marks lists
-
ఐఐటీ బాబా ట్రాక్ రికార్డ్ : 10,12వ తరగతి మార్కులు వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో పాపులర్ అయిన 'ఐఐటీ బాబా' గుర్తున్నాడా? ఇంజనీర్ బాబాగా పేరొందిన అభయ్ సింగ్ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతిష్టాత్మక ఐఐటీ (IIT)బాంబేలో తెలివైన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి, లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలి అభయ్ ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టాడు. ఆధ్యాత్మిక జ్ఞానంతో శాస్త్రీయ విజ్ఞానాన్ని మిళితం చేస్తూ తన విశిష్టమైన విధానంతో మహా కుంభ్‌లో భక్తులను కట్టిపడేశాడు.తాజాగా అభయ్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. విద్యార్థి దశలో అభయ్ అద్భుతమైన ట్రాక్ రికార్డు వైరల్‌గా మారింది. 10వ తరగతి, 12వ తరగతి మార్కుల షీట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ చక్కర్లు కొడుతోంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన అభయ్ తన 10వ తరగతిలో 93 శాతం, 12వ తరగతి పరీక్షలలో 92.4 శాతం మార్కులు సాధించాడట. ఈ స్కోర్లు అతని మేధో నైపుణ్యాన్ని మరింత హైలైట్ చేస్తున్నాయి. పలు మీడియా నివేదికలు వెలువడ్డాయి. అంతేకాదు 2008లో, అతను IIT-JEE పరీక్షలో 731 ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) సాధించాడని నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఈ టాలెంటే అతడిని దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ అభ్యర్థులలో ఒకటిగా నిలిపిందిఅంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.ఇదీ చదవండి: బెల్లీ ఫ్యాట్ కరగాలంటే, ఈ ఐదు ఆసనాలు చాలు!మహాకుంభ మేళా 2025ల దర్శనమిచ్చిన వివిధ సాధువులు , బాబాలలో ఆకర్షణీయంగా నిలిచిన వారిలో ఒకరు ఐఐటీయన్ బాబా అభయ్ సింగ్ ఒకరు. ఈయన హర్యానాకు చెందినవాడు. ఇంజనీర్ బాబా ఐఐటీ బాంబే నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత, కెనడాలో మూడు సంవత్సరాలు పనిచేశాడు. ఏడాది రూ. 36 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు.. అభయ్ డిజైన్‌లో మాస్టర్స్ (MDs) కూడా చేశాడు అయితే, బాబా ఆ ఉద్యోగాన్ని వదిలి ట్రావెల్ ఫోటోగ్రఫీలో కోర్సు చేశాడు. ట్రావెల్ ఫోటోగ్రఫీ చేస్తున్న క్రమంలో అతనిలో మార్పుమొదలైంది. కొంతకాలం తన సొంత కోచింగ్‌ను ప్రారంభించాడు. నాలుగేళ్లు డేటింగ్...కానీ నాలుగేళ్లు ఒక అమ్మాయితో డేటింగ్ కూడా చేశాడు. తల్లిదండ్రుల మధ్య ఉన్న వివాదాలు చూసిన తన సంబంధాన్ని ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లలేదని వెల్లడించాడు. ఇక్కడి నుండి ఆయన ఇంజనీరింగ్ వదిలి పూర్తిగా ఆధ్యాత్మికతకు వైపు మళ్లి బాబాగా మారాలని నిర్ణయించుకున్నాడు.తన జీవితమంతా మహాదేవ్కు అంకితం చేశానని కూడా మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే. -
ఇక సర్టిఫికెట్లపై హోలోగ్రామ్
న్యూఢిల్లీ: విద్యార్థుల సర్టిఫికెట్లపై హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్లు ముద్రించేందుకు యోచిస్తున్నామని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలకు యూజీసీ స్పష్టం చేసింది. వ్యవస్థలో పారదర్శకతకు, నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సర్టిఫికెట్లపై విద్యార్థుల ఫొటో, విద్యాసంస్థ హోలోగ్రామ్, మార్కుల జాబితాపై క్యూఆర్ కోడ్ త్వరలో ప్రవేశపెట్టబోతున్నామని వైస్ చాన్స్లర్లకు రాసిన లేఖలో యూజీసీ సెక్రటరీ రజనీశ్‌జైన్ అన్నారు. ఈ చర్యల ద్వారా విద్యార్థుల వ్యక్తిగత వివరాలలో పారదర్శకత ఉంటుందని, వారికి సంబంధించిన వివరాల సేకరణ మరింత సరళంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మార్కులు కొట్టు...లోన్ పట్టు..
సాక్షి, హైదరాబాద్: మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులకు స్టూడెంట్ లోన్లు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. విద్యార్థులు తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు చిన్నపాటి మొత్తాల్లో రుణాలు అందించేందుకు ఆయా వ్యక్తులు, సంస్థలు వారి మార్క్ షీట్లను విశ్లేషిస్తున్నాయి. ఐఫోన్లు, లేటెస్ట్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు విద్యార్థులకు రుణాలు ఇవ్వడం ఇప్పుడు ఆకర్షణీయ మార్కెట్‌గా భావిస్తున్నారు. పెద్దలు తమకు రుణం కావాలంటే వారి ఐటీ రిటన్స్, శాలరీ స్లిప్‌లు, క్రెడిట్ స్కోర్లను చూపుతారు. మరి విద్యార్ధులకు అలాంటి పత్రాలు ఉండవు కాబట్టి..వారి రుణ సామర్ధ్యం అంచనా వేసేందుకు తాము వినూత్న చర్యలతో విశ్లేషిస్తామని స్టూడెంట్ రుణాలను అందచేసే వేదిక క్రేజీబీ సీఈవో మధుసూధన్ చెప్పారు. స్టూడెంట్ లోన్స్ అధికంగా ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌లు కొనుగోలు చేసేందుకు తీసుకుంటారని చెబుతున్నారు. ఆయా విద్యా సంస్థల ప్రతిష్ట, ఉత్తీర్ణత శాతం, విద్యార్థుల వ్యక్తిగత సామర్ధ్యాన్ని కూడా రుణాలు ఇచ్చే సందర్భంలో రుణ దాతలు పరిశీలిస్తున్నారు. ఇక బెంగళూర్‌కు చెందిన విశ్వేశరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ వంటి సంస్ధలు తమ విద్యార్థుల మార్కుల వివరాలను ఆన్లైన్లో ఉంచుతుండటంతో ఆ వివరాలను ఆయా సంస్థలు పరిశీలించి రుణాలను అందచేస్తుండటంతో ప్రతిష్టాత్మక సంస్ధల్లో చదివే విద్యార్ధులకు సులభంగా రుణ వితరణ జరుగుతోంది. ఇతర సంస్థల విద్యార్థులకు వారి స్కోర్ కార్డులను తీసుకురావాలని లెండర్లు కోరుతున్నారు. ఇక ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లే కాకుండా ద్విచక్ర వాహనాల కొనుగోలుకు, ఫీజుల చెల్లింపునకూ రుణాలు ఇస్తున్నారు.విద్యార్ధులు తీసుకున్న రుణాలను సులభ వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు. -
మార్కుల జాబితాల పంపిణీ
అనంతపురం ఎడ్యుకేషన్ : మార్చిలో జరిగిన పరీక్షల్లో 20,179 మంది జనరల్ విద్యార్థులు, 1550 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే జూన్‌లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో 4364 మంది జనరల్ విద్యార్థులు, 216 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరందరీ మార్కుల జాబితాలు బోర్డు నుంచి ఆర్ఐఓ కార్యాలయానికి వచ్చాయి. జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న 204 కళాశాలలకు గాను సుమారు 70 శాతానికి పైగా బుధవారం తీసుకెళ్లారు. తక్కిన వారు వెంటనే వచ్చి మార్కుల జాబితాలు తీసుకెళ్లాలని ఆర్ఐఓ వెంకటేశులు సూచించారు. -
ఆధార్ ఉంటేనే మార్కుల లిస్ట్‌లు
ఇంటర్ విద్యార్థులకు తప్పనిసరి పెదవాల్తేరు : రేషన్ కార్డుకు, గ్యాస్‌కు, బ్యాంక్ ఖాతాకు, వాహనాలకు.. ఇలా మానవుని దైనందని జీవనానికి సంబంధించి ప్రతీ దానికి ఆధార్ కార్డు తప్పనిసరైంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్కుల లిస్ట్‌లకు ఆధార్ లింకు పెట్టారు. విద్యార్థులు ఆధార్ కార్డు అందించకపోతే మార్కుల లిస్ట్ అందే పరిస్థితి లేదు. 2014-15 విద్యాసంవత్సరంలోనే ప్రతీ విద్యార్థికి ఆధార్ కార్డు ఉండాలని బోర్డు సూచించింది. కళాశాలలో చేరినప్పుడే విద్యార్థులు దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు కూడా కళాశాలకు సమర్పించాలని నిబంధన పెట్టారు. చాలా మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు లేకపోయినా చేర్పించుకున్నారు. ప్రవేశాల తర్వాత అయినా ఆధార్ కార్డులు నమోదు చేసుకుని సమర్పిస్తారని భావించారు. అప్పటికీ ఇవ్వకపోవడంతో పరీక్ష ఫీజు చెల్లించినప్పుడు దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పించాలని నిబంధనలు పెట్టారు. ఇదీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడంతో మార్కులిస్ట్లకు ఆధార్ లింకు పెట్టారు. ఆధార్ నంబర్ నమోదు చేస్తేనే... ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిబ్రవరి 12 నుంచి ప్రయోగ పరీక్షలు, మార్చి 11 నుంచి థియరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు జిల్లా నుంచి లక్షా 546 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరందరికి ఆధార్ కార్డులు ఉండాలి. లేదంటే వీరు పరీక్షల్లో ఉత్తీర్ణులైనా మార్క్‌లిస్ట్‌లు రావు. ఆన్లైన్లో ఆధార్ కార్డు నంబర్ నమోదు చేస్తే విద్యార్థి మార్కుల జాబితా వస్తుంది. మూడు నెలల్లో ఆధార్ కార్డు పొందాల్సిందే... జిల్లాలో 304 జూనియర్ కళాశాలలో లక్షా 546 మంది చదువుతుంటే వీరిలో పొరుగు జిల్లాల విద్యార్థులు సుమారు 25 వేల మంది ఉన్నారు. నగరంలోని కార్పొరేట్ కళాశాలలో ఉంటూ వీరందరూ చదువుతున్నారు. వీరు ఇంటికి వెళ్లే సందర్భాలు తక్కువ. పరీక్షల సమయంలో ఆధార్ కార్డు నమోదు చేయించుకోవాలంటే ఇబ్బందికరమే. సాధారణంగా ఆధార్ కార్డు పొందడానికి 15 నుంచి 30 రోజులు పడుతుంది. పరీక్షల అనంతరం రెండు నెలల సమయం విద్యార్థులకు ఉంటోంది. ఈ లోపు వారు ఆధార్ కార్డులు పొందితే ప్రయోజనకరంగా ఉంటోంది.