
పుష్కరాలకు ‘ట్రూజెట్’ విమాన సర్వీసులు
పుష్కరాల కోసం ప్రత్యేక విమాన సర్వీసులను నడపడానికి ‘ట్రూజెట్’ సన్నాహాలు చేసుకుంటోంది...
ప్రధాన పట్టణాల నుంచి రాజమండ్రికి విమానాలు
- నాలుగు రోజుల్లో తుది అనుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పుష్కరాల కోసం ప్రత్యేక విమాన సర్వీసులను నడపడానికి ‘ట్రూజెట్’ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నెలలో జరిగే 12 రోజుల పుష్కరాల కోసం దక్షిణాది రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల నుంచి రాజమండ్రికీ విమాన సర్వీసులు నడిపే ఆలోచనలో ఉన్నామని, కానీ దీనికి ఇంకా తుది అనుమతులు రావాల్సి ఉందన్నారు. విమానాలు ఎగరడానికి డీజీసీఏ నుంచి 4-5 రోజుల్లో తుది అనుమతులు అందుతాయని అంచనా వేస్తున్నామని, వచ్చిన వెంటనే పుష్కరాలకు విమాన సర్వీసులు నడపనున్నట్లు టర్బో మెఘా ఎయిర్‌వేస్ ఫౌండర్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు.
పుష్కరాల సమయంలో రాజమండ్రికి చాలా డిమాండ్ ఉందని, దీంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరుపతి పట్టణాల నుంచి సర్వీసులు నడిపే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు, పుష్కరాల తర్వాత హైదరాబాద్ నుంచి తిరుపతి, షిరిడీ వంటి పట్టణాలకు రెగ్యులర్ సర్వీసులు ట్రూ జెట్ నడపనుంది. టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ తేజ ట్రూజెట్‌లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా కం పెనీ డెరైక్టర్, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కేంద్రంగా ప్రాం తీయ విమాన సర్వీసులు నిర్వహిస్తున్న టర్బో మెఘా ఎయిర్‌వేస్ ఇప్పటికే ఏటీఆర్ 72-500 విమానాలను సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే.