Distributed to employees
-
స్థానికత సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి
రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులకు రెండు రాష్ర్ట ప్రభుత్వాల ఆదేశం హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి కీలకమైన స్థానిక నిరూపణ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా రెండు రాష్ట్రాల్లోని రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సూచిం చాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు చెందిన ప్ర భుత్వ శాఖలన్నింటికీ తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు సంయుక్తంగా ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతు లు తమ పరిధిలో పనిచేస్తున్న రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులందరికీ స్థానికత నిరూపణ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించాలని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చే శారు. ఇప్పటినుంచే ఆ సర్టిఫికెట్లను సిద్ధం గా ఉంచుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలకు ఈ నెల 17 లేదా 18వ తేదీల్లో కేంద్రం ఆమోదం లభించే అవకావం ఉన్నం దున ఇప్పుడే అన్ని శాఖల నుంచి పోస్టులు, ఖాళీలు, ఉద్యోగుల వివరాలను సేకరించాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రాష్ట్రస్థాయి శాఖలు, విభాగాలు, ప్రాజెక్టుల్లోని పోస్టులు, ఖాళీలు, ఉద్యోగుల వివరాలను పంపించాలని స్పష్టం చేశారు. ఏదైనా ఒక ప్రాంతానికి చెందిన ప్రాజెక్టుకు తీసుకున్న ఉద్యోగులను ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఇతర సంస్థల్లోకి తీసుకుంటే ఆ వివరాలను పేర్కొనాలని సూచించారు. అయితే ప్రాజెక్టు పూర్తయినందున ఆ ప్రాజెక్టు పోస్టులను ఖాళీగా చూపించరాదని సూచించారు. జూన్ 1వ తేదీ వరకు ఉన్న పోస్టులు, ఖాళీలు, ఉద్యోగుల వివరాలన్నింటినీ సంబంధిత కార్యదర్శి లేదా విభాగాధిపతి ధ్రువీకరిస్తూ సమాచారాన్ని అందజేయాలని పేర్కొన్నారు. ఆయా ఉద్యోగులపై నియంత్రణ ఉండి ఆర్థిక అంశాలను పర్యవేక్షించే అధికారం ఉన్నవాటినే విభాగాధిపతులుగా గుర్తించాలని తెలిపారు. రెండు రాష్ట్రాల శాఖలు ఈ రంగంలో అనుభవం ఉన్న అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించాలని సూచించారు. -
సేవలు ఇక ఆంధ్రనుంచే !
- రేషన్ సరఫరాకు ముందుకొచ్చిన ఏపీ ప్రభుత్వం - డీడీలు చెల్లించాలని డీలర్లకు ఆదేశాలు - పింఛన్ల పంపిణీ అటు నుంచే - ఉద్యోగుల పంపకాలపై కసరత్తు భద్రాచలం : ముంపు మండలాల పాలనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి తమ ఆధీనంలోకి తీసుకుంటామని గెజిట్ జారీ చేసిన ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, ఇందుకనుగుణంగానే చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటి వరకూ ఖమ్మం జిల్లా పాలనలో సాగిన ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అజమాయిషీలోకి వెళ్లిపోయాయి. ముంపు మండలాల్లో పౌరసేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన నిత్యావసర సరుకులను తామే సరఫరా చేస్తామని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టరేట్ల నుంచి ఇక్కడి అధికారులకు లేఖ అందింది. సరుకుల సరఫరాకు డీడీలు తీసి తమకు అందజేయాలని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం అయిన చింతూరు, వీఆర్ పురం, కూనవరం, భద్రాచలం రూరల్ మండలాల్లో ఉన్న రేషన్ డీలర్లకు ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ ముత్యాల రాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రతులు సోమవారం నాలుగు మండలాల రెవెన్యూ అధికారులకు అందాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించి రేషన్, పంచదార, గోదుమలను అందజేసేందుకు సరుకులు కేటాయించారు. భద్రాచలం(నెల్లిపాక) మండలంలో ఉన్న 12,382 రేషన్ కార్డులకు గాను 190.216 మెట్రిక్ టన్నుల బియ్యం, కూనవరంలోని 8057 కార్డులకు 120.049 మెట్రిక్ టన్నులు, వీఆర్‌పురంలోని 7662 కార్డులకు 129.525 మెట్రిక్ టన్నులు, చింతూరు మండలంలోని 11,260 రేషన్‌కార్డులకు 172.015 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు. ప్రతి రేషన్‌కార్డు దారుడికి ఒక ప్యాకెట్ పంచదార, ఒక ప్యాకెట్ గోధుమలతో పాటు కార్డుల్లో ఉన్న లబ్ధిదారుల సంఖ్యను బట్టి బియ్యం కేటాయించారు. నాలుగు మండలాల్లో మొత్తం 39,361 రేషన్ కార్డులకు ఒక్కో కార్డుకు అరకిలో పంచదార, కిలో గోధుమ ప్యాకెట్లు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ పౌర సరఫరాల శాఖ పేరనే డీడీలు చెల్లించాలని రేషన్ డీలర్లను ఆదేశించారు. చింతూరులో ఉన్న స్టాక్ పాయింట్ నుంచి చింతూరు, వీఆర్ పురం మండలాలకు, భద్రాచలం స్టాక్ పాయింట్ నుంచి కూనవరం, భద్రాచలం మండలాలకు సరుకులు రవాణా చేయాలని భావించారు. అయితే భద్రాచలం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉండటంతో ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై భద్రాచలం ఆర్డీవో అంజయ్య సోమవారం రంపచోడవరం ఆర్డీవోతో చర్చించారు. మంగళవారం నాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని అక్కడి అధికారులు తెలిపారు. ముంపు మండలాలకు రేషన్ సరుకులను తామే సరఫరా చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చెప్పడంతో ఇక నుంచి అన్ని రకాల పౌరసేవ లు కూడా అటు నుంచే కొనసాగే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించనుంది. విలీనమైన మండలాల్లో ఎంత మంది.. ఏఏ రకాల పింఛన్ దారులు ఉన్నారనే దానిపై అక్కడి అధికారులు లెక్కలు వేస్తున్నారు. నేడో, రేపో దీనిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల పంపకాలపై కసరత్తు... ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాల్లో ఉద్యోగుల పంపకాలపై కసరత్తు మొదలైంది. ఆయా మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ఏ రాష్ట్రంలో పనిచేస్తారనే విషయమై ఇప్పటికే అంగీకార(ఆప్షన్) పత్రాలు తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో మన కలెక్టర్ ఇలంబరితి ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు మంగళవారం సమావేశమవుతున్న నేపథ్యంలో ముంపు ఉద్యోగుల పంపకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. అన్ని శాఖల్లో 80 శాతం మంది ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చేందుకు మొగ్గు చూపుతూ ఆప్షన్లు ఇచ్చారు. వారంతా ఎప్పుడు వెనక్కు వస్తామా లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయా శాఖల వారీగా ఉద్యోగుల సర్దుబాట్లుకు కౌన్సెలింగ్ ఉంటుందనే ప్రచారం ఉన్నప్పటికీ, దీనిపై ఇప్పటి వరకూ జిల్లా కలెక్టరేట్ నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవటంతో ఉద్యోగుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఏది ఏమైనా ముంపులో పనిచేస్తున్న తమకు సెప్టెంబర్ వేతనాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించాల్సి ఉండటంతో ఈ నెలలోనే పంపకాల ప్రక్రియ పూర్తి అవుతుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
కమలనాథన్ కమిటీకి 3వేల దరఖాస్తులు
ఆంధ్రా ఉద్యోగుల్లో ఎక్కువమంది సొంత రాష్ట్రానికే ఆప్షన్ హైదరాబాద్: శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల పంపిణీకి కమలనాథన్ కమిటీ రూపొం దించిన మార్గదర్శకాలపై ఉద్యోగుల నుంచి దాదాపు మూడు వేల వరకు దరఖాస్తులు వచ్చా యి. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులు చాలామంది స్వరాష్ట్రానికి వెళ్లడానికి ఆప్షన్ ఇవ్వగా, భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉన్నవారిలో ఎక్కువమంది తెలంగాణలోనే కొనసాగడానికి ఆప్షన్లు ఇచ్చినట్లు సమాచారం. భార్య ఉద్యోగం చేస్తూ, భర్త ఇక్కడ వ్యాపారం చేస్తున్న పక్షంలో.. భార్య స్థానికత ఆంధ్రా అయినప్పటికీ, వారు ఇక్కడే కొనసాగడానికి అవకాశం కల్పించాలన్న దరఖాస్తులు కూడా ఎక్కువగా వచ్చినట్లు తెలిసింది. తమ భర్తలు ఇక్కడి ప్రభుత్వానికి చెల్లిస్తున్న వ్యాట్ తదితర పన్నుల రశీదు పేపర్లను కూడా జత చేసినట్లు సమాచారం. పోలీసు అధికారులు కూడా పలు సూచనలు, ఆప్షన్ లేఖలు ఇచ్చారు. ఉద్యోగులు అభ్యంతరాలు, సూచనలు, సలహాలు క్రోడీకరించి కమల్‌నాథన్ కమిటీ తుది మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. -
భార్య, భర్త ఒకే రాష్ట్రానికి...
తుది మార్గదర్శకాల రూపకల్పనలో కమల్‌నాథన్ కమిటీ ఇద్దరిలో ఒకరు స్థానిక కేడర్‌లో ఉన్నాఇదే నిబంధన వర్తింపు ఇద్దరూ కలిపి ఏ రాష్ట్రం కోరితే అక్కడకు 13న కమిటీ తుది మార్గదర్శకాలు.. అనంతరం కేంద్రానికి నివేదిక హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీపై తుది మార్గదర్శకాల రూపకల్పనలో కమలనాథన్ కమిటీ నిమగ్నమైంది. భార్య, భర్త రాష్ర్టస్థాయి కేడర్ పోస్టుల్లో పనిచేస్తుంటే ప్రాంతాలతో సంబంధం లేకుండా వారిద్దరూ కోరుకున్న రాష్ట్రానికి కేటాయించాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. భార్య, భర్తలో ఒకరు స్థానిక కేడర్‌లో ఉన్నా ఇద్దరినీ ఒకే రాష్ట్రానికి కేటాయించాలని కూడా కమిటీ భావిస్తోంది. ఇద్దరిలో ఒకరు తెలంగాణ, ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారైనా వారిద్దరూ కోరుకున్న రాష్ట్రానికి కేటాయించేలా మార్గదర్శకాలపై కసరత్తు చేస్తోంది. భర్త రాష్ట్రస్థాయి కేడర్ పోస్టులో పనిచేస్తూ భార్య స్థానిక కేడర్ పోస్టులో పనిచేస్తున్నప్పటికీ, ఇద్దరినీ ఏదో ఒక రాష్ట్రానికి కేటాయించాలని భావి స్తోంది. ముసాయిదా మార్గదర్శకాల్లో ఈ అంశం లేదు. దీనిపై తుది మార్గదర్శకాల్లో స్పష్టత ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. తెలంగాణకు చెందిన భర్త రాష్ట్ర స్థాయి కేడర్‌లో పనిచేస్తూ భార్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్థానిక కేడర్ పోస్టులో పనిచేస్తుంటే వారిద్దరూ కోరుకున్న రాష్ట్రానికి కేటాయించనున్నారు. భార్యాభర్తల్లో ఒకరు రాష్ట్రస్థాయి కేడర్‌లో, మరొకరు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తుంటే, వారిద్దరినీ ఒకే రాష్ట్రంలో పనిచేసేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని కూడా కమిటీ భావిస్తోంది. ఉదాహరణకు భర్త రాష్ట్రస్థాయి కేడర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పని చేస్తూ, భార్య హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో పనిచేస్తుంటే భార్యను ఆంధ్రప్రదేశ్‌లో పీఎఫ్ కార్యాలయానికి బదిలీ చేయాలని సూచించనుంది. రెండు రాష్ట్రాల్లో స్థానిక కేడర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు సొంత రాష్ట్రాలకు వెళ్తామని దరఖాస్తు చేసుకుంటే అక్కడ ఖాళీలుండి, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే అందుకు కూడా వెసులుబాటు కల్పించాలని కమిటీ అభిప్రాయపడుతోంది. ఉదాహరణకు ఓపెన్ కేటగిరీలో మెరిట్‌పై కృష్ణా జిల్లాకు చెందిన ఉద్యోగి ఖమ్మం జిల్లాలో పనిచేస్తూ, ఇప్పుడు సొంత జిల్లాకు వెళ్లాలని కోరుకుంటే పోస్టుల ఖాళీ ఆధారంగా ఇరు రాష్ట్రాల అంగీకారం మేరకు అతన్ని కృష్ణా జిల్లాకు పంపేందుకు కమిటీ అనుమతించనుంది. తెలంగాణ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్న 18 ఎఫ్‌కు ఎటువంటి మినహాయింపులూ ఇవ్వరాదని కమిటీ భావిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్‌న్యూమరీ పోస్టులు లేదా కొత్త పోస్టులు ఏర్పాటు చేసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారమని స్పష్టం చేయనుంది. అలాగే లాస్ట్ గ్రేడ్ పోస్టులకు బదులు అటెండర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు అని తుది మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొనాలని నిర్ణయించింది. కమిటీ ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం సమావేశమై తుది మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. వాటిని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఆమోదానికి పంపనుంది. కాగా, ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఆ ప్రాంతంలోనే పనిచేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్‌న్యూమరీ పోస్టులు లేదా కొత్త పోస్టులు సృష్టించుకోవాల్సి ఉంది. పోస్టులు, కేడర్ సంఖ్య ఆధారంగా తెలంగాణ సచివాలయంలో 104 మంది ఏపీకి చెందిన సెక్షన్ ఆఫీసర్లు, వ్యక్తిగత కార్యదర్శులు పనిచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 104 మందికి సూపర్‌న్యూమరీ పోస్టులను గానీ, కొత్త పోస్టులను గానీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఇప్పటికే ఈ సూపర్‌న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబును, సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావును కోరిం ది. ఇలా చేయడంవల్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఆ రాష్ట్రంలోనే పనిచేసే అవకాశం కలుగుతుంది. మరోపక్క కేడర్ పోస్టుల ఆధారంగా తెలంగాణకు చెందిన 518 మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో సగం మంది నాలుగో తరగతి ఉద్యోగులే ఉన్నారు. తెలంగాణ సచివాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఈ సగం మందిని భర్తీ చేయవచ్చు. మిగిలిన ఏఎస్‌వోలు, సహాక కార్యదర్శులు, డిప్యుటీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం సూపర్‌న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేస్తే తెలంగాణకు చెందిన వారు సొంత రాష్ట్రంలోనే పనిచేయవచ్చు. -
త్వరగా పంపండి..
* నియామకాలన్నా ఆపండి.. * ఇరు రాష్ట్రాల సీఎంలకు ఏజేసీ ఎస్.ఎస్.రాజు లేఖ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడ పనిచేసేందుకు అంతగా ఆసక్తి చూ పడం లేదు. వీలైనంత త్వరగా సొంత రాష్ట్రానికి వెళ్లాలని యోచిస్తున్నారు. ఇందుకు నిదర్శనం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.ఎస్.రాజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడులకు ఓ లేఖ రాయడమే. తెలంగాణలో పనిచేస్తున్న తమను వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని, లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న నియామకాలనైనా ఉద్యోగుల పంపకాలు జరిగే వరకు నిలిపివేయాలని ఈ లేఖలో కోరారు. ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో పాటు, రెవెన్యూ శాఖల మంత్రులకు కూడా ఈ లేఖలను పంపారు. జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిల్లాస్థాయి అధికారులు సుమారు 40 మంది వరకు ఉంటారు. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 50 రోజులు దాటింది. ఈ ఉద్యోగుల పంపకాల విషయం ఎటూ తేలకపోవడంతో ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, ముఖ్యంగా జిల్లా ఉన్నతాధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఈ పంపకాలకు సంబంధించి సర్కారు నుంచి ఎప్పుడెప్పుడు ఉత్తర్వులు వస్తాయోనని వేచి చూస్తున్నారు. మరోవైపు సీమాంధ్ర అధికారులు వెళ్లిపోతే ఆ ఖాళీల్లో తమకు ఉన్నత ఉద్యోగావకాశాలు అందుతాయని మన రాష్ట్రానికి చెందిన అధికారులు ఆశాభావంతో ఉన్నారు. వీలైనంత తొందరగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులను ఆ రాష్ట్రానికి పంపాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. ఇరు ప్రాంతాల అధికారుల మనోభావాలు దెబ్బతినకముందే ప్రభుత్వాలు స్పందించాలని అంటున్నారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేసి ఇక్కడ పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులను అక్కడికి పంపాలని కోరుతున్నాను. అయితే.. ఉద్యోగుల పంపకాల కోసం నియమించిన కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఇంకా రాకపోవడంతో ఉద్యోగుల పంపిణీ విషయంలో జాప్యం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాప్యంతో ఏపీలో ప్రాధాన్యత కలిగిన పోస్టులన్నీ భర్తీ అవుతున్నాయని ఆ ప్రాంతానికి చెందిన అధికారులు వాపోతున్నారు. ఈ పంపకాల విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవచూపాలని వారు పేర్కొంటున్నారు.