ఏఎన్‌యూకి ఐఎస్‌వో సర్టిఫికెట్
ఏఎన్‌యూకి ఐఎస్‌వో సర్టిఫికెట్
Published Wed, Sep 14 2016 9:12 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌ఓ సర్టిఫికెట్ లభించింది. బుధవారం సాయంత్రం యూనివర్సిటీలో జరిగిన విలేకర్ల సమావేశంలో వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ ఈవిషయం వెల్లడించారు. ఈ ఏడాది జూలైలో ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ గుర్తింపు కమిటీ సభ్యులు ఏఎన్‌యూని సందర్శించి యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న ప్రమాణాలను అధ్యయనం చేశారని వీసీ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయా సంస్థల నాణ్యతా ప్రమాణాలను అధ్యయనం చేసి సర్టిఫికెట్‌ను జారీ చేసే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల అనుబంధ సంస్థ అయిన భారత దేశపు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ అధారిటీ సంస్థ టీఎన్‌వీ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సర్టిఫికెట్‌ను జారీ చేసిందన్నారు. టీఎన్‌వీ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ప్రగ్యేష్ కుమార్ సింగ్ సర్టిఫికెట్‌ను ఏఎన్‌యూకి జారీ చేశారని తెలిపారు. రెక్టార్ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, ఆర్ట్స్, సైన్స్ కాలేజ్‌ల ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎస్ విజయరాజు, ఆచార్య బి విక్టర్‌బాబు తదితరులు ఈసందర్భంగా వీసీకి అభినందనలు తెలిపారు.
Advertisement
Advertisement