రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులకు రెండు రాష్ర్ట ప్రభుత్వాల ఆదేశం
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి కీలకమైన స్థానిక నిరూపణ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా రెండు రాష్ట్రాల్లోని రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సూచిం చాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు చెందిన ప్ర భుత్వ శాఖలన్నింటికీ తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు సంయుక్తంగా ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతు లు తమ పరిధిలో పనిచేస్తున్న రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులందరికీ స్థానికత నిరూపణ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించాలని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చే శారు. ఇప్పటినుంచే ఆ సర్టిఫికెట్లను సిద్ధం గా ఉంచుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలకు ఈ నెల 17 లేదా 18వ తేదీల్లో కేంద్రం ఆమోదం లభించే అవకావం ఉన్నం దున ఇప్పుడే అన్ని శాఖల నుంచి పోస్టులు, ఖాళీలు, ఉద్యోగుల వివరాలను సేకరించాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రాష్ట్రస్థాయి శాఖలు, విభాగాలు, ప్రాజెక్టుల్లోని పోస్టులు, ఖాళీలు, ఉద్యోగుల వివరాలను పంపించాలని స్పష్టం చేశారు.
ఏదైనా ఒక ప్రాంతానికి చెందిన ప్రాజెక్టుకు తీసుకున్న ఉద్యోగులను ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఇతర సంస్థల్లోకి తీసుకుంటే ఆ వివరాలను పేర్కొనాలని సూచించారు. అయితే ప్రాజెక్టు పూర్తయినందున ఆ ప్రాజెక్టు పోస్టులను ఖాళీగా చూపించరాదని సూచించారు. జూన్ 1వ తేదీ వరకు ఉన్న పోస్టులు, ఖాళీలు, ఉద్యోగుల వివరాలన్నింటినీ సంబంధిత కార్యదర్శి లేదా విభాగాధిపతి ధ్రువీకరిస్తూ సమాచారాన్ని అందజేయాలని పేర్కొన్నారు. ఆయా ఉద్యోగులపై నియంత్రణ ఉండి ఆర్థిక అంశాలను పర్యవేక్షించే అధికారం ఉన్నవాటినే విభాగాధిపతులుగా గుర్తించాలని తెలిపారు. రెండు రాష్ట్రాల శాఖలు ఈ రంగంలో అనుభవం ఉన్న అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించాలని సూచించారు.
స్థానికత సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి
Published Thu, Oct 9 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM
Advertisement