పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలోని పుష్కరాలరేవు వద్ద జరిగిన తొక్కిసలాట
కోటగుమ్మం (రాజమండ్రి) : పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలోని పుష్కరాలరేవు వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనపై ఈ నెల 18 నుంచి సోమయాజులు కమిషన్ విచారణ చేపట్టనుంది. అసలు ఆ తొక్కిసలాట ఎలా జరిగింది,ఎందువల్ల జరిగింది, సంఘటన జరిగేందుకు ఉన్న అవకాశాలేంటి వంటి తదితర అంశాలపై కమిషన్ పలువురిని విచారించనుంది. పుష్కరాలు ప్రారంభం రోజైన 2015 జూలై 14న పుష్కరాల రేవు వద్ద తొక్కిసలాట జరిగి సుమారు 30 మంది మృతి చెందిన సంగతి విదితమే. తొక్కిసలాట సంఘటనపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సోమయాజులు కమిషన్‌ను నియమించింది. కమిషన్ ఈ నెల 18 నుంచి రాజమండ్రిలోని ఆర్ అండ్‌బీ అతిథి గృహంలో విచారణ చేపట్టనుంది.