Pushkarni
-
ఘాట్లన్నీ రాకీ పౌర్ణమి సందడి
-
పుష్కర స్నానంతో పునీతం...
కనగల్ : భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపుర ం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో నిర్మించిన పుష్కరఘాట్‌కు గురువారం భక్తులు పోటెత్తారు. పవిత్ర పర్వదినం రాఖీ పౌర్ణమి కావడంతోపాటు సెలవుదినమైనందున పుష్కరస్నానం, దైవదర్శనం ఒకే చోట కలుగుతున్నందున దూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. పుష్కర భక్తులతోపాటు ఘాట్, అమ్మవారి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కుంకుమార్చన , అభిషేకాలు తదితర పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఘాట్ వద్ద అధిక సంఖ్యలో భక్తులు పిండప్రదానాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఘాట్ ఇన్చార్జి రాజేందర్‌తోపాటు తహసీల్దార్ కృష్ణయ్య, షిప్టు ఇన్చార్జి డి.సీతాకుమారి చర్యలు తీసుకున్నారు. అమ్మవారి ఆలయం వద్ద జిల్లా కేంద్రానికి చెందిన కౌన్సిలర్ నవీన్‌గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. దర్వేశిపురం ఘాట్‌లో 29,000 మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. అంచనాలకు మించి భక్తులు దర్వేశిపురం ఘాట్‌కు భక్తులు పుష్కర స్నానాలకు వస్తున్నందున అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే కనగల్ మండలకేంద్రంలోని వాగులో ఉన్న పుష్కరఘాట్‌లో స్వల్పంగా 500 మంది పుష్కర స్నానాలు ఆచరించారు. రెండు ఘాట్ల వద్ద ప్రయాణికులతోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఐ రమేశ్‌కుమార్, ఎస్సై వెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించారు. -
మాకు రాఖీ కట్టండి: పుష్కర సిబ్బంది
-
'పుష్కరాల కోసం అన్ని ఏర్పాట్లు చేసాం'
-
రెండో రోజు పుష్కరా పుణ్యస్నానాలు
-
తపాలాశాఖ ద్వారా పుష్కర జలం
రూ.30లు చెల్లిస్తే వాటర్ బాటిల్ హోమ్ డెలివరీ ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం నుంచి సరఫరాకు చర్యలు నేటి నుంచి బుకింగ్ ప్రారంభం ఖమ్మం గాంధీచౌక్: నేటి నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. పుష్కర సమయంలో నదీ స్నానం వలన పుణ్యం వస్తుందని, ఆ సమయంలో దేవతలంతా పుష్కరునితో నదిలో ప్రవేశిస్తారని నమ్మకం. పుష్కర స్నానం ఒకసారి చేస్తే 12 సంవత్సరాల కాలం 12 పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుందని, మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పోస్టల్ శాఖకు ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండటంతో ఆ శాఖ ఈ పుణ్య కార్యక్రమాన్ని చేపట్టింది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే కృష్ణానదీ పుష్కరాల సందర్భంగా ఆ నదీ జలాన్ని ప్రజలకు అందించేందుకు తపాలా శాఖ కార్యక్రమాన్ని చేపట్టింది. పుష్కరాలకు నదికి వెళ్లలేని, వెళ్లని వారి కోసం తపాల శాఖ ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా కూడా తపాలా శాఖ ఆ నదీ జలాలను సరఫరా చేసింది. అదే తరహాలో కృష్ణా పుష్కరాల సందర్భంగా కూడా జలాలను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తపాల శాఖ చేపట్టింది. విజయవాడలో శుద్ధి చేసిన కృష్ణా పుష్కర జలాన్ని 500 మి.లీ బాటిళ్లలో నింపించి ఇక్కడకు తెప్పించే ఏర్పాట్లను చేస్తున్నారు. ఒక్కో బాటిల్ ఖరీదు రూ.30 లుగా నిర్ణయించారు. నీరు అవసరం ఉన్న ప్రజలు, భక్తులు సమీప పోస్టాఫీసుల్లో బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆ నీటి బాటిళ్లను పోస్టు మ్యాన్ ఇంటికి తీసుకువచ్చి (హోమ్ డెలవరీ) అప్పగిస్తారు. నీటిని మన జిల్లాల్లో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం కేంద్రాల్లో దింపుతారు. ఈ మూడు కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో నిర్ణయించిన రూట్లలో వాటర్ బాటిళ్లను పోస్టాఫీసులకు తరలిస్తారు. అక్కడ నుంచి నీటిని బుక్ చేసుకున్న వారికి పుష్కర నీళ్ల బాటిళ్లను హోమ్ డెలివరీ చేస్తారు. ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు ఈ ప్రక్రియ జగుతుందని జిల్లా పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ మల్లికార్జున శర్మ ‘సాక్షి’కి తెలిపారు. పుణ్య స్నానాలకు వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. -
కృష్ణమ్మ పుష్కర శోభ
-
గోదావరికి పుష్కర పూజలు
ఏటూరునాగారం : అంత్య పుష్కరాలను పురస్కరించుకుని మండల కేంద్రంలోని రామన్నగూడెం గోదావరి నదిలో బుధవారం భక్తులు పుష్క రస్నా నం చేశారు. అలాగే కాజీపేటలోని స్వయం భూ శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ సిద్ధాంతి అనం త మల్లయ్యశర్మ ఆధ్వర్యంలో అక్కడి దేవతమూర్తు ల ఉత్సవ విగ్రహాలకు కూడా స్నానం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది పుష్కరాల సమయంలో దేవతామూర్తులకు గంగస్నానం చేయించినట్లు చెప్పారు. భక్తులు గోదావరిని పవిత్ర నదిగా భావించి పూజలు చేయాలన్నా రు. కాగా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరిలో పుష్కరస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు కూడా చేశారు. అలాగే నది లో దీపాలను వదిలి ఆడబిడ్డలకు నూతన వస్త్రాలను వాయినాలుగా అందజేశారు. కార్యక్రమంలో ఎడ్లమల్ల రవీందర్ సిద్ధాంతి, చొక్కారావు, నాగార్జున, రజిత, నాగమణి, సీతమ్మ పాల్గొన్నారు. గోదావరికి పూజలు మంగపేట : అంత్యపుష్కరాల్లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించారు. ఈ సందర్భం గా పలువు రు మహిళలు గోదావరి నదిలో పసుపు, కుంకుమ, పూలు, దీపాలు వదిలి గంగమ్మకు పూజలు చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గం టల వరకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడం తో పుష్కరఘాట్ వద్ద సందడి నెలకొంది. సాయంత్రం వేళలో అర్చకులు గోదావరి నదికి హారతి ఇచ్చారు. -
పుష్కర స్నానానికి వర్షం అడ్డంకి
ఏటూరునాగారం : గోదావరి అంత్యపుష్కరాల్లో బుధవారం భక్తుల స్నానాలకు వర్షం అడ్డంకిగా మారింది. తెల్లవారుజాము నుంచి జోరుగా వర్షం కురవడంతో రామన్నగూడెం ఘాట్ వద్దకు రావడానికి ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు కొందరు వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. మహిళలు తమ మొక్కులను ఘాట్ వద్దనే సమర్పించుకున్నారు. ఘాట్‌పై ఒండ్రుమట్టి పేరుకుపోవడంతో గ్రామస్తులు నీటితో శుభ్రం చేశారు. భక్తులు పితృదేవతలకు పిండప్రదానాలు చేసి గోదావరిలో కలిపారు. -
అంత్య పుష్కరాల కార్యక్రమ వివరాలు..
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంత్య పుష్కరాల్లో భాగంగా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వివరాలను ఆలయ ఈఓ టి.రమేష్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 31న ద్వాదశి (ఆర్ద్ర నక్షత్రం) ఆదివారం ► ఉదయం 5.30 గంటలకు – శ్రీ స్వామి వారి ప్రచార మూర్తులు, చక్రపెరుమాళ్లు, శ్రీపాదుకలు, శ్రీ భగవద్రామానుజాచార్య స్వామి వారలతో ఊరేగింపుగా గోదావరి నదికి వెళ్లడం ► ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు – సంకల్పం, నదీపూజ, చక్రపెరుమాళ్లకు, శ్రీపాదుకలకు, శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవంలో భాగంగా మాస నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ రామానుజాచార్య స్వామి వారికి అభిషేకం, సామూహికంగా పుష్కర స్నానము. ► ఉదయం 8 నుంచి 9 గంటల వరకు – పునర్వసు మండపంలో పుష్కర జలాలతో స్వామివారికి స్నపన తిరుమంజనం, తీర్థ ప్రసాద వినియోగం. ► సాయంత్రం 6 నుంచి 6.15 ని.ల వరకు శ్రీ గోదావరి నది హారతులు పుష్కరాలు 12 రోజులపాటు నిర్వహిస్తారు. ► దేవాలయంలో జరుగు నిత్య కార్యక్రమాలు (31 నుంచి ఆగస్టు 11 వరకు) ఉదయం 8.30 నుంచి 9.30 వరకు – ఉత్సవమూర్తులకు సహస్రనామార్చన, 9.30 నుంచి 10 వరకు – ‘క్షేత్రమహాత్మ్యం’ ప్రవచనం, 10 నుంచి 11.30 గంటల వరకు – నిత్యకల్యాణోత్సవం, సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు – ‘ప్రభుత్వ సేవ’ ఉంటుందని ఆలయ ఈఓ రమేష్ బాబు తెలిపారు. -
పుష్కరఘాట్లను పరిశీలించిన అధికారులు
కనగల్ : మండలకేంద్రంతోపాటు దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం సమీపంలో నిర్మిస్తున్న కృష్ణా పుష్కరఘాట్లను ఎండోమెంట్ డీసీ దుర్గాప్రసాద్ మంగళవారం పరిశీలించారు. కనగల్ వాగు సమీపంలో నిర్మిసున్న శ్రీ తిరుమలనాథస్వామి ఆల యంతోపాటు దర్వేశిపురంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ ఆలయ నిర్మాణం పనులను సైతం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల నేపథ్యంలో మండలంలోని రెండు చోట్ల రూ. 12 లక్షల ఎండోమెంట్ నిధులతో తిరుమలనాథస్వామి ఆలయంతోపాటు హనుమాన్ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు. సకాలంలో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, ఈఓలు అన్నెపర్తి సులోచన, రంగాచారి, జేఏ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాల విజయవంతానికి కృషి
దామరచర్ల : పుష్కరాల విజయ వంతానికి కృషి చేస్తామని వాడపల్లి శివాలయం ప్రధాన ఘాట్ ప్రత్యేక అధికారి ,జిల్లా స్టెప్ అధికారి కె.వేణుగోపాల్‌రావు తెలిపారు. మంగళవారం శ్రీమీనాక్షి అగస్తే్యశ్వర స్వామి దేవాలయంలో అధికారులు,దేవాలయ చైర్మన్‌తో కలిసి సమీక్ష జరిపారు. జిల్లాలో అత్యధికంగా ఈఘాట్‌కే పుష్కర భక్తులు వచ్చే వీలున్నందున దీనిపై ప్రత్యేక శ్రద్ధచూపుతామన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.సమావేశంలో దేవాలయ చైర్మన్ కొందూటి సిద్దయ్య,ఆర్‌డబ్ల్యూయస్ డీఈ బ్రహ్మంబాబు,ఏఈలు సంపత్ కుమార్, రవికిర ణ్‌లు పాల్గొన్నారు. వాడపల్లి అయ్యప్ప ఘాట్ ప్రత్యేక అధికారి జిల్లా డీటీడబ్లు్యఓ నర్వోత్తమ్ రెడ్డి ఘాట్ పనులను పరిశీలించారు. అయన వెంట వార్డెన్ బాలక్రిష్ణ ఉన్నారు. -
పుష్కరాల తొక్కిసలాటపై 18 నుంచి విచారణ
కోటగుమ్మం (రాజమండ్రి) : పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలోని పుష్కరాలరేవు వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనపై ఈ నెల 18 నుంచి సోమయాజులు కమిషన్ విచారణ చేపట్టనుంది. అసలు ఆ తొక్కిసలాట ఎలా జరిగింది,ఎందువల్ల జరిగింది, సంఘటన జరిగేందుకు ఉన్న అవకాశాలేంటి వంటి తదితర అంశాలపై కమిషన్ పలువురిని విచారించనుంది. పుష్కరాలు ప్రారంభం రోజైన 2015 జూలై 14న పుష్కరాల రేవు వద్ద తొక్కిసలాట జరిగి సుమారు 30 మంది మృతి చెందిన సంగతి విదితమే. తొక్కిసలాట సంఘటనపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సోమయాజులు కమిషన్‌ను నియమించింది. కమిషన్ ఈ నెల 18 నుంచి రాజమండ్రిలోని ఆర్ అండ్‌బీ అతిథి గృహంలో విచారణ చేపట్టనుంది. -
‘ఆహ్లా’దం.. అద్భుతం
- గోదావరి అందాలకు యాత్రికుల పరవశం - చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన సాక్షి,రాజమండ్రి : పుష్కరాలకు పోటెత్తుతున్న యాత్రికులు అటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటక , ఆధ్యాత్మిక కేంద్రాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పుష్కర స్నానాలు పూర్తిచేసి పర్యాటక కేంద్రాల సందర్శనలకు బయల్దేరుతున్నారు. గోదావరి అందాలను చూసి ఆనందలో మునిగితేలుతున్నారు. కాటన్దొర గొప్పదనాన్ని కొనియాడుతున్నారు. ప్రకృతి సౌందర్యానికి నెలవైన పాపికొండలు, పట్టిసీమ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజినీ చూసేందుకు వస్తున్నారు. బ్యారేజీ పక్కనే ఉన్న కాటన్ మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు. బొమ్మూరు మిట్టలో కాటన్దొర నివాసమున్న ఇంటిని సైతం సందర్శిస్తున్నారు. ఇక రాజమండ్రి గోదావరి ఒడ్డున ఉన్న ఇస్కాన్‌టెంపుల్, కందుకూరి వీరేశలింగం పంతులు నివాస గృహాన్ని పుష్కర యాత్రికులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారు. ప్రభుత్వ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రాల్లబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలను సైతం పుష్కర యా త్రికులు సందర్శిస్తున్నారు. మ్యూజియంలోని శిల్పకళను తిలకిస్తున్నారు. వీటితో పాటు ఉభయ గోదారిజిల్లాలలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను సైతం పుష్కర భక్తులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారు. -
చెప్పింది చేయకే తిప్పలు
- అమలుకు నోచని ట్రాఫిక్ ప్రణాళిక - యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన - చేష్టలుడిగి చూస్తున్న పోలీసులు - పుష్కరారంభం నుంచే ప్రయాణికులకు పాట్లు రాజమండ్రి : మూడు నెలల కసరత్తు.. ఒక్క గంట కూడా ఉపయోగపడలేదు. పుష్కరాల్లో ఎదురయ్యే ప్రధాన సమస్య ట్రాఫిక్ అని, మూడంచెల విధానంలో నియంత్రిస్తామని గొప్పలు పోరుున అధికారులు పుష్కరాలు ఆరంభమయ్యేసరికి చేతులెత్తేశారు. పుష్కరాలకు తూర్పు గోదావరి జిల్లాకే మూడున్నర కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం తొలి నుంచి చెబుతూనే వస్తోంది. అంటే రోజుకు 30 లక్షల మందికి పైబడన్న మాట. యూత్రికుల తాకిడి అధికంగా రాజమండ్రిలో అందుకు తగ్గట్టుట్రాఫిక్ను నియంత్రించాల్సి ఉంది. దీనిపై అర్బన్ జిల్లా పోలీసులు, రాజమండ్రియేతర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణపై జిల్లా పోలీసులు భారీగా ఖసరత్తు చేశారు. ప్రణాళికల మీద ప్రణాళికలు రచించారు. అరుుతే వాటిలో ఒక్కటీ అమలు కాలేదు. గోదారి గట్టు మీదా ఇష్టారాజ్యంగా రాకపోకలు రాజమండ్రిలో పేపరుమిల్లు, ఆర్యాపురం, గోకవరం బస్టాండ్, సుబ్రహ్మణ్యమైదానం, శ్యామలాసెంటరు, కోటగుమ్మం, కోటిపల్లిబస్టాండ్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిషేధించి, కేవలం అంబులెన్స్‌లు, పారిశుద్ధ్య వాహనాలు, వృద్ధులను తరలించే వాహనాలు, అత్యవసర ప్రభుత్వ వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. ఈ రూట్లలో ఇప్పుడు ఆటోలు సైతం యథావిధిగా తిరుగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న శని, ఆదివారాల్లో కూడా వాహనాలు ఆగలేదు. గౌతమ ఘాట్, వీఐపీఘాట్, వైగ్రాం ఘాట్ ఉన్న గోదావరి బండ్ మీద ద్విచక్రవాహనాలు, ప్రైవేట్ కార్లు పెద్ద ఎత్తున సంచరిస్తున్నా అడ్డుకునేవారే లేరు. అనర్హులకూ వీఐపీ పాస్‌లు ట్రాఫిక్ రద్దీని బట్టి మూడంచెల విధానం అమలు చేస్తామన్నారు. రద్దీ ఉన్నప్పుడు ప్రైవేట్ కార్లను మాత్రం ఇతర రోడ్లకు మళ్లిస్తున్న అధికారులు మిగిలిన వాహనాల రాకపోకలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అనర్హులు కూడా వీవీఐపీ పాస్‌లు, వీఐపీపాస్లు సంపాదించి వాహనాలకు తగిలించుకుని నిబంధనలు బేఖాతరు చేస్తున్నా పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకుల అనుచరులు సైతం తమ బంధువులను ఘాట్ల వద్దకు నేరుగా కార్ల మీద తరలిస్తున్నా నియంత్రణ లేదు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులను రాజమండ్రిలోకి రాకుండా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో ఉంచుతామని చెప్పారు. కొంతమూరు రోడ్డు, కాతేరు రోడ్డు, లాలాచెరువు, మోరంపూడి జంక్షన్, వేమగిరి వంతెన సమీపంలో బస్సులు నిలపాలని భావించారు. అయితే వీటిని నేరుగా బస్టాండ్‌కు తీసుకువస్తుండడం వల్ల కూడా మోరంపూడి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు బస్సు వచ్చేందుకు రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. ఏదీ నో వెహికిల్ జోన్ రాజమండ్రిలో నో వెహికిల్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. ధవళేశ్వరం రామపాదాలరేవు దాటిన తరువాత నుంచి కోటిపల్లి బస్టాండ్, వీటీ జూనియర్ కాలేజీ రోడ్డు మీదుగా తాడితోట జంక్షన్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా, పేపరు మిల్లు వరకు రూటులో వాహనాలను అనుమతి లేదని చెప్పారు. కేవలం ఆర్టీసీ ఉచిత బస్సులు మాత్రమే తిప్పుతామన్నారు. ఈ రోడ్డు మీద ఇప్పుడు అన్ని వాహనాలూ తిరుగుతున్నాయి. ఈ కారణంగా శ్యామలా సెంటరు, తాడితోట జంక్షన్, బైపాస్ రోడ్డు జంక్షన్లలో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైవే మీద ట్రాఫిక్ నియంత్రణకు విజయవాడ నుంచి విశాఖ వెళ్లే వాహనాలను జొన్నాడ సెంటరు నుంచి మండపేట, రామచంద్రపురం, కాకినాడ మీదుగా కత్తిపూడి మళ్లిస్తామని, విశాఖ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను దివాన్‌చెరువు నుంచి నాలుగు లేన్ల వంతెన నుంచి మళ్లిస్తామన్నారు. ఇప్పుడు దీనిని ఎత్తివేయడం, విజయవాడ నుంచి వస్తున్న వాహనాలను వేమగిరి వరకు వస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు పడరానిపాట్లు పడుతున్నారు. -
రైళ్లలో కొరవడిన పారిశుధ్యం
- పుష్కర స్టేషన్లలోనూ అపరిశుభ్రతే - మరుగుదొడ్లలోనూ నిలబడి ప్రయాణం సాక్షి, విజయవాడ : గోదావరి మహా పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది యాత్రికులు తరలిరావడంతో అటు రైళ్లు, ఇటు పుష్కర స్టేషన్లలోనూ పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా రాజమండ్రి, కొవ్వూరు, గోదావరి స్టేషన్ల వరకు రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక రైళ్లు వేసినప్పటికీ సరి పోవడం లేదు. ప్రతి రైలులోనూ రెట్టింపు సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు. మరుగుదొడ్ల వద్ద ఉన్న జాగాలోనూ కిక్కిరిసి ఉంటున్నారు. కొందరైతే మరుగు దొడ్లలోనూ నిలబడి వెళుతున్నారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మరుగుదొడ్ల వాడకం బాగా పెరిగింది. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లలో నీటి కొరత ఏర్పడుతోంది. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో మరుగుదొ డ్లను పూర్తిస్థాయిలో క్లీనింగ్ చేయకుండానే రైళ్లను స్టేషన్ నుంచి పంపివేస్తున్నారు. స్టేషన్లలోనూ చెత్తాచెదారం రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు రైల్వేస్టేషన్లకు వేలాది మంది ప్రయాణికులు తరలిరావడంతో శానిటేషన్ సమస్యలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు, టిఫిన్ ప్లేట్లు, ప్లాస్టిక్ కవర్లు, పండ్ల తొక్కలు, టీ, కాఫీ కప్పులను ప్లాట్ఫారాలపైన, రైల్వేట్రాక్‌లపైన పడవేస్తున్నారు. పాడైపోయిన ఆహార పదార్థాలను సైతం అక్కడే పడేయడంతో ఈగలు, దోమలు ముసురుతున్నాయి. రంగంలోకి దిగిన అధికారులు పారిశుధ్యం లోపిస్తే రోగాలు ప్రబలుతాయని భావిస్తున్న రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. డీఆర్ఎం అశోక్‌కుమార్, ఏడీఆర్ఎం ఎన్.సీతారాంప్రసాద్, పుష్కరాల ప్రత్యేక అధికారి రమేష్‌బాబు స్వయంగా రైళ్లను, పుష్కర స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు. రైల్వే శానిటేషన్ సిబ్బందితో మూడు షిప్టులలోనూ పనిచేయిస్తున్నారు. రైల్వే ట్రాక్, స్టేషన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నారు. అవకాశాన్ని బట్టి బోగీలను శుభ్రం చేయిస్తున్నారు. -
పుష్కరాలకు ‘ట్రూజెట్’ విమాన సర్వీసులు
ప్రధాన పట్టణాల నుంచి రాజమండ్రికి విమానాలు - నాలుగు రోజుల్లో తుది అనుమతులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పుష్కరాల కోసం ప్రత్యేక విమాన సర్వీసులను నడపడానికి ‘ట్రూజెట్’ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నెలలో జరిగే 12 రోజుల పుష్కరాల కోసం దక్షిణాది రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల నుంచి రాజమండ్రికీ విమాన సర్వీసులు నడిపే ఆలోచనలో ఉన్నామని, కానీ దీనికి ఇంకా తుది అనుమతులు రావాల్సి ఉందన్నారు. విమానాలు ఎగరడానికి డీజీసీఏ నుంచి 4-5 రోజుల్లో తుది అనుమతులు అందుతాయని అంచనా వేస్తున్నామని, వచ్చిన వెంటనే పుష్కరాలకు విమాన సర్వీసులు నడపనున్నట్లు టర్బో మెఘా ఎయిర్వేస్ ఫౌండర్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. పుష్కరాల సమయంలో రాజమండ్రికి చాలా డిమాండ్ ఉందని, దీంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరుపతి పట్టణాల నుంచి సర్వీసులు నడిపే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు, పుష్కరాల తర్వాత హైదరాబాద్ నుంచి తిరుపతి, షిరిడీ వంటి పట్టణాలకు రెగ్యులర్ సర్వీసులు ట్రూ జెట్ నడపనుంది. టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ తేజ ట్రూజెట్‌లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా కం పెనీ డెరైక్టర్, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కేంద్రంగా ప్రాం తీయ విమాన సర్వీసులు నిర్వహిస్తున్న టర్బో మెఘా ఎయిర్వేస్ ఇప్పటికే ఏటీఆర్ 72-500 విమానాలను సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. -
పగిలిన ఈ గోడ అవినీతి జాడ..
గోదావరి పుష్కరాల పనుల్లో నాణ్యత లోపించింది. కాసులకు కక్కుర్తి పడి నిర్మాణాలు లోపభూయిష్టంగా చేస్తున్నారన్న ప్రజల గగ్గోలు, ప్రతిపక్షాల ఆరోపణలు ‘నీరు పల్లానికి ప్రవహిస్తుంది’ అన్నంత నిజమని తేలుతోంది. దేశంలోనే అతిపెద్ద ఘాట్‌గా గొప్పగా చెపుతున్న రాజమండ్రి కోటిలింగాల ఘాట్ నిర్మాణం పూర్తి కాకుండానే బయటపడ్డ లోపాలే ఇందుకు తిరుగులేని రుజువుగా నిలుస్తున్నారుు. కంబాలచెరువు (రాజమండ్రి) : పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటిలింగాలఘాట్‌ను భారీగా విస్తరించి కోటిలింగాలపేట నుంచి నల్లా చానల్ వరకు 1.2 కిలోమీటర్ ఘాట్ నిర్మించారు. దీని నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. ఈ తరుణంలో నల్లా చానల్ వద్ద కనకదుర్గ ఆలయం వద్ద కొత్తగా నిర్మించిన ఘాట్‌కు దన్నుగా కట్టిన గోడ శనివారం పగులు తీసింది. అది కొంత మేర కుంగి, ఏ క్షణాన్నరుునా కూలిపోయే అవకాశం ఉంది. అంతేకాక ఘాట్ కిందభాగంలో గుల్లలా ఏర్పడడంతో అది కూడా కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీనికి కారణం నిర్మాణ సమయంలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడమేనని తేటతెల్లమవుతోంది. కన్నుతెరవకపోతే.. పెనుముప్పే.. శుక్రవారం రాత్రి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. కోటిలింగాలపేట, ఆర్యాపురం, తుమ్మలావ, సీతంపేట, లింగంపేట ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ఆ నీటిని గోదావరిలోకి పంపేదిశగా నల్లాచానల్ వద్ద పైప్‌లైన్‌ను ఆన్ చేశారు. నీరు గోదావరిలోకి వెళ్లే క్రమంలో ఒడ్డున కోతకు గురై, ఘాట్‌కు దన్నుగా నిర్మించిన గోడ పగిలిపోయింది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. వేలమంది భక్తులు ఒకేసారి గోదావరి నదిలోకి స్నానాలుచేసేందుకు దిగుతారు. అటువంటప్పుడు ఆ బరువును తట్టుకోలేక నదిలోకి కుంగిపోతే ఎంత పెను ప్రమాదం జరుగుతుందో ఊహించడానికే భయం పుడుతుంది. కాగా ఇక్కడే గోదావరి గట్టుపై వర్షాలకు పెద్ద ఊలకన్నం పడి, నీరు బిరబిరా లోపలికి పోతోంది. ఆ కన్నం నుంచి పోయే నీరు అడుగున ఎక్కడ, ఏ మేరకు డొల్ల చేస్తుందో తెలియదు. ఆ డొల్లతనం ఘాట్ కిందే అయితే అది మరోముప్పు అని చెప్పక తప్పదు. దేశంలోనే పెద్ద ఘాట్ నిర్మించామని చంకలు గుద్దుకుంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు.. పనుల్లో నాణ్యతాలోపాన్ని పట్టించుకోకపోవడానికి.. పుష్కరపనుల్లో వరదలెత్తుతున్న అవినీతే కారణమ న్న ఆరోపణ ప్రబలంగా వినిపిస్తోంది. ఇప్పటికైనా.. మేలుకుని, జరిగిన పనుల్లో లోపాలను చక్కదిద్దడానికి, జరుగుతున్న పనులు నాణ్యతతో జరగడానికి యుద్ధప్రాతిపదికన పూనుకోవాలి. అప్పుడే.. పావనపర్వాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్న మాటకు సార్థకత ఉంటుంది. కాగా గోడ పగిలిన తెలుసుకున్న మేయర్ పంతం రజనీశేషసాయి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మున్సిపల్ కమిషనర్ మురళి, ఇరిగేషన్ ఎస్ఈ సుగుణాకరరావు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిర్ణరుుంచారు. పరాకాష్టకు చేరిన అవినీతికి నిదర్శనం.. పుష్కర పనుల్లో పరాకాష్టకు చేరిన అవినీతికి నిదర్శనం నల్లాచానల్ వద్ద స్నానఘట్టం గోడ పగిలి, కుంగిపోవడమేనని వైఎస్సార్ సీపీ పార్టీ నాయకులు అన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు ఘాట్ పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ ఘాట్ నిర్మాణం మున్సిపల్, ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సి ఉండగా అలా కాక ఇష్టారాజ్యంగా చేశారన్నారు. కాంక్రీట్, ఐరన్ ఊచలు వాడిచేయాల్సిన పనులను ఎక్కువ ఇసుకతో చేశారన్నారు. ఈ ఘాట్ నిర్మాణంలో ఎంత అవినీతి జరిగిందే మాటల్లో చెప్పలేమన్నారు. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ కమిటీని వేయాలని, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేపడుతామన్నారు. ఆయన వెంట ఆదిరెడ్డి వాసు, ఇసుకపల్లి శ్రీనివాస్, పోలు విజయలక్ష్మి, వాకచర్ల కృష్ణ, నాధన్ ఉన్నారు.