programs
-
5 పథకాలు.. 4 నెలలకోసారి
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలు సమర్థవంతంగా అమలు...క్షేత్రస్థాయిలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నాలుగునెలలకోసారి ప్రభుత్వం ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఐదు పథకాలకు మాత్రమే వర్తింపజేస్తామని ప్రభుత్వవర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఆదివారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రజాపాలన కార్యక్రమ అమలు విధివిధానాలపై మార్గదర్శకాలు విడుదల చేశారు. దీని ప్రకారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది పనిదినాల్లో (డిసెంబర్31, జనవరి1 మినహాయించి) నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామపంచాయతీలోనూ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి మున్సిపల్ వార్డులోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. షెడ్యూల్, నిబంధనలు ►ఈ నెల 25వ తేదీలోపు అధికారుల బృందాల ఏర్పాటు, గ్రామాల వారీగా విజిట్ షెడ్యూల్ త యారీ (మంగళవారం సాయంత్రం ఆరు గంట లకల్లా ఈ వివరాలు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది) ►ఈ నెల 26న అధికారుల బృందాలకు శిక్షణ, అవగాహన ►ఈ నెల 26,27 తేదీల్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయిలో అధికారులకు అవగాహన కార్యక్రమం, పథకం ఉద్దేశాల వివరణ ►ఈ నెల 28న గ్రామ, వార్డు సదస్సులు ప్రారంభం..సాయంత్రం 8 గంటల కల్లా డైలీ రిపోర్టు ఆన్లైన్లో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి. ►సదస్సు ఏర్పాటుకు ఒక రోజు ముందే గ్రామాలు, వార్డుల్లో టాంటాం వేయించడంతో పాటు కౌంటర్లు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలి. ►రాష్ట్ర స్థాయిలో ఒక ఉమ్మడి దరఖాస్తు ఫారం రూపొందించి కలెక్టర్లకు పంపిస్తారు. వీటిని ఈ నెల 27వ తేదీ రాత్రికల్లా గ్రామాలు, వార్డులకు పంపించాలి. ముందు రోజే గ్రామాలు, వార్డుల్లో దరఖాస్తులు పంపిణీ చేసి వాటిని ప్రజలతో నింపించాలి. ►సభలు సజావుగా నిర్వహించడానికి తాగునీరు, టెంట్లు, కౌంటర్ల కోసం టేబుళ్లు, క్యూలైన్ల కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలి. ►గ్యారంటీల అమలుతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులు ఈ సభలకు హాజరు కావాలి. నియోజకవర్గస్థాయిలో నోడల్ అధికా రులను నియమించి కార్యక్ర మాన్ని పర్యవేక్షించాలి. ప్రతి గ్రామపంచాయతీ / వార్డుకు ప్రత్యేక అధికారిని ఇన్చార్జ్గా నియమించాలి. ►ఇతర గ్రామ స్థాయి అధికా రులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లతో సమన్వయం చేసుకొని కార్యక్రమం నిర్వ హించాలి. ►గ్రామ పంచాయతీ సర్పంచ్/కౌన్సిలర్/కార్పొరేటర్, ఇతర ప్రజాప్రతినిధులను సదస్సులకు ఆహ్వానించాలి. ►సభ ప్రారంభానికి ముందు ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించాలి. ►దరఖాస్తులతో పాటు అవసరమైన ఆధార్, తెల్లరేషన్ కార్డు సమర్పించేలా కౌంటర్లలో ఉండే సిబ్బంది జాగ్రత్త తీసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు మహిళలకు ప్రత్యేక కౌంటర్లు, స్త్రీ, పురుషులకు విడివిడిగా క్యూలైన్లు ఏర్పాట్లు చేయాలి. దరఖాస్తుదారులు భారీ సంఖ్యలో ఉంటే టోకెన్ విధాననం అమలు చేయాలి. ►దరఖాస్తుకు రశీదు తప్పనిసరిగా ఇవ్వాలి. ► స్వీకరించిన ప్రతి దరఖాస్తు వివరాన్ని పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలి. ప్రతి దరఖాస్తుకు ఒక ప్రత్యేక సంఖ్య కేటాయించాలి. ► పట్టణ ప్రాంతాల్లో ఈ కార్య క్రమాన్ని జీహెచ్ఎంసీ కమిష నర్ లేదా సంబంధిత మున్సి పల్ కమిషనర్లు పర్యవే క్షిస్తారు. ► స్వీకరించిన అన్ని దర ఖాస్తులు టీం లీడర్ అధీనంలో ఉంచాలి. వాటిని భద్రపర్చడంతో పాటు కంప్యూటరీకరించేందుకు అవస రమైన కార్యాలా యాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించాలి. ►ప్రతి అధికారుల బృందం రోజుకు రెండు గ్రామాల్లో సభలు నిర్వహించాలి. జనవరి ఆరో తేదీ నాటికి పూర్తి చేసుకోవాలి. ప్రతి 100 కుటుంబాలకు కనీసం ఒక కౌంటర్ ఉండేలా చూసుకోవాలి. ►దరఖాస్తుల వెరిఫికేషన్/ప్రాసెసింగ్‌కు సూచన లు ప్రభుత్వం త్వరలోనే జారీ చేస్తుంది. ►అధికారుల బృందాలు విజిట్ షెడ్యూల్‌కు 10 అంశాలతో, డైలీ రిపోర్టు కోసం 11 అంశాలతో ప్రత్యేక ఫార్మాట్ రూపొందించారు. గ్రామాలు లేదా వార్డులకు వచ్చే అధికారులు వీరే ►తహసీల్దారు లేదా రెవెన్యూ శాఖ ప్రతినిధి ►ఎంపీడీఓ లేదా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతినిధి ►మండల పంచాయతీ అధికారి లేదా పంచాయతీరాజ్ ప్రతినిధి ►మండల వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ శాఖ ప్రతినిధి ►పౌరసరఫరాల శాఖ ప్రతినిధి ► పీహెచ్‌సీలోని వైద్యాధికారి లేదా వైద్య శాఖ ప్రతినిధి ►మండల విద్యాధికారి లేదా విద్యాశాఖ ప్రతినిధి ►ఏఈ (డిస్కం) లేదా విద్యుత్‌శాఖ ప్రతినిధి ►సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ►ఇతర సంబంధిత అధికారులు. (వీరిలో అవసరమైన అధికారులను గ్రామాల వారీ గా నియమించుకోవాల్సి ఉంటుంది.) దరఖాస్తులు స్వీకరించే పథకాలు: మహాలక్ష్మి రైతుభరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్లు చేయూత -
ప్రజల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: ఎంతో కాలం అధికారంలో ఉన్నా ఏమీ చేయని వాళ్లు.. చేసింది చెప్పుకోవ డానికి ఏమీ లేనివాళ్లు ఇప్పుడు తమ కు అవకాశమిస్తే ఎన్నో చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రజలను హెచ్చరించా రు. సంక్రాంతి ముందు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చేవాళ్ల మాటలతో మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, బెంగళూరుల నుంచి వచ్చేవారు ఎన్నో ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని, వాళ్లు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్ర మాలు, బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చే ఆలోచన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని, ఆ విషయాల్ని ఆయనే త్వరలో ప్రకటిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీముల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్‌లో నిర్మించిన 1,800 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను కేటీఆర్ గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘డబుల్’ లబ్ధిదారుల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పేదలు, రైతులపై కేసీఆర్కున్న ప్రేమ దేశంలో మరెవ్వరికీ లేదని కేటీఆర్ చెప్పారు. ప్రగతి రథ చక్రాన్ని ఆపేందుకు ఇష్టమొచ్చినట్లుగా హామీలిస్తు న్న వారి మాటలు నమ్మి మోసపోవద్దని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎలాంటి పక్షపాతం లేకుండా ఆన్లైన్ లాటరీ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. జగద్గిరిగుట్ట డివిజన్లోని కాంగ్రెస్ మహిళా అధ్యక్షు రాలు కౌసల్యకు, బీజేపీ నాయకురాలు సునీతకు కూడా ఇళ్లు వచ్చాయని చెప్పారు. తొలిదశలో అర్హులకు లక్ష ఇళ్లు ఇస్తుండగా, అర్హులైన మిగతా మూడున్నర లక్షల మందికి కూడా ఇచ్చే బాధ్యత తమదేనని అన్నారు. ఈ రోజుతో 30 వేల ఇళ్ల పంపిణీ పూర్తవుతుండగా, త్వరలోనే మిగతా 70 వేల ఇళ్లు కూడా అందజేస్తామన్నారు. లక్ష ఇళ్ల నిర్మాణా నికి ప్రభుత్వానికైన ఖర్చు దాదాపు రూ.10 వేల కోట్లయితే, మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ. 50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తిని పేదల చేతుల్లో పెడుతున్న ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. దుండిగల్‌కు త్వరలోనే కొత్త పరిశ్రమ రానుందని తెలిపారు. ఇలాంటి ఇళ్లు ఇంకెక్కడైనా ఉన్నాయా ? మన రాష్ట్రం కాక దేశంలో ఉన్న మరో 27 రాష్ట్రాల్లో, కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయేమో చూపిస్తారా? అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. పేదలకు ఇలాంటి ఇళ్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేవని చెప్పారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు అంటారని, నిరుపేద ప్రజలకు ఇళ్లు కట్టించి, పెళ్లి చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి మేనమామగా నిలిచారని పేర్కొన్నారు. చాయ్ అమ్ముకో.. దేశాన్ని మోసం చేయొద్దు ఇంటి పట్టా అందుకున్న ఒక మహిళను కేటీఆర్ ఏం చేస్తావంటూ ప్రశ్నించారు. ఆమె తాను చా య్ అమ్ముతానని చెప్పడంతో ‘చాయ్ అమ్ము కోవాలి.. కానీ దేశాన్ని మోసం చేయొద్దు’ అని అన్నారు. ఏమీ అర్థం కాక ఆమె తెల్లముఖం వేయడంతో.. ‘నీ గురించి కాదులే.. వేరేవా ళ్లు ఉన్నారు.. వారి గురించి చెబుతున్నా’ అంటూ పరోక్షంగా ప్రధాని మోదీని ప్రస్తావించారు. -
స్కిల్ యూనివర్స్ పేరుతో డాష్ బోర్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్వహించే నైపుణ్య శిక్షణ కోర్సులు, ఉపాధి కల్పన వంటి వివరాలు 24గంటలు అందుబాటులో ఉండేవిధంగా ‘స్కిల్ యూనివర్స్’ పేరుతో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) త్వరలో అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. విజయవాడ ఆటోనగర్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన శుక్రవారం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.ట్రైనింగ్, ప్లేస్మెంట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం యువతకు ఎప్పటికప్పుడు తెలిసేలా డాష్ బోర్డును తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ, సీడ్యాప్, న్యాక్, పీఏడీఏ వంటి వివిధ సంస్థలకు చెందిన శిక్షణ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర యువతి, యువకులు నైపుణ్య శిక్షణ కోసం నమోదు చేసుకునేవారు, శిక్షణ దశలో ఉన్నవారు, శిక్షణ పూర్తి చేసుకున్నవారు, ఉద్యోగాల్లో చేరినవారు... ఇలా సమగ్ర సమాచారం ఆన్లైన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే విధంగా డ్యాష్‌బోర్డును అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.కేతిక, నైపుణ్య విద్యను అభ్యసించే యువతి, యువకులకు అధ్యాపకుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన పోర్టల్‌లో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో కరిక్యులమ్(రెజ్యూమ్) తయారు చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ తెలిపారు. వాటర్ మేనేజ్మెంట్, ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్లో ఏపీఎస్ఎస్డీసీ సాధించిన అవార్డును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ కార్యదర్శులు, ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ నాగరాణి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ డాక్టర్ వినోద్‌కుమార్, ఈడీ దినేష్‌కుమార్, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య, సీడ్యాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ నగరం అడుగులు.. భారీ ప్రాజెక్టులతో కళకళ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అభివృద్ధిలో దూసుకెళుతున్న విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 1వతేదీన శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు నిర్వహించనున్నారు. నగర అభివృద్ధితో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన, గౌరవ ప్రదమైన జీవన ప్రమాణాల్ని అందించే లక్ష్యంతో ఇవి రూపుదిద్దుకున్నాయి. రూ.600 కోట్లతో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్‌కు మంగళవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్ అదేరోజు జీవీఎంసీ పరిధిలో మరో 50 పనులకు భూమి పూజ చేయనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపాధి, నైపుణ్య అవకాశాల్ని కల్పించే నాలుగు ప్రాజెక్టులను కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఐటీ టవర్స్‌పై సానుకూలం.. ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖ నగరం కార్యనిర్వాహక రాజధానిగా అడుగులు వేస్తోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిచే విశాఖను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రణాళికలు, ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఐటీ హబ్‌గా మార్చేందుకు బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో దిగ్గజ సంస్థలను ఆహ్వనించిన ప్రభుత్వం పర్యాటక రంగంలోనూ అదే ఒరవడిని అనుసరిస్తోంది. ఇప్పటికే అన్నవరం సమీపంలో రూ.350 కోట్లతో ఒబెరాయ్ లగ్జరీ రిసార్టుల ప్రాజెక్టుకు భూమి పూజ జరిగింది. తాజాగా దిగ్గజ సంస్థ రహేజా గ్రూప్ భారీ మాల్ని నిర్వించనుంది. మాల్ శంకుస్థాపనకు ఆహ్వనించేందుకు రహేజా గ్రూప్స్ ప్రెసిడెంట్ నీల్ రహేజా ఇటీవలే ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న మాల్ని మూడేళ్లలోగా పూర్తి చేయాలని రహేజా లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనిద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇనార్బిట్ మాల్ నిర్మాణంలో భాగంగా ఐటీ టవర్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ రహేజా గ్రూప్ ప్రతినిధులకు సూచించారు. దీనిపై కంపెనీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రూ.135.88 కోట్లతో జీవీఎంసీ ప్రాజెక్టులు ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన అనంతరం అదే ప్రాంగణంలో విశాఖ ప్రజలకు మౌలిక సదుపాయాలు, నగర సుందరీకరణ, వివిధ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. అమృత్ 2.0, స్మార్ట్ సిటీ, 15వ ఆరి్థక సంఘం నిధులు రూ.135.88 కోట్లతో చేపట్టనున్న 50 పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. శివారు, జీవీఎంసీ విలీన ప్రాంతాలైన మధురవాడ, లంకెలపాలెం, గాజువాక, అనకాపల్లి తాగునీటి కష్టాలను తీర్చేలా పైప్‌లైన్ ప్రాజెక్టులు, మురికివాడల్లో అభివృద్ధి పనులు, రూ.30 కోట్లతో జీవీఎంసీ పరిధిలోని 10 చెరువుల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. రూ.6.4 కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో యూరోపియన్ స్టైల్లో సాగర్‌నగర్, డిఫెన్స్ కాలనీ వద్ద నిర్వించనున్న ఈట్ స్ట్రీట్స్తో పాటు రూ.6 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్, రూ.12 కోట్లతో విశాఖ నగరంలోని పలు ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జీవీఎంసీ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపాధి, నైపుణ్యాలను పెంచేలా.. ఉత్తరాంధ్ర విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా సీఎం జగన్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రూ.129 కోట్లతో చేపట్టిన కీలక ప్రాజెక్టులను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం ఏయూ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఏయూలో రూ.21 కోట్లతో 30,000 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్వించిన ఏయూ స్టార్టప్ అండ్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్(అ–హబ్)ని సీఎం ప్రారంభించనున్నారు. ఇందులో ప్రస్తుతం 121 స్టార్టప్ కంపెనీలకు చోటు కల్పించారు. రూ.44 కోట్లతో 55 వేల చ.అడుగుల విస్తీర్ణంలో బయోటెక్, ఫార్మా, జెనోమిక్స్ ఇంక్యుబేషన్, టెస్టింగ్ ల్యాబ్ కోసం నిర్మించిన ఎలిమెంట్ (ఏయూ ఫార్మా ఇంక్యుబేషన్ అండ్ బయోలాజికల్ మానిటరింగ్ హబ్)ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రూ.35 కోట్లతో 60 వేల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్వించిన అల్గారిథమ్ (ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్)ని సీఎం జగన్ విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నారు. ఐఐఎంతో ఒప్పందంలో భాగంగా రూ.18 కోట్లతో 25 వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ అనలిటిక్స్‌లో ప్రత్యేక కోర్సులందించేందుకు నిర్వించిన ఏయూ–సిబ్(ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్)ని సీఎం ప్రారంభించనున్నారు. రూ.11 కోట్లతో అవంతి సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రూ.11 కోట్లతో మెరైన్ అగ్రికల్చర్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌లో యువతకు నైపుణ్యం అందించేందుకు నిర్వించిన ఏయూ అవంతి ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్ హబ్‌ని ముఖ్యమంత్రి జగన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇనార్బిట్ మాల్ ప్రత్యేకతలివీ.. నిర్మిస్తున్న సంస్థ : రహేజా గ్రూప్ విస్తీర్ణం : 17 ఎకరాలు (6 లక్షల చ.అడుగులు) ఎక్కడ : విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని సాలిగ్రామపురంలో ఎవరి స్థలం : విశాఖపట్నం పోర్టు అథారిటీ లీజు వ్యయం: 30 ఏళ్లకు రూ.125 కోట్లు శంకుస్థాపన : ఆగస్ట్ 1వ తేదీన పూర్తి : మూడేళ్ల వ్యవధిలో నిర్మాణం ఇలా: రెండు బేస్మెంట్ ప్లస్ 3 స్టిల్ట్ ఫ్లోర్స్, 5 ఫ్లోర్లు రీటైల్ కోసం, 6వ ఫ్లోర్ మల్టీలెవల్ కార్ పార్కింగ్ కోసం, 7, 8వ ఫ్లోర్లు ఆఫీస్ స్పేస్ కోసం, 9వ ఫ్లోర్లో హోటల్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సరికొత్త విశాఖ ఆవిష్కృతం విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సరికొత్త నగరం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటికే భారీ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా మొదలయ్యాయి. పర్యాటక ప్రాజెక్టులతో పాటు ఐటీ సంస్థల రాకతో నగరం కళకళలాడుతోంది. ఆగస్ట్ 1 న దాదాపు రూ.865 కోట్ల విలువైన కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. – డా.మల్లికార్జున, జిల్లా కలెక్టర్ -
కాకినాడ పోలీసుల కార్యక్రమాలకు ప్రజల ప్రశంసలు
-
స్టేట్.. సెంటర్.. సెప్టెంబర్ 17.. తెలంగాణలో హైవోల్టేజీ పాలిటిక్స్
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17.. నిజాం నవాబు నుంచి తెలంగాణ స్వాతంత్య్రం పొందిన రోజు. ఇప్పుడదే రోజున రాష్ట్రంలో హైవోల్టేజీ రాజకీయానికి రంగం సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఈ నెల 17న ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి పోటీ పడుతున్నాయి. ఆ రోజు నాటికి తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమై 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ ఏట అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆ రోజు నుంచి ఏడాది పాటు తెలంగాణ విలీన వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చదవండి: బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేలా.. ఈ మేరకు శనివారం నాటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున అధికారికంగా మళ్లీ తెలంగాణ విలీన దినం నిర్వహించాల్సిన అవసరం లేదంటూ.. ఇప్పటివరకు కేవలం పార్టీ కార్యాలయంలో మాత్రమే టీఆర్ఎస్ జాతీయ జెండా ఆవిష్కరిస్తూ వస్తోంది. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈసారి అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు హాజరయ్యేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఆ రోజు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వేడెక్కిన రాజకీయం.. ఈ నెల 17న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పోటా పోటీ ఉత్సవాలతో మరింత వేడెక్కే సూచనలు కన్పిస్తున్నాయి. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. అధికారికంగా ‘విమోచన’ ఉత్సవాలు -
22న స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఈనెల 22న ఎల్బీస్టేడియంలో ఘనంగా నిర్వహించాలని వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ నిర్ణయించింది. గురువారం ఉదయం బీఆర్కేఆర్ భవన్లో ఎంపీ కె.కేశవరావు అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు కేశవరావు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరు కానున్నట్లు వివరించారు. అన్ని జిల్లాల నుంచి ప్రజలు ఈ ఉత్సవాలకు హాజరు కానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికా రెడ్డి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ బృందం దేశభక్తి గీతాల సంగీత విభావరి, లేజర్ షో, క్రాకర్స్ ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీ తారలు కూడా పాల్గొంటారని కేశవరావు తెలిపారు. 16న సామూహిక జాతీయ గీతాలాపన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ కేశవరావు తెలిపారు. నిర్దేశించిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రహదారులలో ట్రాఫిక్‌ను నిలిపివేసి జాతీయగీతం ఆలపించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని చాటాలని విజ్ఞప్తి చేశారు. -
ఇంటింటిపై జాతీయ జెండా
సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో ‘భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ’కార్యక్రమం నిర్వహణపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైన సుమారు 1.20 కోట్ల త్రివర్ణ పతాకాల తయారీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గద్వాల, నారాయణపేట, సిరిసిల్ల, పోచంపల్లి, భువనగిరి, వరంగల్ తదితర ప్రాంతాల్లోని చేనేత, పవర్లూమ్ కార్మికులకు జాతీయ జెండాల తయారీ ఆర్డర్లు ఇవ్వాలన్నారు. జాతీయ పతాకాల ముద్రణ, దేశభక్తి ప్రచార కార్యక్రమాల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. పల్లె నుంచి పట్నం దాకా... ►పంద్రాగస్టుకు వారం ముందు నుంచి వారం తర్వాత వరకు 15 రోజులు రాష్ట్రంలో ‘భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ’ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ►గడపగడపకూ జాతీయ పతాకాన్ని ఎగు రవేయాలి. కవి సమ్మేళనాలు, జాతీయ భావాలు పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ►మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఫ్రీడం రన్ నిర్వహించాలి. ►అన్ని విద్యాసంస్థల్లో ఆటలు, వ్యాస రచన, వక్తృత్వ, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు, నాటికలు, ఏకపాత్రాభినయం వంటివి జరపాలి. ►ప్రభుత్వ శాఖలన్నీ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొనాలి. రోజువారీ షెడ్యూల్ రూపొందించుకోవాలి. విధివిధానాల రూపకల్పనకు ప్రత్యేక కమిటీని నియమించాలి. ►పల్లె నుంచి పట్నం దాకా స్వాతంత్య్ర వజ్రోత్సవ దీప్తిని వెలిగించే దిశగా చర్యలు చేపట్టాలి. ►జాతీయ పతాక చిహ్నాన్ని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు లెటర్ హెడ్లపై ముద్రించుకోవాలి. ►15 రోజులు జాతీయ పతాక చిహ్నా న్ని పత్రికలు మాస్టర్ హెడ్స్‌పై ముద్రించాలి. ►టీవీ చానళ్లు సైతం చిహ్నాన్ని నిత్యం కనిపించేలా ప్రసారం చేయాలి. దేశ భక్తిని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చేయాలి. నాటి విలువలు నేడు ఏవీ? ‘స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న భారత దేశాన్ని మరింత గుణాత్మకంగా రూపొందించుకోవాల్సి ఉంది. ప్రజాస్వామిక, లౌకిక, సమాఖ్య విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పని ఒత్తిడి, ఆర్థిక అవసరాల నేపథ్యంలో నాటి తరం ఆచరించిన దేశభక్తి, అంతటి భావోద్వేగాలు నేటి యువతలో కనిపించడంలేదు. ఈ వాతావరణాన్ని మనం పునఃసమీక్షించుకోవాల్సి ఉంది. అందుకే దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాల్సిన అక్కెర దేశభక్తులైన తెలంగాణ బిడ్డలకు ఉంది. పల్లె, పట్నం ఒక్కటై భారతావని ఘనకీర్తిని చాటాల్సి ఉంది’అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. -
కార్య‘కర్తవ్య బోధన’
సాక్షి నెట్వర్క్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ సీనియర్లు విస్తతంగా పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, ఎంపీలు, ఇతర కీలక నేతలు పట్టణాలు, గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తల ఇళ్లలో భోజనం చేస్తూ.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. పార్టీ పదాధికారులు, వివిధ మోర్చాలు, శక్తి కేంద్రాల సమావేశాల్లో పాల్గొని దిశా నిర్దేశం చేస్తున్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ.. మరోవైపు పార్టీ బలోపేతం కోసం సూచనలు, సలహాలు ఇస్తూ కలియదిరుగుతున్నారు. స్థానికంగా ప్రజలు, విద్యార్థులు, రైతులతో మాట్లాడి వారి సమస్యలపై పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని చెప్తున్నారు. ఉమ్మడి కరీంనగర్లో.. కేంద్ర మంత్రి వీరేందర్‌కుమార్ కటక్ శుక్రవారం సిరిసిల్లలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పాల్గొని సూచనలు, సలహాలు ఇచ్చా రు. రామడుగు మండలం వెదిరలోని దళితకాలనీలో గుడువందల నర్సయ్య ఇంట్లో అల్పాహారం తీసు కున్నారు. బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సతీష్ పునియా కరీంనగర్లో పార్టీ అనుబంధ మోర్చా లు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. బూత్ స్థాయి నుండి చేపట్టాల్సిన కార్యక్రమా లపై సూచనలు చేశారు. కొత్తపల్లిలో దళిత మోర్చా మండల అధ్యక్షుడు నలువాల మహేశ్ ఇంట్లో భోజనం చేశారు. కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే జమ్మికుంటలో ఆవాస విద్యా లయాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పశ్చిమబెంగాల్ ఎంపీ జయంత్ కుమార్ రాయ్ మానకొండూరులో పర్యటించారు. ధర్మపురిలో కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్, మంథనిలో చత్తీస్‌గఢ్ ఎమ్మెల్యే అజయ్ చంద్రకర్, రామగుండం లో బిహార్ ఎంపీ గోపాల్జీ ఠాగూ ర్, జగిత్యాలలో మనోజ్ తివారీ, కోరుట్లలో అనిర్బన్ గంగూలీ పర్యటించి.. నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మంచిర్యాలలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఆదిలాబాద్‌లో త్రిపుర మాజీ సీఎం విప్లవ్‌కుమార్ స్థానిక నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. కాగజ్‌నగర్‌లో మణిపూర్ రాష్ట్ర బీజేపీ చీఫ్ శారద దేవి, చెన్నూరులో ఎంపీ అజయ్ టాంటా, బెల్లంపల్లిలో జమ్మూకాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవీందర్గుప్తా, నిర్మల్‌లో ఎమ్మెల్సీ నావల్ కిశోర్‌యాదవ్, ఖానాపూర్‌లో ఎంపీ హీనాకుమార్, ఆసిఫాబాద్‌లో డయ్యూడామన్ బీజేపీ అధ్యక్షుడు దీపేశ్ సోండే, ముథోల్‌లో కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్‌లో.. కేసీఆర్ కుటుంబం రాష్ట్ర నిధులను ఏటీఎంలా వాడుకుంటోందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై నిజామాబాద్‌లో ఆరోపించారు. ఎల్లారెడ్డిలో గుజరాత్ ఎంపీ పార్తీబెన్, జుక్కల్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విశాల్ జోలె, బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్‌లో బీజేపీ సిక్కిం అధ్యక్షుడు దాల్ బహదూర్ చౌహాన్, మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలో కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాలవీయ కామారెడ్డిలో పర్యటించి.. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఉమ్మడి ఖమ్మంలో.. ఇల్లెందు, టేకులపల్లిలో బీజేపీ నేత లత ఉసెండి, బూర్గంపాడులో బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్, దమ్మపేటలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణుదేవ్ సాయి, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే ముకుత్ అధికారి, ఖమ్మం రూరల్ మండలంలో ఎంపీ లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్, ఖమ్మం, రఘునాథపాలెం మండలాల్లో బీజేపీ జాతీ య అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్, వైరాలో గుజరాత్ ఎంపీ రమేలా బెన్, మధిరలో మధ్యప్రదేశ్ ఎంపీ సంధ్యారాయ్ పర్యటించారు. ఎక్కడికక్కడ స మావేశాలు నిర్వహించి, బీజేపీ కార్యకర్తలకు పార్టీ ఉ ద్దేశాలు, ఏం చేయాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి రంగారెడ్డిలో మహేశ్వరం నియోజకవర్గంలో కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి పర్యటించి స్థానిక నేతలతో మాట్లాడారు. ఫరూఖ్‌నగర్ మండలంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్, ఆమనగల్లో ఒడిశా బీజేపీ అధ్యక్షుడు సమీర్ మహంతి, కొడంగల్‌లో కర్నాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సంగప్ప, పరిగిలో మాజీ ఎంపీ అనుపమా హజ్రా పర్యటించారు. కార్యకర్తలతో సమావేశమై నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో.. కేంద్ర మంత్రి సంజయ్‌కుమార్ బాల్యాన్ మెదక్‌లో మత్స్యకారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం అమలు చేస్తున్న పథకాల్లో 60 శాతం కేంద్రం నిధులేనన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఎంపీ శివప్రతాప్ శుక్లా.. సిద్దిపేటలో ఎంపీ అపరాజితా సారంగి, గజ్వేల్‌లో జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్, దుబ్బాకలో మాజీ గవర్నర్ రాజశేఖరన్, సంగారెడ్డిలో రాజస్థాన్ అసెంబ్లీ బీజేపీపక్ష నేత గులాబ్‌చంద్ కటారియా, జహీరాబాద్‌లో కర్నాటక ఎంపీ ఉమేశ్ జాదవ్ పర్యటించి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఉమ్మడి నల్లగొండలో.. సూర్యాపేటలో కేంద్ర మంత్రి వీకే సింగ్ పర్యటించారు. వీర జవాన్లు గోపయ్యచారి, సంతోష్‌బాబు చిత్రపటాల వద్ద నివాళులు అర్పించి పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. నల్లగొండలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది, నాగార్జునసాగర్‌లో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ చతుర్వేది, కోదాడలో ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత శ్రీరామ్వీర్ సింగ్ బిదూరి, తుంగతుర్తిలో హరియాణా ఎంపీ సునీత దుంగల్, భువనగిరిలో జమ్ముకశ్మీర్ మాజీ మంత్రి ప్రియాసేథ్, ఆలేరులో డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయి పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ మద్యం, డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా మారిందని, టీఆర్ఎస్ రావణ పాలనకు ముగింపు పలికి, రామలక్ష్మణ రాజ్యం తెస్తామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఐపీఎస్ అధికారి భారతి ఘోష్ మిర్యాలగూడలో పేర్కొన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి ప్రతిమ భౌమిక్.. దేవరకొండలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ మీనా జాస్కర్.. మునుగోడులో కేరళ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ పీకే కృష్ణదాస్ పర్యటించారు. ఎంపీ రాజ్‌కుమార్ చాహర్ హుజూర్‌నగర్‌లో రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో.. మహబూబ్‌నగర్‌లో ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్‌సింగ్ రావత్ వివిధ మోర్చాల నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇక జడ్చర్లలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, దేవరకద్రలో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్‌షెట్టర్, నారాయణపేటలో విశ్వజిత్ రాణే, గద్వాలలో జమ్మూకశ్మీర్‌కు చెందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆశిష్‌సూద్, అలంపూర్‌లో బిహార్ ఎమ్మెల్యే ప్రేమ్‌కుమార్, వనపర్తిలో యూపీ నేత రాజేశ్ అగర్వాల్, నాగర్‌కర్నూల్‌లో గుజరాత్ మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్‌భాయ్ పటేల్, కొల్లాపూర్‌లో తమిళనాడు మాజీ మంత్రి రాధాకృష్ణన్, కల్వకుర్తిలో ఒడిశా బీజేపీ అధ్యక్షుడు సమీర్ హేమంత్, అచ్చంపేటలో జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ పర్యటించా రు. మక్తల్‌లో కర్ణాటక మాజీ సదానందగౌడ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉమ్మడి వరంగల్‌లో.. మహబూబాబాద్ నియోజకవర్గం కేసముద్రంలో జార్ఖండ్ మాజీ సీఎం బాబులాల్ మరాండి బీజేపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ములుగులో ఉత్తరాఖండ్ మాజీ సీఎం రమేశ్ పోఖ్రియాల్, నర్సంపేటలో యూపీ మంత్రి అనిల్ రాజ్‌భర్, భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లిలో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు ఆదేశ్ కుమార్ గుప్తా, హనుమకొండలో ఎంపీ ఓం ప్రకాష్ మాధుర్, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్లో బీజేపీ జాతీయ కార్యదర్శి ఆశా లక్రా, పాలకుర్తిలో మహారాష్ట్ర నేత లదారామ్, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో పశ్చిమ బెంగాల్ ఎంపీ దేవశ్రీ చౌదరి, జనగామలో బీజేపీ జాతీయ పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శి సుబ్రమణ్యం తదితరులు పర్యటించారు. డోర్నకల్ కూరగాయల మార్కెట్లో వ్యాపారులతో త్రిపుర ఎంపీ రాబాటి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. -
మాతృభాషను వదులుకోవద్దు..
కవాడిగూడ (హైదరాబాద్): మాతృభాష సంరక్షణ కోసం నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. మాతృభాషాదినోత్సవాలు జీవనోత్సవాలు కావాలని.. తల్లి భాష కోసం, తల్లి నేల కోసం ఏ స్థానంలో ఉన్నా మాతృభాషను వదలం అని ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ స్టడీ సర్కిల్లో అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ సభను నిర్వహించారు. తెలుగు భాషా చైతన్య సమితి, తెలుగుకూటమి, తెలంగాణ రచయితల సంఘం, లక్ష్య సాధన ఫౌండేషన్, మహిళా భారతి, గోల్కొండ సాహితీ కళాసమితి, పాలడుగు నాగయ్య కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిదారెడ్డి మాట్లాడుతూ.. చదువు లక్ష్యం నెరవేరినప్పుడే భాష బతుకుతుందని అన్నారు. భాషను బతికించేది ప్రజలు కవులు అని పేర్కొన్నారు. మాతృభాషలో చదివిన వారికి ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. తెలంగాణ రచయిత సంఘం అ«ధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ భాషను పరిరక్షించడానికి మాండలిక నిఘంటువు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజిని దేవి, తెలుగు కూటమి అధ్యక్షుడు కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
సింగపూర్‌లో వైభవంగా సంగీత రాఘవధాన కార్యక్రమం..
సింగపూర్: సింగపూర్ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఆన్లైన్లో ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ గరికపాటి వెంకట ప్రభాకర్ ‘రాగావధానం’కార్యక్రమం జరిగింది. ఇది సుమారు అయిదు గంటల పాటు కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని గరికిపాటి వెంకట ప్రభాకర్, శ్రీమతి పద్మ లలిత దంపతులు జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. దీనికి అమెరికా నుండి చిట్టెన్ రాజు, భారతదేశం నుండి డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ గాయకులు శ్రీ జి ఆనంద్, ప్రఖ్యాత గాయని శ్రీమతి సురేఖ మూర్తి తదితరులు గౌరవ అతిథులుగా హజరయ్యారు. దీనిలో సాహిత్య అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో విద్యాధరి, శేషుకుమారి, సౌభాగ్యలక్ష్మి, షర్మిల, పద్మావతి, స్నిగ్ధ, అనంత్ అనే ఏడుగురు గాయనీ గాయకులు ప్రశ్నలు వేసేవారిలా వ్యవహరించారు. రాధిక మంగిపూడి మాట్లాడుతున్నారు. ప్రశ్నలు అడిగిన పాటలకు అవధాని అప్పటికప్పుడు , అడిగిన రాగాన్ని మార్చాడం, అడిగిన తాళంలో మార్చి పాడటం, రాగమాలికలు, పద్యాలలోని అడిగిన స్వర స్థానాలలో పాడడం, కొన్ని పదాలను విడిచిపెట్టడం, మొత్తానికి ఆసక్తి కరంగా సాగింది. కాగా, అమెరికా, హాంగ్ కాంగ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నార్వే మొదలగు దేశాల నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు. కార్యాక్రమ నిర్వాహకులు శ్రీ కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ. జీవి ప్రభాకర్ గారు కార్యక్రమానికి సంపూర్ణ న్యాయం చేశారని అన్నారు. ఎలాంటి ప్రశ్నలు వేసిన హుందాగా సమాధానం చెప్పారని తెలిపారు. ఇది మొదటి నుంచి ఎంతో వినోదాత్మాకంగా కొనసాగింది. కేవలం అయిదు గంటల్లోనే 2500 మందికిపైగా ప్రజలు ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ద్వారా చూశారని తెలియజేశారు. మొదటి రెండు ఆవృతాలలో త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య సంకీర్తనలతోపాటు సినిమా పాటలు, జానపదాలు, లలిత సంగీతం, దేశభక్తి గీతాలు, పద్యాలు మొదలైన వైవిధ్యభరితమైన అంశాలలో పాటలను ఎంచుకుని ప్రశ్నించేవారు వేరువేరు రాగ తాళాలలో ప్రశ్నలు కురిపించారు. మూడవ ఆవృతంలో రాగ వ్యూహం మరియు తాళ వ్యూహం అనే ప్రక్రియతో అవధాని పాడుతున్న ఒకే పాటకు అందరూ అప్పటికప్పుడు ఒక్కసారిగా వివిధ రాగాలలో తాళాలలో పాడమని ప్రశ్నలు సంధించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే అతిథిగా విచ్చేసిన సురేఖ మూర్తి అప్పటికప్పుడు ఒక కొత్త పాటను ఇచ్చి చంద్రకౌంసు రాగంలో స్వర పరచమని అడుగగా అవధాని వెంటనే ఆ పాటను ఆ రాగంలో స్వరకల్పన చేసి వినిపించారు. శ్రీ జీవి ప్రభాకర్ మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమం చేయగలగడం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందని ఎన్నో విలక్షణమైన ప్రశ్నలకు తాను తృప్తికరంగా సమాధానాలు ఇవ్వగలిగానని పలికి 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' వారికి, అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. ఈ రిమిట్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, జ్యూస్ వారు ఆర్థిక సహాయం అందించారు. అమెరికాలోని యూఎస్ టెలివిజన్ వన్ ఛానల్ వారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. కాగా, దీనికి ఈక్షణం, సింగపూర్ తెలుగు టీవి వారు మీడియా పార్టనర్ గా సహకారం అందించారు . -
కరోనాతో మశూచి టీకా కార్యక్రమాలకు దెబ్బ
ప్యారిస్: కరోనా కారణంగా ఇప్పుడు పిల్లలకు మశూచి టీకా ఇచ్చే కార్యక్రమానికీ విఘాతం కలుగుతోందని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో పిల్లలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువైందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. చాలా దేశాల్లో ఇప్పటికే మశూచి వ్యాధి కేసులు ఎక్కువగా ఉన్నవాటితో కలిపి మొత్తం 24 దేశాల్లో కోవిడ్ కారణంగా టీకా కార్యక్రమాలను నిలిపివేశారని మరో 13 దేశాల్లో వాయిదా వేశారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ చెబుతున్నాయి. కరోనా తరుణంలో రోగ నిరోధక శక్తిని అందించే కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని మీసల్స్ అండ్ రూబెల్లా ఇనిషియేటివ్ స్పష్టం చేసింది. టీకా కార్యక్రమాలను నిలిపివేయడం, వాయిదా వేయడం ప్రపంచవ్యాప్తంగా 11.7 కోట్ల మంది పిల్లలపై ప్రభావం పడనుందని హెచ్చరించింది. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ► నేడు కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన ► మూడో విడత వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం ► నాడు- నేడులో భాగంగా ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన తెలంగాణ ► హైదరాబాద్: నేడు నాంపల్లి కోర్టులో ఉగ్రవాది తుడా కేసు విచారణ ► హైదరాబాద్: హైటెక్స్‌లో నేడు రెండో రోజు బయో ఏషియా సదస్సు ► హైదరాబాద్: ఉదయం 11 గంటలకు కేసీఆర్ ఆధ్యక్షతన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు ► మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లు, కలెక్టర్లకు కేసీఆర్ దిశా నిర్దేశం నగరంలో నేడు ► డ్యాన్స్ ప్రోగాం బై బంగారు తెలంగాణ ఫోక్ అసోసియేషన్ వేదిక: రవీంద్ర భారతి సమయం: ఉదయం 9 గంటలకు ► కంప్యూటర్ క్లాసెస్ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 6 గంటలకు ► ఒడిస్సీ : ది లిటరరీ ఫెస్టివల్ వేదిక: విజ్ఞాన భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( వీబీఐటీ) సమయం: ఉదయం 10 గంటలకు ► యోగా టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ ఆర్‌వైటీ 200 బై యోగా అల్యన్స్ వేదిక: అనాహత యోగా జోన్, కొత్తగూడ సమయం: ఉదయం 11:30 గంటలకు ► ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆండ్ ఎక్స్ పో ఆన్ వాటర్, వేస్ట్ మేనేజ్మెంట్ వేదిక: హోటల్ మనోహర్, బేగంపేట్ సమయం: ఉదయం 10 గంటలకు ► హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ బై వీవర్స్ అసోసియేషన్ వేదిక: ఎన్ఎస్ఐసీ లిమిటెడ్, శ్రీ దత్తసాయి కాంప్లెక్స్, ముషీరాబాద్ సమయం: ఉదయం 11 గంటలకు ► ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్ : ఆస్కార్ నామినేటెడ్ మూవీస్ వేదిక: పీవీఆర్ సినిమాస్, కూకట్పల్లి సమయం: రాత్రి 7:30 గంటలకు ► ప్రత్యక్ష కారణ : ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్‌సిటీ సమయం: ఉదయం 11 గంటలకు ► వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ వేదిక: పార్క్ హయత్, రోడ్ నం.2, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10:30 గంటలకు ► ఫీస్ట్ ఆన్ ది ఏషియన్ గ్రిల్ వేదిక: షెర్టాన్ హైదరాబాద్ హోటల్, గచ్చిబౌలి సమయం: సాయంత్రం 6:30 గంటలకు ► అకాడమీ అవార్డ్స్– 2019 వేదిక: హార్డ్ కప్ కాఫీ, జూబ్లీహిల్స్ సమయం: సాయంత్రం 6 గంటలకు ► ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్‌పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ► చెస్ వర్క్‌షాప్ వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ► జనవరి 9న జగనన్న అమ్మ ఒడి పథకం ప్రారంభం ► చిత్తూరులో అమ్మ ఒడిని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ► ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై చంద్రబాబు నోటి దురుసు ► ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు ► సీనియర్ అధికారిని గాడు అని సంబోధించిన చంద్రబాబు ► దళిత ఐఏఎస్ అధికారిని దుషించడంపై అధికారుల ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ ► నేడు కూడా పింఛన్ల పంపిణీ ► ఇప్పటికే 93 శాతం మందికి అందజేత ఆంధ్రప్రదేశ్ ► నేడు వైఎస్సార్సీపీ విద్యార్ధి, యువజన జేఏసీ సమావేశం తెలంగాణ ► రేపటి నుంచి సమక్క- సారలమ్మ జాతర ► 5న గద్దెలపైకి సారలమ్మ,గోవిందరాజు, పగిడిద్దరాజు ► 6న సమ్మక్క ఆగమనం తెలంగాణ ► కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు ► జోగిపేట, వేములవాడను ఏర్పాటు చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ తెలంగాణ ►యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయానికి అనుబంధం ఉన్న పూర్వగిరి (పాతగుట్ట) వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయం ► బాగ్దాద్‌లో అమెరికా ఆస్తులపై దాడిని ఖండించిన ట్రంప్ ► మరోసారి దాడి చేస్తే గట్టిగా బదలిస్తామని ట్రంప్ హెచ్చరిక ► ఇరాన్‌లోని 52 ముఖ్య ప్రదేశాలను లక్ష్యంగా ఎంచుకున్నామని వెల్లడి స్పోర్ట్స్ ► అండర్-19 ప్రపంచకప్‌లో నేడు భారత్, పాక్ జట్ల మధ్య సేమీఫైనల్ తిరుమల ► నేడు అర్ధరాత్రి 12 గంటల తర్వాత తెరచుకోనున్న వైకుంఠ ద్వారాలు ► రేపు, ఎల్లుండి భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్న టీటీడీ ► నేటి నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు నగరంలో నేడు ► 5 కె రన్ వేదిక : పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ సమయం : ఉదయం. 6.45 గంటలకు ► ప్యానల్ డిస్కషన్ ఆన్ కేన్సర్ ప్రివెన్షన్ వేదిక : ప్రెస్ క్లబ్ సోమాజీగూడ సమయం : మధ్యాహ్నం 1.00 గంటలకు ► గోల్కొండ మాస్టర్స్ 2020 వేదిక : హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సమయం : మధ్యాహ్నం12.30 గంటలకు ► పీబీఎల్2020 : అవార్డు వారియర్స్ వర్సెస్ పూణే 7 యాసెస్ వేదిక : ఇండోర్ స్టేడియం సమయం : రాత్రి 7.00 గంటలకు ► అష్టభుజి ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక : గ్యాలరీ 78 సమయం : ఉదయం 11.00 గంటలకు ►స్పానిష్ క్లాసెస్ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, ► సికింద్రాబాద్ లోని కార్యక్రమాలు సమయం: ఉదయం 9 గంటలకు ► వీణ క్లాసెస్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ► పోయెట్రీ క్లాసెస్ సమయం: ఉదయం 10–30 గంటలకు ►పెయింటింగ్ క్లాసెస్ సమయం: సాయంత్రం 4 గంటలకు ► ట్రెండ్ డిజైనర్ ఎగ్జిబిషన్ వేదిక: తాజ్ కృష్ణ, బంజారాహిల్స్ సమయం: ఉదయం 9 గంటలకు ► క్లాత్ ఎగ్జిబిషన్ వేదిక: సప్తపర్ణి, రోడ్ నం.8, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 6 గంటలకు ► క్రెడాయ్ (సీఆర్‌ఈడీఏఐ) ప్రాపర్టీ షో– 2020 వేదిక: హైటెక్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►కైట్ మేకింగ్ వర్క్‌షాప్ వేదిక: రంగ్‌మంచ్, (డ్యాన్స్ స్కూల్స్), హిమాయత్ నగర్ సమయం: ఉదయం 11 గంటలకు ► కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్ క్లాసెస్ వేదిక: రవీంద్ర భారతి సమయం: రాత్రి 8 గంటలకు ► ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వేదిక: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి సమయం: ఉదయం 10 గంటలకు ► వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్‌లోని కార్యక్రమాలు ► పబ్లిక్ స్పీకింగ్: థింక్ ఆన్ యువర్ ఫీట్ సమయం: మధ్యాహ్నం 2.30 గంటలకు ► చెస్ వర్క్‌షాప్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ► ఫుడ్ ఫెస్టివల్ వేదిక: ది వెస్టర్న్ హైదరాబాద్ మైండ్ స్పేస్ హోటల్, మాదాపూర్ సమయం: రాత్రి 7 గంటలకు ► ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ► అకాడమీ అవార్డ్స్ వేదిక: హార్ట్ కప్ కాఫీ, జూబ్లీహిల్స్ సమయం: సాయంత్రం 6 గంటలకు ► కైట్ మేకింగ్ వర్క్ షాప్ వేదిక : రంగ్ మంచ్ డ్యాన్స్ స్కూల్ సమయం : ఉదయం 5.00 గంటలకు ► తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ 2019 సెషన్ వేదిక : లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియం సమయం : ఉదయం 9.00 గంటలకు ► మహేశ్వరీ, చాండేరీ ఫెస్టివల్ వేదిక : తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సమయం : మధ్యాహ్నం 1.00 గంటలకు ► ఆసియన్ ప్లేట్స్ : మెను ఆఫ్ ట్రేడిషనల్ చైనీస్ డెలికసీస్ వేదిక : చైన్ బిస్ట్రో సమయం : ఉదయం. 10.00 గంటలకు ► థికింగ్ ఆన్ యువర్ పీట్ : పబ్లిక్ స్పీకింగ్ వర్క్‌షాప్ వేదిక : కైట్స్ అండ్ నైన్ ఫిన్‌ఎస్ సమయం : మధ్యాహ్నం 2.30గంటలకు ► వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ వేదిక : పార్క్ హయాత్ హైదరాబాద్ సమయం : ఉదయం. 10.30 గంటలకు ► ఫెస్ట్ ఆన్ ది ఏషియన్ గ్రిల్ వేదిక : షెరటాన్ హైదరాబాద్ హోటల్ సమయం : సాయంత్రం 6.30 గంటలకు ► డీజే నైట్ – వేదిక : ఎయిర్ లైవ్ లంగ్ సమయం : రాత్రి. 7.30 గంటలకు వేదిక : స్టార్ 8 అప్ సమయం : రాత్రి 8 గంటలకు ► హీటన్ ఫుడ్ ఫెస్ట్ వేదిక : ది వెస్ట్రన్ హైదరాబాద్ మైండ్ స్పెస్ సమయం : రాత్రి. 7.00 గంటలకు ► చెస్ వర్క్‌షాప్ వేదిక : కైట్స్ అండ్ నైన్ ఫిన్‌ఎస్ సమయం : రాత్రి. 7.00 గంటలకు ► ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక : దిఆర్ట్ స్పేస్ సమయం : రాత్రి 7.00 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ►ఆంధ్రప్రదేశ్‌లో మరో చారిత్రాత్మక పథకానికి శ్రీకారం ►నేడు జగనన్న "అమ్మఒడి" పథకం ప్రారంభం ►చిత్తూరు లో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ ►ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రకు నేటితో ఏడాది ►2017 నవంబర్ 6న ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ►2019 జనవరి 9న ఇచ్చాపురంలో పుర్తయిన ప్రజా సంకల్ప యాత్ర ►341రోజుల పాటు 3,648కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ తెలంగాణ ►నేడు టీఆర్ఎస్ భవన్లో పార్టీ ఎమ్మేల్యేలు, ఇన్ఛార్జుల భేటీ ►బీ ఫారాల జారీ, గెలుపు వ్యుహాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం ►నేడు జలసౌదలో ఉ.11గంటలకు కృష్ణా వాటర్ బోర్డు సమావేశం ►ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, ఈఎన్సీలు ఇరిగేషన్ అధికారుల భేటీ ►నేడు వింగ్స్ ఇండియా సన్నాహక సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. ►మార్చి 12నుంచి 15 తేదీల్లో బేగంపేట ఎయిర్‌పోర్టులో వింగ్స్ ఇండియా సమావేశాన్ని నిర్వహించనున్నారు జాతీయం ►సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్లాట్‌ఫామ్ ధరలను పెంచిన ద.మ.రైల్వే ►రూ.10 ప్లాట్ ఫామ్ టికెట్ ధర రూ.20 పెంపు భాగ్యనగరంలో నేడు ►కూచిపూడి డ్యాన్స్ ఫర్ఫామెన్స్ వేదిక: రవీంద్ర భారతి సమయం: సాయంత్రం 6 గంటలకు ►ట్యూస్ డే లైవ్ బై పైప్ డ్రీమ్స్ వేదిక: హార్డ్ రాక్ కేఫ్ హైదరాబాద్, రోడ్ నం.1, బంజారాహిల్స్ సమయం: రాత్రి 8 గంటలకు వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ►ఈ మోహినీ అట్టం క్లాసెస్ సమయం: సాయంత్రం 4:30 గంటలకు ►ఈ కరాటే ట్రైనింగ్ క్లాసెస్ సమయం: సాయంత్రం 6 గంటలకు ►యోగా ఫర్ సీనియర్స్ సమయం: ఉదయం 9 గంటలకు ►ఈ హిందీ క్లాసెస్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►ఈ అఫ్రోడబుల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ సమయం: ఉదయం 10 గంటలకు ►మాథ్స్ క్లాసెస్ విత్ మీణా సుబ్రమణ్యం వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 5 గంటలకు ►లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ వేదిక: తాజ్ కృష్ణ, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►6వ ఇంటర్నేషనల్ ఫొటోఫెస్టివల్– 2020 వేదక: సాలర్జంగ్ మ్యూజియం సమయం: ఉదయం 11 గంటలకు వేదిక: హైటెక్స్ ►వరల్డ్మిథాయ్,నాంకీన్,కన్వెన్షన్ఎక్స్ పో సమయం: ఉదయం9 గంటలకు ►ఈ ఫుడ్ షో ఇండియా సమయం: ఉదయం 10 గంటలకు ►ఇండియన్ డెమోక్రసీఎట్ వర్క్ కాన్ఫరెన్స్ వేదిక: ఇండియన స్కూల్ ఆఫ్ బిజినెస్, గచ్చిబౌలి సమయం: ఉదయం 8:30 గంటలకు ►నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►నేషనల్ సిల్క్ ఎక్స్ పో వేదిక: శ్రీ సత్య సాయి నిగమాగమం, గురుస్వామి సెంటర్ సికింద్రాబాద్ సమయం: ఉదయం 11 గంటలకు ►డక్, ది టర్కీ ఫుడ్ ఫెస్టివల్ వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►ఫెంటాస్టిక్ ఫెస్టివల్ : ఖీమా ఫుడ్ ఫెస్టివల్ వేదిక: గ్లోకల్ జంక్షన్, జూబ్లీహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►చెట్టినాడ్ ఫ్లేవర్స్ వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ బై కర్వీ వేదిక: కర్వీ కన్సల్టెన్స్, లిమిటెడ్,రోడ్ నం.1, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►టాలెంట్ హంట్ వేదిక: జోయెస్ ఆర్ట్ గ్యాలరీ, పంజాగుట్ట సమయం: ఉదయం 10 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై అవనీ రావ్ వేదిక: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, రోడ్ నం.12, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్ వేదిక: రామోజీ ఫిల్మ్‌సిటీ సమయం: ఉదయం 10 గంటలకు ►ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వేదిక: ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి సమయం: ఉదయం 11 గంటలకు. -
నేటి ముఖ్యాంశాలు..
తెలంగాణ ► పురపాలక రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తి ► నేడు రిజర్వేషన్లు ఖరారు చేయనున్న ఎన్నికల సంఘం ► బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై రాకపోకలు షురూ! ► ట్రయల్ రన్ నిర్వహించిన సీపీ, మేయర్, ట్రాఫిక్ పోలీసులు ► క్యాట్ ఫలితాలు విడుదల ► వరంగల్ నిట్ విద్యార్థులకు అత్యుత్తమ మార్కులు ఆంధ్రప్రదేశ్ ► ఆపరేషన్ మస్కాన్లో 3,636 మంది బాలల గుర్తింపు ► 3,039 మంది బాలురు, 597 మంది బాలికలను రక్షించిన పోలీసులు ► నేడు కూడా తనిఖీలు ► ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు ►రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ► నేడు అఖిల భారత సైనిక పాఠశాల 2020-2021 ప్రవేశ పరీక్ష ► నేడు అర్ధరాత్రి తర్వాత తెరచుకోనున్న వైకుంఠ ద్వారాలు ► రేపు, ఎల్లుండి భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్న టీటీడీ ► నేటి నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు ► శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ జాతీయం ► జేఈఈ మెయిన్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్టీఏ ► రేపటి నుంచి ఈ నెల 11 వరకు ► ప్రతి సబ్జెక్టులో 25 ప్రశ్నలకే పరీక్ష, 20 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ ► న్యూమరికల్ వ్యాల్యూ సబ్జెక్టుకు ఐదు ప్రశ్నలు స్పోర్ట్స్ ► నేడు గువాహటిలో శ్రీలంకతో భారత్ తొలి టి20 మ్యాచ్ ► రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-1 లో ప్రత్యక్ష ప్రసారం అంతర్జాతీయం ► ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భారత్ రాక వాయిదా నగరంలో నేడు ► ఇడియట్స్ – మరాఠీ ప్లే వేదిక– రవీంద్ర భారతి సమయం– ఉదయం 10 గంటలకు ► స్వర్ణయుగ మహానటి పురస్కారం బై వంశీ ఇంటర్నేషనల్ వేదిక– త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి సమయం– మధ్యాహ్నం 12 గంటలకు ► ధ్యానోత్సవం వేదిక– లక్ష్మీనరసింహ కళ్యాణ మండపం, సన్‌సిటీ (అందరూ ఆహ్వానితులే) సమయం– సాయంత్రం 6 గంటలకు, ► సండే ఆర్గానిక్ ఎర్త్ మేళా వేదిక– సప్తపర్ణి, బంజారాహిల్స్ సమయం– ఉదయం 10 గంటలకు వేదిక– అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ►ఫ్లూట్ క్లాసెస్ బై శషాంక్ రమేష్ సమయం– ఉదయం 11 గంటలకు ► క్రొచెట్, ఎంబ్రాయిడరీ రెగ్యులర్ క్లాసెస్ సమయం– ఉదయం 10గం. ►ఫ్రీ యోగా క్లాసెస్ సమయం– ఉదయం 11గం. ►పెయింటింగ్ క్లాసెస్ సమయం– మధ్యాహ్నం 1 గం. ►వీకెండ్ చెస్ క్లాసెస్ సమయం– ఉదయం 10 గంటలకు ►ఫ్యాబ్రిక్ జ్యువెల్లరీ వర్క్‌షాప్ సమయం– ఉదయం 11 గంటలకు ►లాటిన్ డ్యాన్స్ క్లాసెస్ సమయం– సాయంత్రం 6 గంటలకు ►స్పానిష్ క్లాసెస్ సమయం– ఉదయం 9 గంటలకు ►వీణ క్లాసెస్ సమయం– మధ్యాహ్నం 3 గంటలకు ►పోయెట్రీ క్లాసెస్ సమయం– ఉదయం 10–30 గంటలకు ►మిస్, మిస్టర్ ఆఫ్ హైదరాబాద్ ఫ్యాషన్ షో వేదిక–హోటల్కంఫోటల్, బంజారాహిల్స్ సమయం– ఉదయం 10 గంటలకు ►ఆటగదరా శివ – మ్యూజిక్ కాన్సర్ట్ బై తనికెళ్ల భరణి వేదిక– శిల్పకళావేదిక సమయం– సాయంత్రం 6 గంటలకు వేదిక– శిల్పారామంలోని కార్యక్రమాలు ► భరతనాట్యం రెక్టికల్ బై కుసుమ సమయం– సాయంత్రం 5 గంటలకు ►కూచిపూడి బై వికాస్ నాట్యమండలి సమయం– సాయంత్రం 5 గంటలకు ►ఆల్ ఇండియా క్రాఫ్టకస్ మేళ సమయం– సాయంత్రం 5 గంటలకు ►ది పంఖ్ ఫెస్టివల్ 2020 వేదిక– ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ సమయం– మధ్యాహ్నం 3 గంటలకు ►సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక– లాల్ బహదూర్ స్టేడియం సమయం– రాత్రి 7 గంటలకు ►ఇండియా మెడ్ ఎక్స్ పో వేదిక– హైటెక్స్ సమయం– ఉదయం 10 గంటలకు ►6వ ఇంటర్నేషనల్ ఫొటో ఫెస్టివల్ 2020 వేదిక– సాలార్జంగ్ మ్యూజియం సమయం– ఉదయం 10–30 గంటలకు ►నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక– గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్ సమయం– ఉదయం 11 గంటలకు ►ఫెంటాస్టిక్ ఫెస్టివ్ – ఖీమా ఫుడ్ ఫెస్టివల్ వేదిక– గ్లోకల్ జంక్షన్, జూబ్లీహిల్స్ సమయం– మధ్యాహ్నం 12 గంటలకు ►డక్, ది టర్కీ ఫుడ్ ఫెస్టివల్ వేదిక– చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్ సమయం– మధ్యాహ్నం 12 గంటలకు ►టాలెంట్ హంట్ వేదిక– జోయెస్ ఆర్ట్ గ్యాలరీ, పంజాగుట్ట సమయం– ఉదయం 10 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై అవనీ రావ్ వేదిక–ఐకాన్‌ఆర్ట్ గ్యాలరీ, రోడ్ నం.12, బంజారాహిల్స్ సమయం– ఉదయం 11 గంటలకు. -
శ్రావ్యంగా సాగిన మధురగీతం జాకబ్ సన్!!
తెలుగు క్రైస్తవలోకంలో ఎన్నో ఏళ్లపాటు తనదైన ముద్ర కలిగిన ఎంతో శ్రావ్యమైన క్రైస్తవ భక్తి సంగీత బాణీలతో విశ్వాసులను ఎంతో అలరించి కాంతులీనిన క్రైస్తవ సంగీత దర్శకుడు ఎం.డి.జాకబ్ సన్ అనే ఒక అద్భుతమైన తార కనుమరుగైంది. కొంతకాలంగా అనారోగ్యంగా ఉండి, 67 ఏళ్ళ వయసులో ఇటీవలే ఆయన కన్ను మూశారు. ఆయనకు భార్య రోసెలిన్, ఇద్దరు కూతుళ్లు సునయన, కత్రీనా ఉన్నారు. క్రైస్తవలోకంలో ఈ రోజున గొప్ప గాయకులుగా, సంగీత వాద్యకారులుగా ఉన్న చాలామంది జాకబ్ సన్ చేతిలోనే శిక్షణనొంది, ఆయన బాణీలద్వారానే పేరు పొందారు. ఆయన 1978 నుండి, 1980, 1990 దశకాల్లో ‘విశ్వవాణి’ అనే అద్భుతమైన క్రైస్తవ రేడియో కార్యక్రమాలకు చేసిన సంగీత పరిచర్య చిరస్మరణీయమైనది. అప్పట్లో పల్లెటూళ్లలో ఉన్నవాళ్లకు విశ్వవాణి కార్యక్రమంతోనే తెల్లవారేది, మళ్ళీ విశ్వవాణి కార్యక్రమంతోనే రాత్రయ్యేది. ఆ రోజుల్లో విశ్వవాణి రేడియో కార్యక్రమంలో దైవజనులు ఆరార్కే మూర్తి ప్రసంగం జనహృదయాలకు ఎంతగా హత్తుకునేదో, జాకబ్ సన్ పాటలు కూడా అంతే జనరంజకంగా ఉండేవి. ఆ తరాల తెలుగు క్రైస్తవులకు జాకబ్ సన్ ఒక సెలెబ్రిటీ!! ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెదధన్వాడ గ్రామానికి చెందిన జాకబ్ సన్ మహబూబ్ నగర్లో డిగ్రీ చదువుతున్నపుడు పెట్కార్ గారనే ఇంగ్లీష్ మిషనేరీ గారు. ఆరార్కే మూర్తి అనే దైవజనులు ఆయనలోని సంగీత ప్రతిభను గుర్తించి హైదరాబాద్‌లో తాము కొల్పిన ‘దేవుడు మాట్లాడాడు’ అనే స్టూడియోకు తీసుకొచ్చి తమ సంస్థ నిర్మించి, ప్రసారం చేస్తున్న తెలుగు క్రైస్తవ కార్యక్రమాలకు సంగీత దర్శకుడుగా నియమించారు. అదే కాలక్రమంలో విశ్వవాణి అనే పేరుతో ప్రాబల్యం పొందింది. అలా ఆరంభమైన జాకబ్ సన్ సంగీతపరిచర్య ద్వారా తెలుగు రాష్ట్రంలోని ఎందరో గాయకులూ, సంగీతకారులకు ఆయన స్టూడియోలో పాడి, వాయించి, అలా తెలుగు క్రైస్తవుల మన్నన పొందే ఆధిక్యత లభించింది. ‘దేవా నా దేవా’, ‘నా హృదయ సీమలో’, ‘దేవా నీవే నా ..’, ‘నే పాపినో ప్రభువా’, ‘దేవుని ఉపకారములలోన’, ‘ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు’ వంటి కబ్ సన్ బాణీ, సంగీతం కూర్చిన పాటలు, ఆ రోజుల్లో క్రెస్తవ చర్చిలు, విశ్వాసుల నాలుకలపై ఆడి, దైవికంగా మధురానుభూతులను పంచాయి. ఆయన సంగీతంలో, బాణీల్లో విశిష్టత ఏమిటంటే, అవి నేరుగా విశ్వాసి హృదయాన్ని తాకి మరో లోకంలోకి తీసుకెళ్తాయి. చాలా సాధారణమైన ఆ బాణీలు, ప్రజల్లోకి సునాయాసంగా వెళ్లి వాళ్లంతా హాయిగా పాడుకునేలా చేస్తాయి. ఆయన బాణీల్లో శ్రావ్యతే ప్రాధాన్యంగా ఉంటుంది. ఇంత గొప్ప ప్రతిభావంతుడైనా, అతిశయం, అహంకారమనేది ఆయనకసలు తెలియదు. ఎంతో నిరాడంబరంగా, వివాదాలకు దూరంగా, మృదుభాషిగా అందరిపట్లా స్నేహభావంతో మెలిగాడాయన. ఎంతోమంది అనామకులైన అతి సాధారణ గాయకులూ కూడా, ఆయన సంగీతం, ఆయన బాణీల్లోని విశిష్టత వల్ల గొప్ప గాయకులుగా పేరు ప్రతిష్టలు పేరొందారు. అందరితో కలిసిమెలిసి, ఆడుతూ, పాడుతూ, హాస్యోక్తులు వేస్తూ, తాను నవ్వుతూ అందరినీ నవ్వించడమే తప్ప ఎప్పుడూ ఎవర్నీ ఆయన నొప్పించిన సందర్భమే లేదు. సంగీతం, పాటలే తన లోకంగా బతికాడాయన. గోరంత ప్రతిభకు, తమ సొంత ‘మార్కెటింగ్ తెలివితేటలు’ జోడించి చూస్తుండగానే ఎంతో ఎత్తుకు ఆయన పరిచయం చేసిన అతి సాధారణ గాయకులు, సంగీతకారులే ఎదిగిపోయినా, ఎన్నడూ ఆయన వ్యసనపడలేదు. ఎంతటి పరిస్థితుల్లోనైనా తాను నొచ్చుకోకుండా, ఎవరినీ నొప్పించకుండా ఉండడానికే ప్రయత్నించేవాడే తప్ప, ధనార్జన పైన, పేరు సంపాదించడం పైన ఎన్నడూ దృష్టిపెట్టినవాడు కాదాయన. ప్రతి పరిస్థితిలోనూ, ఎంతో గుంభనంగా, నిండుగా జీవించాడు జాకబ్ సన్. జీవితమే క్రైస్తవ స్ఫూర్తితో సాగిన ఒక శ్రావ్యమైన సంగీత బాణీ జాకబ్ సన్!! అసూయకు, విమర్శలకు, వివాదాలకు తావివ్వని అసమానమైన విశ్వాసి ఆయన. తెలుగు క్రైస్తవ భక్తి సంగీత ప్రపంచంలో కొన్ని మైలు రాళ్ళ మీద ఆయన పేరు తప్పకుండా ఉంటుంది. శ్రావ్యమైన సంగీతంతో విలసిల్లే పరలోకంలో జాకబ్ సన్ తప్పక మరింత సంతోషంగా, ఆనందంగా ఉంటాడని సువార్తికుల విశ్వాసం. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ prabhukirant@gmail.com -
నేటి ముఖ్యాంశాలు..
తెలంగాణ: ►నేడు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జేఏసీ ధర్నా ►ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు అనుమతించిన పోలీసులు ►ధర్నాలో వెయ్యి మంది పాల్గొనే అవకాశం ►మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో నేడు టీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం భాగ్యనగరంలో నేడు ►టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆత్మీయ సన్మానం సమయం : సాయంత్రం 4 గంటలకు వేదిక: జలవిహార్, నెక్లెస్‌రోడ్ ►గోల్కొండ ఫోర్ట్– ది మాన్యుమెంట్ సమయం : ఉదయం 5.30 గంటలకు వేదిక : గోల్కొండ ఫోర్డ్, హైదరాబాద్ ►రోడ్ మ్యాప్– 2020 సమయం : ఉదయం 5.30 గంటలకు వేదిక : టీఎస్ఐఐసీ పార్క్, హైటెక్ సిటీ ►హాఫ్ డే వర్క్‌షాప్ ఆన్ లెర్నింగ్ డిజబిలిటీస్ సమయం : ఉదయం 9.00 గంటలకు వేదిక : పారామౌంట్ హిల్స్, జూబ్లీహిల్స్ ►దర్బార్ ఫ్రీ రిలీజ్ సమయం : సాయంత్రం 6 గంటలకు వేదిక : శిల్పారామం, మాదాపూర్ ►వివేక్ మురళీధరన్ లైవ్ సమయం : ఉదయం 5.30 గంటలకు వేదిక : టీఎస్ఐఐసీ పార్క్. హైటెక్ సిటీ ►లాట్ ఒన్ డే వర్క్‌షాప్ సమయం : మధ్యాహ్నం 4.30 గంటలకు వేదిక:యురేకాకోర్ట్ కాంప్లెక్స్,అమీర్‌పేట. ►కవరేజ్ 2020 సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు వేదిక : కత్రియ హోటల్, సోమాజీగూడ ►క్యామెడీ జంక్షన్ సమయం : రాత్రి 7.00 గంటలకు వేదిక : వెంకటగిరి, జూబ్లీహిల్స్ ►పబ్లిక్ స్పీకింగ్ ఫర్ చిల్డ్రన్స్ సమయం : సాయంత్రం 5.00 గంటలకు వేదిక : మజీద్ బండ, కొండాపూర్ ►బిజినెన్ మీట్ టు మేక్ యువర్సెల్ఫ్ నెట్‌వర్త్ సమయం : ఉదయం 8.30 గంటలకు వేదిక : బంజారాహిల్స్,హైదరాబాద్. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ►నేడు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన ►ఏలూరులో వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం ►ఉదయం తాడెపల్లి నుంచి బయలుదేరనున్న జగన్ ►విజయవాడ స్వరాజ్య మైదానంలో నేటి నుంచి 31వ పుస్తక మహోత్సవం ప్రారంభం ►సాయంత్రం పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించనున్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ►ఈ నెల 12 వరకు జరగనున్న పుస్తక మహోత్సవం ►నెల్లూరు: నేటి నుంచి నెల్లూరులో ఫ్లెమింగో ఫెస్టివల్ జాతీయం: ►నేడు కేంద్ర కెబినెట్ భేటీ ►ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం ►కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై శాఖల వారిగా సమీక్ష ►కర్నాటక: నేడు కర్నాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తెలంగాణ ►ఆదిలాబాద్: నేడు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో సమతా కేసు విచారణ ►ముగ్గురు నిందుతులను విచారించనున్న ధర్మాసనం భాగ్యనగరంలో నేడు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై మనోహర్ చిలువేరు వేదిక: అల్యన్స్ ఫ్రాంఛైజ్, రోడ్ నం.3, బంజారాహిల్స్ సమయం: ఉదయం 9:30 గంటలకు ►6వ ఇంటర్నేషనల్ ఫొటోఫెస్టివల్– 2020 వేదిక: సాలర్జంగ్ మ్యూజియం సమయం: ఉదయం 10:30 గంటలకు ►నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ►అఫ్రోడబుల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ సమయం: ఉదయం 10 గంటలకు ►చెస్ క్లాసెస్ సమయం: ఉదయం 10 గంటలకు ►హిందీ క్లాసెస్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►ఫెంటాస్టిక్ ఫెస్టివ్ : ఖీమా ఫుడ్ ఫెస్టివల్ వేదిక: గోల్కొండ జంక్షన్, జూబ్లీహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►డక్ టర్కీ ఫీస్ట్ : ఫుడ్ ఫెస్టివల్ వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►చెట్టినాడ్ ఫ్లేవర్స్ : లంచ్ అండ్ డిన్నర్ వేదిక: దక్షిణ్(ఐటీసీ కాకతీయ),బేగంపేట్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా వేదిక: శిల్పారామం సమయం: సాయంత్రం 5 గంటలకు ►టాలెంట్ హంట్ : ఎ నేషనల్ ఎగ్జిబిషన్ వేదిక: జోయెస్ ఆర్ట్ గ్యాలరీ, పంజాగుట్ట సమయం: ఉదయం 10 గంటలకు ►లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్ వేదిక: రామోజీ ఫిల్మ్ సిటీ సమయం: ఉదయం 9 గంటలకు ►తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ వేదిక: లాల్ బహదూర్ స్టేడియం సమయం: ఉదయం 10 గంటలకు ►5వ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ 2020 వేదిక జీఎంసీ బాలయోగి స్టేడియం,గచ్చిబౌలి సమయం ఉదయం 10–30 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► నేటి నుంచి రైతు భరోసా తుది విడత చెల్లింపులు ► రూ. 1,082 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ► రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసేందుకు వ్యవసాయశాఖ సన్నద్ధం ► సచివాలయల్లో రేపట్నుంచి లబ్ధిదారుల జాబితా ► నేడు సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం వైఎస్ జగన్ తెలంగాణ ► నేటి నుంచి తెలంగాణలో రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమం ► 11 రోజుల పాటు కొనసాగనున్న పల్లెప్రగతి కార్యక్రమం ► పచ్చదనం- పరిశుభ్రతకు ప్రాధాన్యత ► నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి పర్యటన ► పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు హైదరాబాద్: ► రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను.. ► ప్రకటించడంపై నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న కాంగ్రెస్ ► నీట్ దరఖాస్తు పొడిగింపు ► ఈ నెల 6 వరకు అవకాశం ► పరీక్ష తేదిల్లో ఎలాంటి మార్పులేదు జాతీయం: ► వచ్చే ఏడాది చంద్రయాన్-3 ► కీలక ప్రకటన చేసిన ఇస్రో చైర్మన్ కె.శివన్ ► ప్రధాని మోదీ విద్యార్థులతో నిర్వహించే ‘ పరీక్ష పే చర్చ’ ఈ నెల 20న జరగనుంది. అంతర్జాతీయం: ► కొత్త వ్యూహాత్మక ఆయుధం ► త్వరలో ప్రంపంచానికి చూపుతానన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ నగరంలో నేడు ► వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్పల్లి ⇒ సావిత్రిభాయ్ పూలే అవార్డుల ప్రదానం సమయం: సాయంత్రం 6 గంటలకు ⇒ నివేదిత సంక్రాంతి పురస్కారం సమయం: సాయంత్రం 4:30 గంటలకు ► వేదిక: అవర్ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్ ⇒ మోహినీ అట్టం క్లాసెస్ సమయం: సాయంత్రం 4:30 గంటలకు ⇒ కరాటే ట్రైనింగ్ క్లాసెస్ సమయం: సాయంత్రం 6 గంటలకు ⇒ చెస్ క్లాసెస్ సమయం: ఉదయం 10 గంటలకు ⇒ హిందీ క్లాసెస్ సమయం: సాయంత్రం 4 గంటలకు ⇒ యోగా ఫర్ సీనియర్స్ సమయం: ఉదయం 9 గంటలకు ⇒ అఫ్రోడబుల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ సమయం: ఉదయం 10 గంటలకు ► మాథ్స్ క్లాసెస్ విత్ మీణా సుబ్రమణ్యం వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, వెస్ట్ మారేడ్ పల్లి సమయం: సాయంత్రం 5 గంటలకు ► సిల్క్ ఆండ్ కాటన్ ఎక్స్ పో : ఎగ్జిబిషన్ ఆండ్ సేల్ వేదిక: సత్యసాయి నిగమాగమం, శ్రీనగర్ కాలనీ సమయం: ఉదయం 11 గంటలకు ► ఆర్ట్ ఎగ్జిబిషన్ బై మనోహర్ చిలువేరు వేదిక: అల్యన్స్ ఫ్రాంఛైజ్, రోడ్ నం.3, బంజారాహిల్స్ సమయం: ఉదయం 9:30 గంటలకు ► 6వ ఇంటర్నేషనల్ ఫొటో ఫెస్టివల్ 2020 వేదిక: సాలర్జంగ్ మ్యూజియం సమయం: ఉదయం 10:30 గంటలకు ► నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ► ఫెంటాస్టిక్ ఫెస్టివ్ : ఖీమా ఫుడ్ ఫెస్టివల్ వేదిక: గోల్కొండ జంక్షన్, జూబ్లీహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ► డక్ టర్కీ ఫీస్ట్ : ఫుడ్ ఫెస్టివల్ వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ► చెట్టినాడ్ ఫ్లేవర్స్ : లంచ్ ఆండ్ డిన్నెర్ వేదిక: దక్షిణ్(ఐటీసీ కాకతీయ), బేగంపేట్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ► ఆల్ ఇండియా క్రాఫ్టస్ మేళా వేదిక: శిల్పారామం సమయం: సాయంత్రం 5 గంటలకు ► టాలెంట్ హంట్ : ఎ నేషనల్ ఎగ్జిబిషన్ వేదిక: జోయెస్ ఆర్ట్ గ్యాలరీ, పంజాగుట్ట సమయం: ఉదయం 10 గంటలకు ► లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్ వేదిక: రామోజీ ఫిల్మ్ సిటీ సమయం: ఉదయం 9 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
తెలంగాణ ⇒ కొత్త సీఎస్‌గా సోమేశ్‌కుమార్ ⇒ నియామక పత్రంపై సీఎం కేసీఆర్ సంతకం ⇒ ప్రభుత్వ సలహాదారుడిగా ఎస్కే జోషి ⇒ నేడు తేలికపాటి వర్షాలు ⇒ రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ⇒ గురువారం కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ⇒ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బుధవారం నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ⇒ ఆర్టీసీ కార్మికుల కల సాకారం ⇒ నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా 51,488మంది ఏపీ ఆర్టీసీ సిబ్బంది. ⇒ పాదయాత్ర హామీ మేరకు ప్రభుత్వంలో విలీనం చేసిన ముఖ్యమంతి వైఎస్ జగన్ ⇒ శ్రీవారి భక్తులకు ఉచిత లడ్డూ ⇒ వైకుంఠ ఏకాదశి నుంచి శ్రీకారం ⇒ ఒక్కొక్కటి రూ. 50 చొప్పున ఎన్ని లడ్డూలైనా పంపిణీ జాతీయం ⇒ పెరిగిన రైల్వే చార్జీలు ⇒ కొత్త సంవత్సర ప్రారంభ రోజు నుంచే రైలు చార్జీలను పెంచనున్నట్లు రైల్వే శాఖప్రకటించింది. ⇒ దేశ 28వ సైనిక దళాధిపతిగా జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే బాధ్యతలు స్వీకరించారు. ⇒పదవీ విరమణ చేసిన జనరల్ బిపిన్ రావత్ ⇒ జమ్మూకశ్మీర్‌లో టోల్ ట్యాక్స్ రద్దు అంతర్జాతీయం ► ఇరాక్‌లో యూస్ ఎంబసీపై దాడి స్పోర్ట్స్ ⇒ సానియా మీర్జా మళ్లీ బరిలోకి దిగేందుకు రాకెట్ పట్టారు. ⇒ హోబర్ట్ ఓపెన్‌తో పునరాగమనం ⇒ రెండేళ్ల తర్వాత బరిలోకి నగరంలో నేడు ► తిరుమల శ్రీనివాసచార్య 83 వ జన్మదినోత్సవ సందర్భంగా ఆయన రచించిన గ్రంథాల ఆవిష్కరణ : అంకితోత్సవం ⇒ వ్యాస భారతి (వ్యాస సంపుటి) ⇒ సతీస్మృతి (రుబాయి కావ్యం) ⇒ స్నేహ సుధ (రుబాయి కావ్యం) వేదిక: రవీంద్రభారతి సమయం: సాయంత్రం 6 గంటలకు ► వేదిక: అల్యన్స్ ఫ్రాంఛైజ్,బంజారాహిల్స్ ⇒ స్టాండప్ కామెడీ సమయం: సాయంత్రం 6 గంటలకు ⇒ ఆర్ట్ ఎగ్జిబిషన్ సమయం: ఉదయం 9–30 గంటలకు ► న్యూ ఇయర్ ఈవెంట్ విత్ డీజే ఆర్జే వేదిక: కంట్రీ క్లబ్, బేగంపేట్ సమయం: రాత్రి 8 గంటలకు ► వేదిక: అవర్‌సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ఠి లేడీస్ కిట్టీ పార్టీ సమయం: ఉదయం 10 గంటలకు ⇒యోగా ఫర్ సీనియర్స్ వర్క్‌షాప్ సమయం: ఉదయం 9 గంటలకు ⇒అఫ్రోడబుల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ సమయం: ఉదయం 10 గంటలకు ► ఎన్‌వైఈ 2020 వేదిక: సంధ్య కన్వెన్షన్ బై నిమంత్రన్, గచ్చిబౌలి సమయం: రాత్రి 8 గంటలకు ► న్యూ ఇయర్ ఈవెంట్ విత్ రాహుల్ సిప్లిగంజ్ వేదిక: సమ్మర్ గ్రీన్ రిసార్ట్, శామీర్‌పేట్ సమయం: రాత్రి 8 గంటలకు ► న్యూ ఇయర్ కార్నివాల్ విత్ డీజే అభి, మోహిత్ వేదిక: హార్ట్ కప్ కాఫీ, జూబ్లీహిల్స్ సమయం: రాత్రి 8 గంటలకు ► వేదిక: చైనాబిస్ట్రో,రోడ్‌నం.1, జూబ్లీహిల్స్ ⇒ న్యూ ఇయర్ బఫెట్ సమయం: సాయంత్రం 5:30 గంటలకు ⇒ డక్ టర్కీ ఫుడ్ ఫెస్టివల్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ► పక్కా హైదరాబాద్ – బిగ్గెస్ట్ షాపింగ్ కార్నివాల్ వేదిక: పీపుల్స్ ప్లాజా, ఖైరాతాబాద్ సమయం: ఉదయం 11 గంటలకు ► సిల్క్ కాటన్ ఎక్స్ పో, ఎగ్జిబిషన్ ఆండ్ సేల్ వేదిక: శ్రీ సత్య సాయి నిగమాగమం, శ్రీ నగర్ కాలనీ సమయం: ఉదయం 11 గంటలకు ► స్టేట్ లెవల్ ఇంజినీరింగ్ ప్రీమియర్ లీగ్ వేదిక: సీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సికింద్రాబాద్ సమయం: ఉదయం 8 గంటలకు ► నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: గ్యాలరీ స్పేస్, రోడ్ నం.12, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ► ఫెంటాస్టిక్ ఫెస్టివ్ : కీమా ఫుడ్ ఫెస్టివల్ వేదిక: గ్లోకల్ జంక్షన్, జూబ్లీహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ► చెట్టినాడ్ ఫ్లేవర్స్ – లంచ్ ఆండ్ డిన్నర్ వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ► ఆల్ ఇండియా క్రాప్ట్స్ మేళా వేదిక: శిల్పారామం సమయం: సాయంత్రం 5 గంటలకు ► టాలెంట్ హంట్ – ఎ నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఎమెర్జింగ్ ఇండియన్ ఆర్టిస్ట్స్ వేదిక: జోయెస్ ఆర్ట్ గ్యాలరీ, రోడ్ నం.13, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ► లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్ వేదిక: రామోజీ ఫిల్మ్ సిటీ సమయం: ఉదయం 9 గంటలకు. -
నేటి ముఖ్యాంశాలు..
తెలంగాణ హైదరాబాద్ ►న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నేడు రాత్రి ట్రాఫిక్ ఆంక్షలు ►హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు ►నేడు రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు ఆంక్షలు విధింపు ►ఓఆర్ఆర్పై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ►లైట్ మోటార్ వాహనాలకు అనుమతి నిరాకరణ ►పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరణ ⇒ నేటితో ముగియనున్న తెలంగాణ సీఎస్ పదవీకాలం ⇒ పదవీ విరమణ చేయనున్న ఎస్కే జోషి ⇒ సీఎస్ రేసులో అజయ్ మిశ్రా, సోమేష్ కుమార్ పేర్లు ⇒ మధ్యాహ్నం కొత్త సీఎస్‌ను ప్రకటించనున్న ప్రభుత్వం ► నేటితో తెలంగాణలో ముగియనున్న ఇంటర్ పరీక్ష ఫీజు గడువు ► మర్చి4 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం ► మర్చి 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ సెకండియర్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్: ⇒ నేడు విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటన ⇒ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూఇయర్ వేడుకలు ⇒నేడు రాత్రి 7.40కి న్యూఇయర్ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ జాతీయం: ⇒ ఢిల్లీ: నేడు ఆర్మీ చీఫ్‌గా రిటైర్ కానున్న బిపిన్ రావత్ ⇒ దేశ మొట్టమొదటి రక్షణ బలగాల అధిపతిగా జనరల్ బిపిన్ రావత్‌ను కేంద్రప్రభుత్వం నియమించింది. ⇒ ఈ నిమామకం డిసెంబర్31( నేటి) నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ⇒ పాన్ కార్డుతో ఆధార్ లింక్ గడువు పొడిగింపు ⇒ 2020 మర్చి వరకు గడువు పొడిగించిన కేంద్రం హైదరాబాద్: ⇒ న్యూఇయర్ సందర్భంగా మెట్రో ప్రత్యేక సర్వీసులు ⇒ నేడు రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సేవలు ⇒ మద్యం సేవించిన వారికి మెట్రోలో అనుమతి ⇒ ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని మెట్రో అధికారుల సూచన ⇒ నేడు నాంపల్లి ఎగ్జిబిషన్‌పై హైకోర్టులో విచారణ ⇒ పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించనున్న ఎగ్జిబిషన్ నిర్వాహకులు ⇒ న్యూఇయర్ సందర్భంగా ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు ⇒ అర్ధరాత్రి 1.15కి లింగంపల్లి- హైదరాబాద్ ఎంఎంటీఎస్ ⇒ అర్ధరాత్రి 1.30కి లింగంపల్లి- ఫలక్‌నుమ ఎంఎంటీఎస్ ⇒నేడు గవర్నర్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు ⇒తిరంగ ర్యాలీ అనుమతివ్వలేదని ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ నగరంలో నేడు ⇒ కళామిత్ర పురస్కారాలు వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ,చిక్కడపల్లి సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ⇒ డ్యాన్స్ ఆఫ్ ది డికేడ్ : న్యూ ఇయర్ సెలబ్రేషన్ వేదిక: తాజ్ డక్కన్, బంజారాహిల్స్ సమయం: రాత్రి 8 గంటలకు ⇒ ట్యూస్ డే కార్పొరేట్ నైట్ వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్, బేగంపేట్ సమయం: రాత్రి 8 గంటలకు ⇒వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ లోని కార్యక్రమాలు ⇒ మోహిని అట్టం క్లాసెస్ సమయం: సాయంత్రం 4:30 గంటలకు ⇒ కరాటే క్లాసెస్ సమయం: సాయంత్రం 6 గంటలకు ⇒ యోగా ఫర్ సీనియర్స్ సమయం: ఉదయం 9 గంటలకు ⇒ వేదిక: శిల్పారామంలోని కార్యక్రమాలు ⇒ కూచిపూడి డ్యాన్స్ రెక్టికల్ సమయం: సాయంత్రం 5 గంటలకు ⇒ భరత నాట్యం డ్యాన్స్ రెక్టికల్ సమయం: సాయంత్రం 6 గంటలకు ⇒ టేస్ట్స్ ఆఫ్ ఇండియా ఫుడ్ ఫెస్టివల్ వేదిక: హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, బంజారాహిల్స్ సమయం: రాత్రి 7–30 గంటలకు ⇒ ఫెస్టివ్ సీజన్ ఫుడ్ ఫెస్టివల్ వేదిక: మరియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ⇒ నేషనల్ బుక్ ఫెయిర్ వేదిక: ఎన్టీఆర్ స్టేడియం సమయం: ఉదయం 10 గంటలకు ⇒ వింటర్ షాపింగ్ ఎగ్జిబిషన్ ఆండ్ సేల్ వేదిక: ప్రసాద్ మల్టీప్లెక్స్, సమయం: ఉదయం 11 గంటలకు ⇒ ఈవెనింగ్ బఫెట్ వేదిక: లియోన్య హోలిస్టిక్ డెస్టినేషన్, శామీర్‌పేట్ సమయం: రాత్రి 7–30 గంటలకు ⇒ పక్కా హైదరాబాద్ – బిగ్గెస్ట్ షాపింగ్ కార్నివాల్ వేదిక: పీపుల్స్ ప్లాజా, ఖైరాతాబాద్ సమయం: ఉదయం 11 గంటలకు ⇒ సిల్క్ కాటన్ ఎక్స్ పో, ఎగ్జిబిషన్ ఆండ్ సేల్ వేదిక: శ్రీ సత్య సాయి నిగమాగమం,శ్రీ నగర్ కాలనీ సమయం: ఉదయం 11 గంటలకు ⇒ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: అల్యన్స్ ఫ్రాంఛైజ్, రోడ్ నం.3, బంజారాహిల్స్ సమయం: ఉదయం 9–30 గంటలకు ⇒ స్టేట్ లెవల్ ఇంజినీరింగ్ ప్రీమియర్ లీగ్ వేదిక: సీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సికింద్రాబాద్ సమయం:ఉదయం 8 గంటలకు ⇒ నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: గ్యాలరీ స్పేస్, రోడ్ నం.12, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ⇒ అఫ్రోడబుల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్,సికింద్రాబాద్ సమయం: ఉదయం 10 గంటలకు ⇒ కీమా ఫుడ్ ఫెస్టివల్ వేదిక: గ్లోకల్ జంక్షన్,జూబ్లీహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ⇒ డక్ టర్కీ ఫుడ్ ఫెస్టివల్ వేదిక: చైనా బిస్ట్రో, రోడ్ నం.1, జూబ్లీహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ⇒ చెట్టినాడ్ ఫ్లేవర్స్ – లంచ్ ఆండ్ డిన్నెర్ వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ⇒ ఆల్ ఇండియా క్రాఫ్టస్ మేళా వేదిక: శిల్పారామం సమయం: సాయంత్రం 5 గంటలకు ⇒ టాలెంట్ హంట్ – నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఎమెర్జింగ్ ఇండియన్ ఆర్టిస్ట్స్ వేదిక: జోయెస్ ఆర్ట్ గ్యాలరీ రోడ్ నం.13, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ⇒ లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్ వేదిక: రామోజీ ఫిల్మ్ సిటీ సమయం: ఉదయం 9 గంటలకు -
ఆటాడుకుందామా!
మీ ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతోందా... అయితే ఆటలు ఆడించే ఎడ్ల సతీశ్ కుమార్‌ను పిలవండి మరింత సందడి మీ ముందుంటుంది. గోళీలు, కర్రబిళ్ల, గాలిపటాలు, దాండియా కర్రలతో మీ ఇంటి ముందు ప్రత్యక్షమవుతారు.. మీ ఇంటికి వచ్చిన అతిథులను ఆటపాటలతో ముంచెత్తి, పండుగ వాతావరణం తీసుకువస్తారు. రంగస్థల నటుడు, సంప్రదాయ ఆటలలో నిష్ణాతుడు, జానపద గిరిజన నృత్యాల నిపుణుడు అయిన సతీశ్‌కుమార్ దేశవిదేశాలలో భారతదేశ సంప్రదాయాన్ని ప్రదర్శిస్తున్నారు. మరుగున పడిపోతున్న ఆటలను, వస్తువులను నేటి తరానికి పరిచయం చేస్తున్నారు. సంప్రదాయ ఆటలతోపాటు, జానపద నృత్యాలు, దాండియా ఆటలతో ఇంటిని ఆనంద సాగరంలో ముంచుతున్నారు. భారతీయ సంప్రదాయాన్ని దేశవిదేశాలలో ప్రచారం చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన సతీశ్‌కుమార్‌ను ‘సాక్షి’ పలకరించింది. ఆ వివరాలు... నానమ్మ ప్రభావం... ‘చిన్నప్పుడు నానమ్మ చాలా కథలు చెప్పేది. రాముల వారి గుడి దగ్గర రామ్‌లీల, ఒగ్గు కథలు, నాటకాలు అన్నిటికీ నానమ్మ తనతో తీసుకువెళ్లేది. అవి చూస్తుండటం వల్ల కళల పట్ల మక్కువ పెరిగింది. 1995 ప్రాంతంలో ఉర్దు, తెలుగు నాటకాలు వేయడం ప్రారంభించాను. సాగర సంగమం సినిమా చూసిన తరవాత నాట్యం నేర్చుకోవాలనుకున్నాను. కూచిపూడి నాట్యకారిణి ఉమారామారావుగారి శిష్యుడైన అనిల్ కుమార్ గారి దగ్గర కూచిపూడి నేర్చుకున్నాను. ఆ తరవాత లంబాడా, కోయ, గోండు వంటి జానపద, గిరిజన నృత్యాలు నేర్చుకుని, వాటిని ఒక పద్ధతిలో రూపొందించి వారి చేతే నాట్యం చేయించడం ప్రారంభించాను. దేశమంతా తిరిగి, అన్ని రాష్ట్రాల జానపదాలు తెలుసుకున్నాను. శివగంగ నాట్యం సుమారు వంద ప్రదర్శనలిచ్చాను. హాంగ్‌కాంగ్‌లో 1980లో పది రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో మన దేశం నుంచి నేను ప్రతినిధిగా హాజరయ్యాను. ఇదే నా మార్గం... నేను ఈ కళలలో ఉండటం నాన్నగారికి ఇష్టం లేదు. ఏదో ఒక ఉద్యోగం చేసుకోమనేవారు. నానమ్మ మాత్రం నన్ను ప్రోత్సహించేది. నాన్నకు కోపం రాకుండా ఉండటం కోసం ఉదయం నాలుగు గంటలకే టాంక్‌బండ్‌కి వెళ్లి, అక్కడ సాధన చేసి, ఆరు గంటలకల్లా డాన్స్ క్లాసుకి వెళ్లేవాడిని. అలా పట్టుదలతో నాట్యం నేర్చుకున్నాను. అప్పట్లోనే నాటకాలు కూడా వేయడం మొదలుపెట్టాను. 1996లో హాంగ్‌కాంగ్, 1997లో అమెరికా వెళ్లాను. అక్కడ కార్యక్రమాలకు వివిధ దేశాల ప్రతినిధులు వచ్చారు. వారంతా నన్ను ప్రోత్సహించి, ఆటా సభలకు పంపారు. అక్కడి వారికి మన సంప్రదాయ నృత్యాలు నేర్పించి, ఆటా ప్రారంభోత్సవ వేడుకలో చేయించాను. అలా అక్కడ సభలలో కొత్త ఒరవడి మొదలుపెట్టాను. అక్కడ ‘తెలుగు దేశం మనది’ ప్రదర్శన చూసి, కార్యక్రమానికి హాజరైన పన్నెండు వేల మంది ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టారు. ఒక కళాకారుడికి ఇంతకంటె ఏం కావాలి. అప్పుడు అనుకున్నాను, ‘ఇదే నా మార్గం’ అని. అక్కడ రెండేళ్లు ఉండి భారతదేశానికి వచ్చేశాను. స్వదేశంలో కొత్తగా... మన దేశంలో కొత్తగా ఏదైనా క్రియేట్ చేయమని తెలంగాణ కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణగారు కోరారు. ‘ఈ తరం వారు మరచిపోతున్న మన ఆటలు నేర్పిస్తాను’ అన్నాను. ఆయన ‘సరే’ అన్నారు. 2017లో మన ఊరి ఆటలు (ఎథ్నిక్ గేమ్స్) పేరున మరుగున పడిపోతున్న ‘కర్ర – బిళ్ల, గోళీలు, బొంగరాలు, కర్ర సాము, వామన గుంటలు, గచ్చకాయలు, చింత గింజలు’ వంటి ఆటలు ఆడించడం మొదలుపెట్టాను. అలాగే పిల్లలకి రాజస్థానీ తలపాగాలు కట్టి, వారితో దాండియా ఆడిస్తాను. వాతావరణాన్ని ఏభై ఏళ్ల క్రితం ఉన్న సంప్రదాయాల్లోకి తీసుకెళ్తాను. మన సంప్రదాయం తెలిసిన నానమ్మలను, అమ్మమ్మలను పిలిచి, వారితో తిరగలిలో బియ్యం పోసి విసిరిస్తాను. రోట్లో వడ్లు వేసి దంపిస్తాను. మనవలకి, పిల్లలకి వాళ్లు నేర్పేలా చేస్తారు. సంప్రదాయాన్ని నిత్యనూతనంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. మన సంప్రదాయాలను ఆంగ్లంలో... విదేశాలలో ప్రదర్శనలిస్తున్నప్పుడు... బతుకమ్మ, గొబ్బెమ్మ, లంబాడీ, భాంగ్రా వీటికి సంబంధించిన పాటలను ఆంగ్లంలోకి అనువదించి, పాడుతూ చెబుతాను. గుంటూరు జేకేసీ కళాశాలలో సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ కార్యక్రమాల సందర్భంగా ఆడించాను. సంక్రాంతి సంబరాలు జరిపించాను. ‘అహం భారతీయం’ లో హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు అన్నీ కలిసి 1998లో ప్రదర్శించాం. నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని అనను కాని, ఆనందంగా ఉంటుంది. మమ్మల్ని ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అలాగే మాలాంటి వాళ్లకు శాశ్వత ఉపాధి కలిపిస్తే మరింత బాగా చేయగలుగుతాం. – సంభాషణ: వైజయంతి పురాణపండ – ఫొటోలు: నోముల రాజేష్ రెడ్డి కిల్లింగ్ వీరప్పన్‌లో, ఆత్మసమర్పణ్ (హిందీ సినిమా)లో, కొన్ని హిందీ సీరియల్స్‌లోను నటించాను. వచ్చిన ఏ అవకాశాన్నీ విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకుంటున్నాను. ‘ఒకసారి బిర్యానీ దొరికితే, ఒకసారి టీ కూడా దొరక్కపోవచ్చు. నేను కళాకారుడినని తెలిసి, అమెరికాలో ఒకసారి చార్టర్ విమానాన్ని గంటసేపు నా కోసం ఆపారు. ఒకసారి ఒక పెద్ద కార్యక్రమానికి మూడు లారీల సామాను తెచ్చాను. ఎడ్ల బండి, గంగిరెద్దు, భోగి మంటలు అన్నీ ఉన్నాయందులో. పెద్దలతో ఆటలు, అమ్మలక్కలాటలు సైతం ఆడించాను. – ఎడ్ల సతీశ్ కుమార్ -
భారతీ తీర్థమాశ్రయే
సనాతన ధర్మానికి, ఆర్ష సంస్కృతికి చిరునామా శ్రీ శృంగేరీజగద్గురు మహాసంస్థానం. నాలుగు ఆమ్నాయ పీఠాలలో ఒకటిగా, గురుపరంపరతో అలరారుతున్న ఈ పీఠానికి ప్రస్తుత పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థమహాస్వామి వారు. అపర శారదా స్వరూపులుగా భాసిల్లే వీరి ముప్ఫై సంవత్సరాల పీఠాధిపత్యం జనాలలో శృంగేరిపట్ల గల గౌరవమర్యాదలను రెట్టింపు చేసింది.సంప్రదాయ కుటుంబమైన వేంకటేశ్వర అవధాన్లు–అనంతలక్ష్మి దంపతులకు 1951వ సంవత్సరంలో చైత్ర శుక్ల షష్ఠి నాడు జన్మించారు శ్రీస్వామివారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు సీతారామాంజనేయులు. శృంగేరీ పీఠానికి 35వ అధిపతి శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామివారితో ఒకానొక సందర్భంలో సీతారామాంజనేయులుకి ఏర్పడిన పరిచయానికి తోడు శ్రీశారదాదేవీ ఆశీస్సులు కూడా లభించడంతో 1989లో సీతారామాంజనేయులును శృంగేరి మహాసంస్థానానికి 36వ పీఠాధిపతులుగా పట్టాభిషిక్తులను చేసి వారికి పీఠసంప్రదాయాల ప్రకారం భారతీతీర్థ అనే పేరును ఇచ్చారు. ధర్మమే పునాది... ఒకనాడు జగద్గురువులను దర్శించుకున్న ఒక శిష్యుడు ‘‘ప్రపంచమంతా భౌతికంగా, వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధివైపు దూసుకుపోతున్న ఈ తరుణంలో ధర్మం అవసరమేమిటి?’’ అని అడిగాడు.దానికి శ్రీ భారతీ తీర్థ స్వామివారు ‘‘ధర్మోవిశ్వస్య జగత:ప్రతిష్ఠా..’’ అంటే వేదం విశ్వం అస్తిత్వం ధర్మంమీదనే ఆధారపడి ఉందని చెబుతోంది. సనాతన ధర్మ ఆచార విచారాలు కొనసాగుతున్నంత కాలం దేశం సుభిక్షంగా ఉంటుంది. భౌతికంగా మనం ఎంత అభివృద్ధి చెందినా ధర్మానికి దూరమయితే ప్రమాదం ఎదురవుతుంది. అందుకే ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ఆదిశంకరులు శృంగేరీ పీఠాన్ని స్థాపించారు’’ అని చెప్పిన తీరు అందరికీ మార్గనిర్దేశనం అవుతుంది. సన్మార్గం వైపు... జగద్గురువుల ఆదేశంతో శృంగేరి పీఠం, దేశవ్యాప్తంగా ఉన్న దాని అనుబంధ సంస్థలద్వారా అనేక ధార్మిక, సామాజిక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహింపబడుతున్నాయి. వెనుకబడిన ప్రాంతాలో మౌలికవసతుల కల్పనకు పీఠం తరుపున గట్టిప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడ విద్య, వైద్యం మొదలైన అవసరాలను తీరుస్తోంది పీఠం. సమాజాన్ని మంచిమార్గంవైపు మరల్చే దిశగా శృంగేరి శంకరమఠాలు కృషి చేస్తున్నాయి. వైదిక వాజ్ఞ్మయాన్ని ఈనాటి తరం వారికి అందించాలనే ఉన్నతాశయంతో వేదవిద్యాబోధనకు, ప్రాచీనగ్రంథ పరిరక్షణకు నడుం బిగించింది శృంగేరి సంస్థానం. శృంగేరీలో నేటి కార్యక్రమాలు నేడు జగద్గురువుల 69వ వర్ధంతి సందర్భంగా (శృంగేరీ పీఠాధిపతుల పుట్టినరోజును వర్ధంతి అని వ్యవహరిస్తారు. అది ఆ మఠ సంప్రదాయం) పీఠంలో ఉదయంనుండి సహస్రమోదక మహాగణపతియాగం, మహారుద్రయాగం, శతచండియాగం మొదలైన కార్యక్రమాలు జగద్గురువుల పర్యవేక్షణలో, దేశం నలుమూలనుండి విచ్చేసిన వేదశాస్త్ర పండితులచేత అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతాయి. ఒకవైపు వేదఘోషతో, మరోవైపు కళాకారుల సాంస్కృతిక శోభతో శృంగేరి మారుమ్రోగుతుంది. అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని, వేద పండితులు -
దావత్ చేస్కోవద్దా!?
ఫంక్షన్ హాళ్ల అద్దెలు భరించలేని మధ్య, దిగువ తరగతి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా జీహెచ్ఎంసీ నిర్మించ తలపెట్టిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. గ్రేటర్లో తక్కువ వ్యయంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వీలుగా జీహెచ్ఎంసీ వీటి నిర్మాణానికి ముందుకు వచ్చింది. తక్కువ అద్దెలకే ఈ ఫంక్షన్ హాళ్లను కేటాయించాలని నిర్ణయించింది. వివిధ ప్రాంతాల్లో మొత్తం 50 చోట్ల నిర్మించాలని భావించి..తొలుత 31 ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. దాదాపు ఏడాది కాలంలో వీటిని పూర్తి చేయాలని భావించినా ఫలితం లేదు. మూడేళ్లయినా వీటి అతీగతీ లేదు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల టెండర్లు పూర్తయినప్పటికీ, స్థల వివాదాలు తదితర కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. మొదట కేటాయించిన ప్రాంతాల్లో కాకుండా...ఇతర ప్రాంతాలకు తరలించడంతో మరికొన్ని చోట్ల జాప్యమయింది. కొన్నిచోట్ల పనులు ప్రారంభమైనా ముందుకు సాగలేదు. వెరసి మొత్తం 31 ఫంక్షన్ హాళ్లకుగాను 16 చోట్ల నిర్మాణానికి సిద్ధమైనప్పటికీ వాటిల్లోనూ కొన్నింటిపై కొందరు కోర్టుకు వెళ్లారు. కొన్నింటిని ఇతర ప్రదేశాలకు మార్పు చేశారు. కొన్నింటికి తగిన స్థలం లేదు. మరికొన్ని పనులు కుంటుతున్నాయి. తగిన స్థలం అందుబాటులో ఉన్నదీ లేనిదీ చూసుకోకుండానే, యాజమాన్య హక్కులపై వివాదాల్ని పట్టించుకోకుండానే తొందరపడి టెండర్లు పిలవడంతో పలు చోట్ల ఆటంకాలేర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మూడేళ్లలో కనీసం మూడు ఫంక్షన్‌హాళ్లు కూడా పూర్తికాలేదు. మొత్తం ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఫంక్షన్‌హాళ్ల భారీ వ్యయం భరించలేని సామాన్య ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. రూ.90 కోట్లతో 31 ఫంక్షన్‌హాళ్లు నిర్మించాలనుకున్నప్పటికీ, రూ.30 కోట్ల పనులు కూడా పూర్తి కాలేదు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఈ ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి ప్రత్యేక ♦ మార్గదర్శకాలతో తగిన ప్రణాళికలు రూపొందించారు. అవి.. ♦ ఫంక్షన్‌హాళ్లను దాదాపు 2 వేల చ.గ.ల విస్తీర్ణంలో నిర్మించాలి. ♦ మూడంతస్తులుగా నిర్మించాలి. ♦ ఒక అంతస్తులో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు, ఒక అంతస్తులో ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు. ♦ మరో అంతస్తులో భోజనాలకు ఏర్పాట్లు. సెల్లార్లో పార్కింగ్ సదుపాయం. ♦ పెళ్లిళ్లకు కనీసం వెయ్యిమంది కూర్చునేలా ఏర్పాట్లు. తొలుత ప్రతిపాదించిన ప్రాంతాలు.. 1. జుమ్మేరాత్‌బజార్ (పురానాపూల్ –ముస్లింజంగ్ బ్రిడ్జి). 2. ఆజాద్ మార్కెట్, ఈసామియా బజార్. 3.మునిసిపల్ కళ్యాణమంటపం(శాంతినగర్). 4.దూద్‌బావి, రైల్వే క్వార్టర్స్ దగ్గర,చిలకలగూడ. 5. చక్రిపురం చౌరస్తా, కుషాయిగూడ. 6. పోలీస్‌స్టేషన్ వెనుక, కుషాయిగూడ. 7. శ్రీరామ్‌నగర్‌కాలనీ, (కాప్రాసర్కిల్). 8. కొత్తపేట. 9. గాంధీ విగ్రహం వద్ద(ఎల్బీనగర్సర్కిల్). 10. సుబ్రహ్మణ్యం కాలనీ(సర్కిల్–4). 11.భానునగర్ (సర్కిల్–4). 12. మైలార్‌దేవ్‌పల్లి(రాజేంద్రనగర్ సర్కిల్) 13. అత్తాపూర్ విలేజ్(రాజేంద్రనగర్ సర్కిల్) 14.భోజగుట్ట(సర్కిల్–7) 15. అంబర్‌పేట. 16. హకీంబాబా దర్గా, ఫిల్మ్‌నగర్. 17. బంజారాహిల్స్. 18.లక్ష్మీనరసింహస్వామి ఆలయం, షేక్‌పేట. 19. గచ్చిబౌలి. 20. రాయదుర్గం. 21. చందానగర్. 22. హఫీజ్‌పేట. 23.రైల్వేట్రాక్ వద్ద, శాంతినగర్(సర్కిల్–13) 24. బొబ్బుగూడ మార్కెట్ (కూకట్పల్లి సర్కిల్) 25.ఆల్విన్‌కాలనీ. 26. జగద్గిరిగుట్ట. 27. సర్వేనెం.2/2 ఓల్డ్ అల్వాల్. 28. హెచ్ఎంటీ కాలనీ. 29.టీఆర్టీ క్వార్టర్స్, సికింద్రాబాద్ . 30. కేపీహెచ్‌బీ. 31. ఫేజ్ 2 హౌసింగ్‌కాలనీ(నార్త్‌జోన్) ప్రస్తుత పరిస్థితి .. ♦ ఎట్టకేలకు రూ.30.32 కోట్లతో 16 హాళ్లు నిర్మించేందుకు సిద్ధమైనప్పటికీ వాటిల్లో కొన్నింటికి ఆటంకాలెదురయ్యాయి. కొన్ని కుంటుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. ♦ కొత్తపేటలో నిర్మించాలనుకున్న ఫంక్షన్‌హాల్‌ను తగిన స్థలం లేదని నాగోల్‌కు తరలించారు. దీని నిర్మాణానికి టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి ఇంకా అనుమతి రాలేదు. ♦ చంపాపేట గాంధీ విగ్రహం దగ్గర ఫంక్షన్ హాల్ పనులు దాదాపు 50 శాతమే పూర్తయ్యాయి. ♦ జుమ్మేరాత్ బజార్లో పనులు ఆరంభమైనప్పటికీ ముందుకు సాగలేదు. ♦ బంజారాహిల్స్ రోడ్‌నెంబర్–12 ఎన్బీటీనగర్లో నిర్మించతలపెట్టిన స్థలంపై కోర్టు కేసుఉండటంతో విరమించుకున్నారు. ♦ వెస్ట్‌జోన్‌లోని పాపిరెడ్డి కాలనీలో పనులు దాదాపు 70 శాతం మేర పూర్తయ్యాయి. ♦ హఫీజ్‌పేటలో స్థలమే గుర్తించలేదు. ♦ రామచంద్రాపురం శ్రీనివాసనగర్ కాలనీ ఎస్సీ బస్తీలో నిర్మాణం చేయాలనుకున్న స్థలం కోర్టు వివాదంలో ఉంది. ♦ అడ్డగుట్ట వెస్టర్న్హిల్స్లో స్థానిక ప్రజలతోపాటు, కార్పొరేటర్నుంచి అభ్యంతరాలతో పనులు ఆపివేశారు. కొత్త ప్రతిపాదనలకు సిద్ధమయ్యారు. ♦ సీతాఫల్మండి టీఆర్టీ క్వార్టర్స్ వద్ద దాదాపు 60 శాతం పనులు జరిగాయి. ♦ మారేడ్‌పల్లి నెహ్రూనగర్ దగ్గర ఫంక్షన్‌హాల్ పనులు దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. ♦ భగత్‌సింగ్‌నగర్‌లో దాదాపు 60 శాతం మేర పనులు జరిగాయి. ♦ ఇలా పనులు వివిధ కారణాలతో ఆగిపోగా, కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి.