విజయవాడ, న్యూస్‌లైన్ : కేఆర్‌యూసెట్-2014కు సంబంధించి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ రెండో రోజు 354 సీట్లు భర్తీ అయ్యాయని కృష్ణా యూనివర్సిటీ డెరైక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య మండవ వెంకటబసవేశ్వరరావు తెలిపారు. కేబీఎన్ కళాశాలలో రెండో రోజైన గురువారం కూడా కౌన్సెలింగ్ కొనసాగింది. ఎంఏ (ఎకనామిక్స్), ఎంఎస్సీ (కంప్యూటర్స్), ఎంఎస్సీ (కెమిస్ట్రీ) తదితర కోర్సులకు సంబంధించి సీట్ల కేటాయింపు చేపట్టారు.
రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల పరి శీలన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండవ మాట్లాడుతూ కౌన్సిలింగ్ రెండో రోజు పలు కళాశాలలకు సంబంధించి సీట్లు కేటాయించామని తెలిపారు. శక్రవారం కూడా కౌన్సెలింగ్ కొనసాగుతుందన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి విద్యార్థులను పంపించివేస్తున్నామన్నారు.
ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) విభాగానికి సంబంధించి అత్యధికంగా 231 సీట్ల కేటాయించామని తెలిపారు. కౌన్సెలిం గ్‌లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కృష్ణమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణ రావు, పీజీ డెరైక్టర్ డాక్టర్ వై.నరసింహారావు, విశ్వవిద్యాలయం పక్షాన డాక్టర్ ఉషా తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా వర్సిటీ కౌన్సెలింగ్‌లో 354 సీట్లు భర్తీ
Published Fri, May 23 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement
Advertisement