
అనంతపురం: ఏపీ ఈఏపీసెట్–2023 పరీక్ష రాసినవారు ఈ నెల 20లోపు తమ ఇంటర్ సర్టిఫికెట్లను ఏపీ ఈఏపీసెట్ స్టూడెంట్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సెట్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, కన్వీనర్ ప్రొఫెసర్ సి.శోభాబిందు శుక్రవారం తెలిపారు. ఏపీ ఈఏపీసెట్–2023లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీ ఈఏపీసెట్‌లో మొత్తం 2,52,717 మంది అర్హత సాధించారు. వీరిలో ఇంకా 42వేల మంది విద్యార్థులకు ఇంటర్ వెయిటేజీ ప్రకారం ర్యాంకులు ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్ మార్కుల జాబితాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, తదితర బోర్డుల పరీక్షలు రాసినవారు సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment