Local proof
-
లోకల్ అడ్రస్‌ప్రూఫ్ ఉన్న వారికే టీకా..
లక్నో: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మే 1నే మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికి.. టీకాల కొరత వల్ల చాలా చోట్ల మొదలు కాలేదు. త్వరలోనే పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోకల్ వారికే వ్యాక్సిన్ వేస్తామని యూపీ అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్ వేయించుకునేవారు స్థానికులం అని రుజువు చేసే పత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారిక వెబ్సైట్లో సూచించారు. ఈ ఆదేశాల వల్ల చాలా మంది వలసకార్మికులు నష్టపోనున్నారు. వ్యాక్సిన్‌కు సంబంధించి కేంద్రం ఇలాంటి నిర్ణయం ఏది తీసుకోలేదు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే దేశపౌరులు ఎవరైనా సరే కేవలం కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరి. ఏ వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్నారు.. ఎక్కడ అనే విషయాలు తెలిపితే సరిపోతుందని కేంద్రం సూచించింది. కానీ యూపీ అధికారులు మాత్రం వ్యాక్సిన్ కావాలంటే ఆధార్, పాన్‌కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్‌లో ఏదో ఒకటి తప్పనసరిగా తీసుకురావాలని ఆదేశిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో మే 1 న 18-44 ఏళ్ల వయస్సు గలవారికి టీకా డ్రైవ్ ప్రారంభించగా.. తాజాగా మరో 11 జిల్లాల్లో మొదలు కానుంది. ఇండియాటుడే నివేదిక ప్రకారం, యూపీలో వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్న వారిలో అధిక సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. దీనివల్ల రాష్ట్రవాసులకు మొదట టీకా లభించదు. దీని గురించి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) డైరెక్టర్ అపర్ణ ఉపాధ్యాయ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని మంత్రివర్గానికి సమాచారం ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు కోవిడ్-19 వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం తమ సొంత డబ్బును పెట్టుబడి పెట్టిందని నివేదికలో వెల్లడించారు. దాంతో రాష్ట్ర ప్రజలకు మొదట టీకాలు వేసేలా ప్రభుత్వం లోకల్ అడ్రస్‌ప్రూఫ్ తప్పనిసరి చేసింది. ఇప్పటికే నోయిడా, ఘజియాబాద్‌లో టీకా తీసుకున్న వారిలో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారట. తాజా నిర్ణయంతో మొదట యూపీ వాసులకే టీకా దక్కనుంది. చదవండి: శుభవార్త: త్వరలోనే నాలుగో వ్యాక్సిన్?! -
స్థానికత సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి
రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులకు రెండు రాష్ర్ట ప్రభుత్వాల ఆదేశం హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి కీలకమైన స్థానిక నిరూపణ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా రెండు రాష్ట్రాల్లోని రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సూచిం చాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు చెందిన ప్ర భుత్వ శాఖలన్నింటికీ తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు సంయుక్తంగా ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతు లు తమ పరిధిలో పనిచేస్తున్న రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులందరికీ స్థానికత నిరూపణ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించాలని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చే శారు. ఇప్పటినుంచే ఆ సర్టిఫికెట్లను సిద్ధం గా ఉంచుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలకు ఈ నెల 17 లేదా 18వ తేదీల్లో కేంద్రం ఆమోదం లభించే అవకావం ఉన్నం దున ఇప్పుడే అన్ని శాఖల నుంచి పోస్టులు, ఖాళీలు, ఉద్యోగుల వివరాలను సేకరించాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రాష్ట్రస్థాయి శాఖలు, విభాగాలు, ప్రాజెక్టుల్లోని పోస్టులు, ఖాళీలు, ఉద్యోగుల వివరాలను పంపించాలని స్పష్టం చేశారు. ఏదైనా ఒక ప్రాంతానికి చెందిన ప్రాజెక్టుకు తీసుకున్న ఉద్యోగులను ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఇతర సంస్థల్లోకి తీసుకుంటే ఆ వివరాలను పేర్కొనాలని సూచించారు. అయితే ప్రాజెక్టు పూర్తయినందున ఆ ప్రాజెక్టు పోస్టులను ఖాళీగా చూపించరాదని సూచించారు. జూన్ 1వ తేదీ వరకు ఉన్న పోస్టులు, ఖాళీలు, ఉద్యోగుల వివరాలన్నింటినీ సంబంధిత కార్యదర్శి లేదా విభాగాధిపతి ధ్రువీకరిస్తూ సమాచారాన్ని అందజేయాలని పేర్కొన్నారు. ఆయా ఉద్యోగులపై నియంత్రణ ఉండి ఆర్థిక అంశాలను పర్యవేక్షించే అధికారం ఉన్నవాటినే విభాగాధిపతులుగా గుర్తించాలని తెలిపారు. రెండు రాష్ట్రాల శాఖలు ఈ రంగంలో అనుభవం ఉన్న అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించాలని సూచించారు.