అంత్య పుష్కరాల కార్యక్రమ వివరాలు..
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంత్య పుష్కరాల్లో భాగంగా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వివరాలను ఆలయ ఈఓ టి.రమేష్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
31న ద్వాదశి (ఆర్ద్ర నక్షత్రం) ఆదివారం
► ఉదయం 5.30 గంటలకు – శ్రీ స్వామి వారి ప్రచార మూర్తులు, చక్రపెరుమాళ్లు, శ్రీపాదుకలు, శ్రీ భగవద్రామానుజాచార్య స్వామి వారలతో ఊరేగింపుగా గోదావరి నదికి వెళ్లడం
► ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు – సంకల్పం, నదీపూజ, చక్రపెరుమాళ్లకు, శ్రీపాదుకలకు, శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవంలో భాగంగా మాస నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ రామానుజాచార్య స్వామి వారికి అభిషేకం, సామూహికంగా పుష్కర స్నానము.
► ఉదయం 8 నుంచి 9 గంటల వరకు – పునర్వసు మండపంలో పుష్కర జలాలతో స్వామివారికి స్నపన తిరుమంజనం, తీర్థ ప్రసాద వినియోగం.
► సాయంత్రం 6 నుంచి 6.15 ని.ల వరకు శ్రీ గోదావరి నది హారతులు పుష్కరాలు 12 రోజులపాటు నిర్వహిస్తారు.
► దేవాలయంలో జరుగు నిత్య కార్యక్రమాలు (31 నుంచి ఆగస్టు 11 వరకు) ఉదయం 8.30 నుంచి 9.30 వరకు – ఉత్సవమూర్తులకు సహస్రనామార్చన, 9.30 నుంచి 10 వరకు – ‘క్షేత్రమహాత్మ్యం’ ప్రవచనం, 10 నుంచి 11.30 గంటల వరకు – నిత్యకల్యాణోత్సవం, సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు – ‘ప్రభుత్వ సేవ’ ఉంటుందని ఆలయ ఈఓ రమేష్ బాబు తెలిపారు.