ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :వీసాకోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్ల జెన్యునిటీ( నిజనిర్ధారణ) కోసం ఏఎన్‌యూకి పంపితే వాటి పరిశీలనలో జాప్యం జరుగుతోందని.. అటువంటి జాప్యం జరగకుండా చూడాలని అమెరికన్ కాన్సులేట్ ఫ్రాడ్ డివెన్షన్ మేనేజర్ అన్నా జెడ్ కేఫార్డ్ వర్సిటీ ఉన్నతాధికారులకు సూచించారు. అమెరికన్ కాన్సులేట్ అధికారుల బృందం సోమవారం వర్సిటీని సందర్శించింది. అమెరికన్ కాన్సులేట్ నుంచి జన్యునిటీ కోసం ఏఎన్‌యూకి పంపిన సర్టిఫికెట్లపై ఆమె వీసీ ఆచార్య కె.వియ్యన్నారావుతో చర్చించారు. పెండింగ్‌లో ఉన్న సర్టిఫికెట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జన్యునిటీ కోసం కాన్సులేట్ పంపిన సర్టిఫికెట్ల ప్రక్రియ వారంలోగా పూర్తి చేయాలని వీసీ, యూనివర్సిటీ సీఈకి సూచించారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య రామసుబ్బయ్య, రిజిస్ట్రార్ కాంతం, సీడీసీ డీన్ ఆచార్య చలం, సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపల్స్ ఆచార్య ఏవీఏ దత్తాత్రేయరావు, డాక్టర్ పీపీఎస్ పాల్‌కుమార్, ఆచార్య ఈ.శ్రీనివాసరెడ్డి, ఆచార్య ఎ.ప్రమీలారాణి, సీఈ డి.సత్యన్నారాయణ, ఏసీఈ ఎం.సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై అవగాహన కల్పించేందుకు వర్సిటీ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులకు మంగళవారం మధ్యహ్నం 2 గంటలకు వర్సిటీ డైక్‌మెన్ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం జరుగుతుందని వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు తెలిపారు.
సర్టిఫికెట్ల పరిశీలనలో జాప్యం వద్దు
Published Tue, Nov 5 2013 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM
Advertisement
Advertisement