సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలు వేగంగా రూపొందుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టౌన్షిప్స్ నిర్మాణాలు జరుగుతున్నా యి. వీటిల్లో వేలాది కూలీలు, ఉద్యోగులు పనులు చేస్తున్నారు. కానీ వీరి రక్షణను పర్యవేక్షించే ఏర్పాటు లేదు. ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. ఆ నిర్మాణ పనుల్లో లోపాలెక్కడ ఉన్నాయో గుర్తించే ఏర్పాటు లేకపోవటమే దీనికి కారణం. విదేశాల్లో భారీ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు కన్‌స్ట్రక్షన్ సేఫ్టీ సూపర్‌వైజర్లు ఉంటారు. సై ట్‌లో ఎక్కడెక్కడ లోపాలు ఏర్పడుతున్నాయో గుర్తించి వాటిని సరిదిద్దటం అతని విధి. కానీ దేశంలో ఇలాంటి ప్రత్యేక వ్యవస్థ లేదు. దీంతో ప్రతి భారీ భవన నిర్మాణంలో కచ్చితంగా కన్‌స్ట్రక్షన్ సేఫ్టీ సూపర్‌వైజర్లను నియమించుకోవాలని ప్రభుత్వం సూచించబోతోంది. ఈ నేపథ్యంలో భద్రతా నిపుణులను తయారు చేసేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) కొత్తగా 6 నెలల సర్టిఫికేషన్ కోర్సు ప్రారంభిస్తోంది. శిక్షణ పూర్తిగా న్యాక్ ఇవ్వనుండగా, సర్టిఫికెట్ మాత్రం సాంకేతిక విద్యా శాఖ జారీచేయనుంది. కెమికల్ ఇండస్ట్రీ సేఫ్టీ విషయంలో శిక్షణకు కొన్ని ప్రై వేటు సంస్థలున్నా, నిర్మాణ రంగంలో రక్షణకు సంబంధించిన శిక్షణ మాత్రం తొలిసారి న్యాక్ చేపడుతోంది.
వీరు ఏం చేస్తారంటే..
బహుళ అంతస్తు నిర్మాణాల్లో ఎత్తులో ఉండి పనిచేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బాగా ఎత్తులో పనిచేసే వారి రక్తపోటు (బీపీ) నియంత్రణలో ఉందో లేదో చూసుకోవాలి. లేకుంటే ఎత్తు ప్రభావం వల్ల కళ్లు తిరిగి పడిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది.
► సెల్లార్ గుంతలు తవ్వేటప్పుడు సమీపంలోని ఇతర భవనాల పునాదులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలి.
► విద్యుత్తు పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
► పై అంతస్తులకు నిర్మాణ సామగ్రి తరలించే లిఫ్టు వైర్లు, బకెట్లు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.
► ఈ బాధ్యతలు మొత్తం నిర్వహించటమే కన్‌స్ట్రక్షన్ సేఫ్టీ సూపర్‌వైజర్ విధి.
ఏ డిగ్రీ ఉన్నా అర్హులే
ఇది ఆరునెలల సరి్టఫికెట్ కోర్సు. ఏ డిగ్రీ ఉన్న వారైనా ఈ కోర్సును చేయవచ్చు. సాంకేతిక విద్యాశాఖ నుంచి అనుమతికి రాగానే... త్వరలో 25 మందితో తొలిబ్యాచ్‌ను ప్రారంభించేందుకు న్యాక్ ఏర్పాట్లు చేస్తోంది.
ప్రమాదాలు తగ్గించేందుకు ఉపయోగం
ప్రమాదాలు తగ్గించాలంటే నిర్మాణంలో ప్రతి అంశంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ప్రతిరోజూ కార్మికులకు రక్షణపై బ్రీఫింగ్ ఉండాలి. సేఫ్టీ డ్రిల్ అవసరం. ఇవన్నీ చేసేందుకు కన్‌స్ట్రక్షన్ సేఫ్టీ సూపర్‌వైజర్లు ఉండాలి. వారిని తయారు చేసేందుకే ఈ శిక్షణ. ముంబై మినహా మరెక్కడా ఈ శిక్షణ లేదు. తెలుగురాష్ట్రాల్లో తొలిసారి న్యాక్ చేపడుతోంది. డిమాండ్ ఆధారంగా ఈ కోర్సు సీట్ల సంఖ్య పెంచుతాం.
– భిక్షపతి, న్యాక్ డైరెక్టర్ జనరల్
కోవిడ్ ట్రాకర్
► ఏపీలో గత 24 గంటల్లో 64,099 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 478 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 7,067కు చేరింది.
► తెలంగాణలో ఇప్పటివరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షలు 62,57,745.. కాగా అందులో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 2,79,135
► మంగళవారం చేసిన నిర్ధారణ పరీక్షల సంఖ్య 52,057... అందులో నమోదైన కరోనా కేసులు 536
► మొత్తం ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాలు 1,502... అందులో మంగళవారం ముగ్గురు చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment