
ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి
వీఆర్వో పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన మంగళవా రం సాయంత్రానికి పూర్తయింది. మొత్తం 62మంది అభ్యర్థుల్లో మాజీ సైనికుల కోటాలో వచ్చిన ఇద్దరిని అధికారులు తిరస్కరించారు.
కలెక్టరేట్, : వీఆర్వో పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన మంగళవా రం సాయంత్రానికి పూర్తయింది. మొత్తం 62మంది అభ్యర్థుల్లో మాజీ సైనికుల కోటాలో వచ్చిన ఇద్దరిని అధికారులు తిరస్కరించారు.
వీరిలో ఒకరు గతంలో వీఆర్‌ఏగా కొంతకాలం పనిచేసి మానేశారు. దాన్ని ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాగా చెప్పడం వల్ల, మరొకరు ఇప్పటికీ విధుల్లో కొనసాగుతూ శాఖాపరమైన అనుమతి లేకుండా పరీక్ష రాసినందున అధికారులు తిరస్కరించారు. వీరిని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి వనజ అనర్హులుగా తేల్చారు. వీరిపై కేసులు నమోదు చేయాలంటూ ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో ఎంపిక జాబితా ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు.