'నీ సర్టిఫికెట్ నెహ్రూకు అవసరం లేదు' | Nehru doesn't need certificate from Rijiju: Gogoi | Sakshi
Sakshi News home page

'నీ సర్టిఫికెట్ నెహ్రూకు అవసరం లేదు'

Published Sun, Nov 1 2015 7:04 PM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

'నీ సర్టిఫికెట్ నెహ్రూకు అవసరం లేదు'

'నీ సర్టిఫికెట్ నెహ్రూకు అవసరం లేదు'

భారత తొలి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూకి కేంద్రమంత్రి కిరేణ్ రిజిజు నుంచి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అన్నారు.

గువాహటి: భారత తొలి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూకి కేంద్రమంత్రి కిరేణ్ రిజిజు నుంచి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అన్నారు. ఇప్పటి వరకు తన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్కు కాస్తయినా మంచి చేయని కిరేణ్కు దేశం గర్వించదగిన మాజీ ప్రధాని గురించి మాట్లాడే యోగ్యత లేదన్నారు. శనివారం కిరేణ్ హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 1962నాటి ఇండియా చైనా యుద్ధ సమయంలో నెహ్రూ ఈశాన్య ప్రాంత ప్రజలను గాలికొదిలేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై గొగోయ్ ఆదివారం స్పందించారు.

నెహ్రూపై కేంద్రమంత్రి తప్పుడు ప్రచారం, అభాండాలు మోపడం మానుకుంటే మంచిదని చెప్పారు. ఎలాంటి క్లిష్టపరిస్థితులు చైనాతో ఏర్పడినా నెహ్రూ ప్రజలను వదిలేయలేదని, ఆయన సమర్థతను నిరూపించుకున్నారని, తన సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని ఓ కేంద్రమంత్రి(కిరేణ్) నుంచి సర్టిఫికెట్ పొందాల్సిన అవసరం నెహ్రూకు లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అరుణాచల్ ప్రదేశ్కు ఓ రాష్ట్రంగా గుర్తింపు వచ్చిందని, అభివృద్ధి బాటపట్టిందనే విషయం కిరేణ్ గుర్తుంచుకుంటే బాగుంటుందన్నారు. ఎన్డేయే హయాంలో అరుణాచల్ ప్రదేశ్కు ఏం చేశారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement