ఇక సర్టిఫికెట్లపై హోలోగ్రామ్‌ | Introduce holograms, QR codes in degrees, certificates | Sakshi
Sakshi News home page

ఇక సర్టిఫికెట్లపై హోలోగ్రామ్‌

May 28 2019 4:02 AM | Updated on May 28 2019 4:02 AM

Introduce holograms, QR codes in degrees, certificates - Sakshi

న్యూఢిల్లీ: విద్యార్థుల సర్టిఫికెట్లపై హోలోగ్రామ్, క్యూఆర్‌ కోడ్‌లు ముద్రించేందుకు యోచిస్తున్నామని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలకు యూజీసీ స్పష్టం చేసింది. వ్యవస్థలో పారదర్శకతకు, నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.  సర్టిఫికెట్లపై విద్యార్థుల ఫొటో, విద్యాసంస్థ హోలోగ్రామ్, మార్కుల జాబితాపై క్యూఆర్‌ కోడ్‌ త్వరలో ప్రవేశపెట్టబోతున్నామని  వైస్‌ చాన్స్‌లర్లకు రాసిన లేఖలో యూజీసీ సెక్రటరీ రజనీశ్‌జైన్‌ అన్నారు. ఈ చర్యల ద్వారా విద్యార్థుల వ్యక్తిగత వివరాలలో పారదర్శకత ఉంటుందని, వారికి సంబంధించిన వివరాల సేకరణ మరింత సరళంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement