మండలంలోని చెన్నిపాడు సమీపాన పాలేరు-మాకేరు నదులపై 2007లో * 50.50 కోట్లతో ప్రాజెక్టును నిర్మించేందుకు వీ ప్రభాకర్‌రెడ్డి కోరమాండల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పనులు దక్కించుకుంది. పాలేరు-మాకేరు నదుల సంగ మం వద్ద స్పిల్‌వే నిర్మించడం ద్వారా సుమారు 0.586 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు అవకాశం ఉంది. ప్రాజెక్టు నుంచి కుడి కాలువ ద్వారా పొన్నలూరు మండలంలో 3,500 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా జరుగుమల్లి మండలంలో 6 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రణాళికలు తయారు చేశారు. ఇప్పటి వరకు జరిగిన పనులివీ.. ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా పనులకు ఆటంకం కలుగుతూనే ఉంది. కాంట్రాక్టు సంస్థ ఇప్పటి వరకు నేరుగా పనులు చేపట్టలేదు. గతంలో హైదరాబాద్‌కు చెందిన ఇన్నయ్య, గిద్దలూరుకు చెందిన రాజశేఖర్‌లు కొంత కాలం ప్రాజెక్టు పనులు చేశారు. వివిధ కారణాలతో పనులు చాలా కాలం ఆగిపోయాయి. చివరకు గత డిసెంబర్ 17న స్థానిక ఎమ్మెల్యే జీవీ శేషు చొరవ తీసుకొని ప్రాజెక్టు పనులను పునఃప్రారంభింపజేశారు. ఈసారి హైదరాబాద్‌కు చెందిన మైత్రి ప్రాజెక్ట్స్ సంస్థ మట్టి కట్ట పనులు చేయడానికి ముందుకొచ్చింది. గత పది నెలల కాలంలో నదికిరువైపులా ఒక కిలోమీటరు పొడవునా మట్టి కట్ట పనులు మినహా మరేమీ చేయలేదు. వర్షాల వలన ప్రాజెక్టు పనులు నిలిచిపోయినట్లు మైత్రి ప్రాజెక్ట్స్ ప్రతినిధులు తెలిపారు. గత నెల రోజులుగా మాత్రమే మండలంలో అడపాదడపా వర్షాలు కురుస్తుండగా రెండు నెలలుగా పనులు ఆపాల్సిన అవసరం ఏమిటో కాంట్రాక్టరే చెప్పాల్సి ఉంది. ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. అంటే మరో రెండు నెలలు మాత్రమే గడువుంది. ప్రాజెక్టు పూర్తయ్యేనా... జలయజ్ఞంలో భాగంగా మండలానికి సంగమేశ్వరం ప్రాజెక్టు మంజూరైంది. ఈ ప్రాజెక్టు వలన పొన్నలూరు, జరుగుమల్లి మండలాల్లో 9500 ఎకరాలకు సాగునీరు, 30 వేల మందికి తాగునీరు అందించవచ్చు. రెండు మండలాలకు వరప్రసాదిని అయిన ప్రాజెక్టు పనులు ఏళ్ల తరబడి సాగుతున్నా అటు అధికారుల్లో గానీ, ఇటు ప్రజాప్రతినిధుల్లో గానీ చలనం లేదు. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పనులు ఇప్పటి వరకు మొదలు కానేలేదు. స్పిల్‌వే పనుల కోసం అప్పట్లో ఆర్థిక శాఖామాత్యునిగా ఉన్న కొణిజేటి రోశయ్య శిలాఫలకం వేశారు. అయినప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. పనులు నిలిచింది వాస్తవమే.. ఇరిగేషన్ డీఈ రత్నరాజు ప్రాజెక్టు పనులు నిలిచిన మాట వాస్తవమే. కాంట్రాక్టర్ చేసిన పనులకు సంబంధించి బిల్లులు పెద్దగా పెండింగ్‌లో లేవు. కాంట్రాక్టర్‌ను కొనసాగించాలా వద్దా అనే విషయం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది.