కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ఇచ్చే అధికారం తహసీల్దార్లకు కల్పిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ జె.సి.శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాక్షి, హైదరాబాద్: కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ఇచ్చే అధికారం తహసీల్దార్లకు కల్పిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ జె.సి.శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం కోసం మొదట మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేయాలి.
ఈ దరఖాస్తుకు కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్లు, అఫిడవిట్, మృతి చెందిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్, రేషన్ కార్డు లేదా ఓటర్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలను జత చేయాలి. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే 15 రోజుల్లోపు ధ్రువీకరణ పత్రం ఇచ్చేస్తారు.