
సచిన్‌కు ‘గిన్నిస్’ గౌరవం!
ప్రపంచ వ్యాప్తంగా అరుదైన సంఘటనలు, రికార్డులను గుర్తించే గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ.
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా అరుదైన సంఘటనలు, రికార్డులను గుర్తించే గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ... మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. గిన్నిస్ సంస్థ 60 ఏళ్ల వార్షికోత్సవ ఉత్సవాల సందర్భంగా మాస్టర్‌ను సర్టిఫికెట్, పతకం (జీడబ్ల్యుఆర్ టైటిల్)తో ఘనంగా సత్కరించింది.
24 ఏళ్ల కెరీర్‌లో ఈ క్రికెటర్ సాధించిన ఘనతలకు గుర్తుగా దీన్ని అందజేశారు. ఇప్పటికే సచిన్ పేరిట 19 గిన్నిస్ రికార్డులున్నాయి. ‘60 ఏళ్ల వార్షికోత్సవ ఉత్సవాల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. క్రికెట్ కెరీర్‌లో నేను సాధించిన ఘనతలను చూసి గర్వపడుతున్నా. దిగ్గజాల సరసన చోటు దక్కడం ప్రత్యేకంగా అనిపిస్తోంది’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. ఉసేన్ బోల్ట్, రాడ్‌క్లిఫ్, రెడ్‌గ్రేవ్, ఫరా, లిన్‌ఫోర్డ్ క్రిస్టీ, లిసికి లను కూడా జీడబ్ల్యూఆర్ గౌరవించింది.