గోదావరికి పుష్కర పూజలు
గోదావరికి పుష్కర పూజలు
Published Thu, Aug 11 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
ఏటూరునాగారం : అంత్య పుష్కరాలను పురస్కరించుకుని మండల కేంద్రంలోని రామన్నగూడెం గోదావరి నదిలో బుధవారం భక్తులు పుష్క రస్నా నం చేశారు. అలాగే కాజీపేటలోని స్వయం భూ శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ సిద్ధాంతి అనం త మల్లయ్యశర్మ ఆధ్వర్యంలో అక్కడి దేవతమూర్తు ల ఉత్సవ విగ్రహాలకు కూడా స్నానం చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది పుష్కరాల సమయంలో దేవతామూర్తులకు గంగస్నానం చేయించినట్లు చెప్పారు. భక్తులు గోదావరిని పవిత్ర నదిగా భావించి పూజలు చేయాలన్నా రు. కాగా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరిలో పుష్కరస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు కూడా చేశారు. అలాగే నది లో దీపాలను వదిలి ఆడబిడ్డలకు నూతన వస్త్రాలను వాయినాలుగా అందజేశారు. కార్యక్రమంలో ఎడ్లమల్ల రవీందర్ సిద్ధాంతి, చొక్కారావు, నాగార్జున, రజిత, నాగమణి, సీతమ్మ పాల్గొన్నారు.
గోదావరికి పూజలు
మంగపేట : అంత్యపుష్కరాల్లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించారు. ఈ సందర్భం గా పలువు రు మహిళలు గోదావరి నదిలో పసుపు, కుంకుమ, పూలు, దీపాలు వదిలి గంగమ్మకు పూజలు చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గం టల వరకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడం తో పుష్కరఘాట్ వద్ద సందడి నెలకొంది. సాయంత్రం వేళలో అర్చకులు గోదావరి నదికి హారతి ఇచ్చారు.
Advertisement